హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

షాకింగ్: పురానాపూల్ బ్రిడ్జి డ్యామేజ్? - హైదరాబాద్‌లో మళ్లీ భారీ వర్షం - పనిచేయని ఐఎండీ రాడార్

|
Google Oneindia TeluguNews

400ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన హైదరాబాద్ మహానగరం తొలిసారి విపత్తులో కూరుకుపోయింది. వాన చినుకును చూస్తేనే జనం బెంబేలెత్తిపోయే స్థాయిలో వరుణుడు విలయం సృష్టిస్తున్నాడు. మంగళ, శనివారాల్లో కురిసిన వర్షాలకు సిటీ అతలాకులమైపోగా.. తాజాగా సోమవారం సాయంత్రం కూడా నగరంలోని చాలా ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. కష్టాలన్నీ కూడబలుక్కుని వచ్చినట్లుగా.. మూసీనది ప్రమాదకర స్థాయిని మించి ఉప్పొంగుతుండటంతో దానిపై నిర్మించిన చారిత్రక పురానాపూల్ వంతెన ధ్వంసమైందంటూ వీడియోలు వైరల్ అయ్యాయి. మరోవైపు హైదరాబాద్ వతావరణ కేంద్రం రాడార్ వ్యవస్థ పనిచేయడంలేదు.

క్రిస్మస్‌ నాటికి చెదపురుగులు నాశనం-జగన్‌కు మోదీ మద్దతు వట్టి సొల్లు - ఎంపీ రఘురామ షాకింగ్ కామెంట్స్క్రిస్మస్‌ నాటికి చెదపురుగులు నాశనం-జగన్‌కు మోదీ మద్దతు వట్టి సొల్లు - ఎంపీ రఘురామ షాకింగ్ కామెంట్స్

 ఇవీ తాజా వర్షపాతం లెక్కలు

ఇవీ తాజా వర్షపాతం లెక్కలు

సోమవారం ఉదయం సిటీలో అక్కడక్కడా ఎండ కాసినా, సాయంత్రానికి అన్ని ప్రాంతాల్లో మేఘావృతంగా మారి చీకట్లు అలముకున్నాయి. సాయంత్రం నాలుగు గంటల సమయానికే కూకట్ పల్లిలో 25.8మిల్లీమీటర్లు, బోరబండ 25.5 మి.మీ, ఉప్పల్ 25.5 మి.మీ, కుత్పుల్లాపూర్ 25.3, చార్మినార్ 22.3, బహదూర్ పురా 13.5, సైదాబాద్ 11.5, బండ్లగూడ 11.5, నాంపల్లి 10.5, తిరుమలగిరి 9.8, ముషీరాబాద్ 9.3, అమీర్ పేట్ 5.3, హిమాయయత్ సాగర్ లో 4.8మి.మీ, అంబర్ పేటలో 4.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఎడతెరపిలేకుండా కురుస్తుండటంతో వర్షపాతం భారీగా నమోదయ్యే అవకాశముంది.

ట్రాఫిక్ కష్టాలు.. లోతట్టులో నరకం..

ట్రాఫిక్ కష్టాలు.. లోతట్టులో నరకం..

ఇప్పటికే చిత్తడిగా మారిన హైదరాబాద్ లోతట్టు ప్రాంతాలు తాజా వర్షానికి మరిత వణికిపోయాయి. చాలా ప్రాంతాలు వారం రోజులుగా నీటిలోనే ఉన్నాయి. సోమవారం సాయంత్రం కూడా పలు కూడళ్లలో ట్రాఫిక్ జామ్ అయింది. ఒకవైపు ట్రాఫిక్ జామ్ మరోవైపు భారీ వర్షంతో వాహనదారులు అవస్థలు పడ్డారు. వరద నీరు ఇళ్లలోకి చేరడంతో నిత్యావసరాలు, దుస్తులు పూర్తిగా పాడైపోగా, ప్రజల్ని పునరావాస కేంద్రాలకు తరలించిన ప్రభుత్వ యంత్రాంగం వారికి భోజనం, మందులు, దుప్పట్లు తదితర సౌకర్యాలు కల్పిస్తున్నది. లోటత్తు ప్రాంతాల్లో నీరు తగ్గుముఖం పడుతోందనుకునేలోపే మళ్లీ వర్షాలు కురుస్తుండటంతో జనం ఇబ్బందులు వర్ణనాతీతంగా మారాయి. మరోవైపు..

