వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

2023లో అధికారంలోకి రావాలన్నదే లక్ష్యం : టీపీసీసీ మార్పుపై చెప్పలేను : ఏఐసీసీ ఇంచార్జ్ మణిక్కం ఠాగూర్

|
Google Oneindia TeluguNews

తెలంగాణ రాష్ట్రంలో 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే లక్ష్యంగా పని చేస్తామని చెప్పారు ఏఐసిసి ఇంచార్జి మణిక్కం ఠాగూర్ . నిన్నటికి నిన్న బిజెపిలో జాతీయ కమిటీలో స్థానం దక్కిన డీకే అరుణ, డాక్టర్ కె.లక్ష్మణ్ లు 2023 ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని ప్రజాక్షేత్రంలోకి వెళ్తామని, అధికారంలోకి రావడమే తమ టార్గెట్ అని తేల్చి చెప్పారు. ఇక తాజాగా కాంగ్రెస్ పార్టీ కూడా 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం తమ విజన్ అంటోంది.

Recommended Video

Watch New AICC Telangana Incharge Manickam Tagore Meets Party Leaders | Oneindia Telugu
గవర్నర్ అనుమతి ఇవ్వకపోవటంపై మణిక్కం ఠాగూర్ అసహనం

గవర్నర్ అనుమతి ఇవ్వకపోవటంపై మణిక్కం ఠాగూర్ అసహనం

ఈరోజు నూతన వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా నిరసన తెలియ చేసిన కాంగ్రెస్ పార్టీ నేతలు రాజ్ భవన్ కు వెళ్లి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ని కలిసి వినతి పత్రం ఇవ్వాలనుకున్నారు. అయితే అందుకు అనుమతి లేని కారణంగా పోలీసులు కాంగ్రెస్ పార్టీ నాయకులను అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో తాజా రాజకీయ పరిణామాలపై నూతనంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జిగా వచ్చిన మణిక్కం ఠాగూర్ మాట్లాడారు. దేశంలో ప్రతీ రాష్ట్రంలో గవర్నర్లు వినతిపత్రాలు తీసుకుంటే, ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే గవర్నర్ అనుమతి ఇవ్వలేదంటూ అసహనం వ్యక్తం చేశారు.

2023 ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి మైలురాయి

2023 ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి మైలురాయి

2023 ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి మైలురాయి అని పేర్కొన్నారు. మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందని పేర్కొన్న ఆయన తెలంగాణ రాష్ట్రంలో అధికారం కోసం అడుగులు వేస్తామన్నారు.
తనకు తెలంగాణ రాష్ట్రం కొత్త అన్నారాయన . అనుకున్నది సాధించాలంటే నాయకుల మధ్య యూనిటీ ఉండాలని పేర్కొన్నారు. అలా అని తెలంగాణ నాయకుల మధ్య యూనిటీ లేదని కాదని వ్యాఖ్యానించారు మణిక్కం ఠాగూర్.

 టీపీసీసీ చీఫ్ మార్పు గురించి తానేమీ చెప్పలేను

టీపీసీసీ చీఫ్ మార్పు గురించి తానేమీ చెప్పలేను


మోడీ , కేసీఆర్ విధానాలపై పోరాడుతామని పేర్కొన్న ఆయన టీపీసీసీ చీఫ్ మార్పు గురించి తానేమీ చెప్పలేనని అన్నారు. దుబ్బాక ఉప ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే టీఆర్ఎస్, బీజేపీ ప్రచారం మొదలు పెట్టినా, అభ్యర్థుల ప్రకటనలో కొత్త విధానంతో కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళుతుందని , కుందేలు తాబేలు కథలో తాబేలే గెలిచిందని చెప్పారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలను ఇండియన్ క్రికెట్ టీం తో పోల్చారు.

కాంగ్రెస్ గ్రూపుల పై స్పందిస్తూ యూనిటీ తో 2023 ఎన్నికల్లో విజయం సాధిస్తామన్నారు.

ఎమ్మెల్సీగా కోదండ రాం కు మద్దతుపై కోర్ కమిటీ సూచన మేరకు నిర్ణయం

ఎమ్మెల్సీగా కోదండ రాం కు మద్దతుపై కోర్ కమిటీ సూచన మేరకు నిర్ణయం

వరంగల్ ఖమ్మం నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కోదండరామ్ కు మద్దతుపై కోర్ కమిటీలో చర్చించామని కోర్ కమిటీ సూచన మేరకు తుది నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ప్రజలు చాలా ఎమోషనల్ గా ఉంటారు అంటూ వ్యాఖ్యానించారు. తెలంగాణ పిసిసి అధ్యక్ష పదవిపై తుది నిర్ణయం ఏఐసిసి అధ్యక్షురాలి చేతిలో ఉంటుందని పేర్కొన్న మణిక్కం ఠాగూర్ 2023 ఎన్నికలను టార్గెట్ చేసుకొని కాంగ్రెస్ పార్టీ ఐక్యంగా ముందుకు వెళుతుందని, అధికారంలోకి రావడమే లక్ష్యంగా ముందుకు సాగుతామని పేర్కొన్నారు.

English summary
AICC in-charge manickam tagore said they would work towards the goal of forming a Congress government in the 2023 elections in Telangana state. Regarding the Dubbaka by-election, he made remarks on congress party support for Kodandaram in the Warangal Khammam Nalgonda Graduate MLC elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X