హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఢిల్లీ అల్లర్లు, మూకదాడులపై ఒవైసీ సంచలన ట్వీట్..పొయెట్: అయిదుకు చేరిన మృతుల సంఖ్య

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా అమలు చేయడానికి ఉద్దేశించిన పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా న్యూఢిల్లీలో చోటు చేసుకుంటోన్న హింసాత్మక పరిస్థితులు, మూకదాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇతర ప్రాంతాలకు అవి విస్తరిస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుటుంబంతో సహా న్యూఢిల్లీకి చేరుకున్న ప్రస్తుత పరిస్థితుల్లో దేశ రాజధానితో పాటు ఉత్తర ప్రదేశ్‌లో భారీగా హింసాత్మక ఘటనలు నమోదు కావడం, ఏకంగా అయిదుమంది దుర్మరణం పాలు కావడం పట్ల ఆందోళన వ్యక్తమౌతోంది. పెద్ద ఎత్తున పారామిలటరీ బలగాలను మోహరించినప్పటికీ.. అవి తగ్గుముఖం పట్టలేదు.

Recommended Video

3 Minutes 10 Headlines | #MeToo | Namaste Trump | Anti CAA Row | Oneindia Telugu

మూకదాడులపై ట్వీట్..
ఈ వరుస ఘటనలపై అఖిల భారత మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ అధినేత, హైదరాబాద్ లోక్‌సభ సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ సంచలనాత్మక ట్వీట్ చేశారు. ఓ వ్యక్తిపై చోటు చేసుకున్న మూకదాడులకు సంబంధించిన రెండు ఫొటోలను ఆయన తన అధికారిక ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు. వాటిని షేర్ చేశారు. ప్రముఖ ఉర్దూ రచయిత అమీర్ అజీజ్ రాసిన కవితలోని కొన్ని వాక్యాలను ఆయన ఈ ఫొటోలకు జత చేశారు.

AIMIM Chief and Hyderabad MP Asaduddin Owaisi tweeted mob attack on a man

ఉత్తర ప్రదేశ్‌కు పాకిన అల్లర్లు..
ఇదిలావుండగా- దేశ రాజధానిలో చోటు చేసుకున్న అల్లర్లు పొరుగునే ఉన్న ఉత్తర ప్రదేశ్‌కు వ్యాపించాయి. ఘజియాబాద్, అలీగఢ్, బులంద్ షహర్‌లల్లో అల్లర్లు చెలరేగాయి. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళనలు, ప్రదర్శనలు చోటు చేసుకున్నాయి. అలీగఢ్‌లో నిర్వహించిన ప్రదర్శనలు హింసాత్మక పరిస్థితులకు దారి తీశాయి. సకాలంలో పోలీసులు వాటిని నియంత్రించగలగినప్పటికీ.. అక్కడి పరిస్థితులు మాత్రం నివురు గప్పిన నిప్పులా ఉన్నాయి. ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థతి ఏర్పడింది.

English summary
All India Majlis-e-Ittehadul Muslimeen Chief and Hyderabad Lok Sabha member Asaduddin Owaisi tweetd on his official twitter account of mob attackers photo and he wrote a poem on the attack. After Clashes erupted in Northeast Delhi between supporters and opponents of the Citizenship Amendment Act on Monday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X