 పురానాపూల్ డ్యామేజ్?

పురానాపూల్ డ్యామేజ్?

హైదరాబాద్ సహా మూసీ ఎగువ ప్రాంతమైన రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలోనూ భారీ వర్షాలు కురుస్తుండటంతో నదికి వరద పోటెత్తడం తెలిసిందే. గడిచిన వారం రోజులుగా మూసీ పరివాహక ప్రాంతాల్లో భీతావాహ దృశ్యాలు కనిపించాయి. ఈలోపే పురానాపూల్ వంతెన డ్యామేజ్ అయిందంటూ షాకింగ్ వీడియోలు నెట్టింట వైరల్ అయ్యాయి. ఓల్డ్ సిటీని టప్పాఛబూత్రా ప్రాంతాన్ని ధూట్ పేటతో కలుపుతూ మూసీ మీదుగా నిజాం హయాంలో పురానాపూల్ నిర్మించారు. వీడియోలు వైరలైన తర్వాత వివిధ శాఖల ఇంజనీర్లు, పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలన జరిపారు. వీడియోల్లో దెబ్బతిన్నట్లుగా కనిపిస్తున్నది నిజాం కాలంనాటి పురానా పూల్ కాదని, దాని పక్కనే 35 ఏళ్ల కిందట నిర్మించిన వంతెన అయిని, పిల్లర్లు వంకరగా ఉండటం నిర్మాణ విధానమేగానీ, డ్యామేజ్ వల్ల కలిగింది కాదని జీహెచ్ఎంసీ చీఫ్ ఇంజనీర్(మెయింటెనెన్స్) మొహ్మద్ జియాఉద్దీన్ మీడియాకు వివరించారు. వరద తాకిడికి వంతెన పెచ్చులు ఊడి, ఐరన్ రాడ్లు బయటికి తేలిన నేపథ్యంలో జాగ్రత్త చర్యగా ట్రాఫిక్ ను నియంత్రించాలని పోలీసులకు సూచించినట్లు ఆ అధికారి తెలిపారు.

Recommended Video

#HyderabadFloods:Golconda Fort Wall Collapses బాలానగర్ చెరువుకు గండి, ప్రమాద స్థాయికి ఉప్పల్ చెరువు
పనిచేయని ఐఎండీ రాడార్

పనిచేయని ఐఎండీ రాడార్

ఓవైపు హైదరాబాద్ లో వానలు దంచికొడుతుంటే.. హైదరాబాద్ వాతావరణ శాఖ(ఐఎండీ) కేంద్రం అనుకోని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. హైదరాబాద్ ఐఎండీకి చెందిన రాడార్లు ఆదివారం నుంచి పనిచేయడం లేదు. మెయింటెనెన్స్ లో భాగంగా రాడార్ల పనితీరును పరీక్షిస్తుండటంతో రెగ్యులర్ పనికి ఆటంకం ఏర్పడింది. దీంతో హైదరాబాద్ వాతావరణ కేంద్రం.. ఏపీలోని మచిలీపట్నం వాతావరణ కేంద్రంపై ఆధారపడింది. గత కొద్ది గంటలుగా మచిలీపట్నం కేంద్రం అందిస్తోన్న సమాచారాన్నే హైదరాబాద్ ఐఎండీ ప్రకటిస్తున్నది. కొద్ది గంటల్లోనే రాడార్ అందుబాటులోకి వస్తుందని అధికారులు చెబుతున్నారు.

4వ శక్తిమంతమైన దేశంగా భారత్ - 'ఆసియా-పసిఫిక్'లో అమెరికా-చైనా పోటాపోటీ - గేమ్ ఛేంజర్ కరోనా4వ శక్తిమంతమైన దేశంగా భారత్ - 'ఆసియా-పసిఫిక్'లో అమెరికా-చైనా పోటాపోటీ - గేమ్ ఛేంజర్ కరోనా

English summary
The city of fortune is being traded by rain. The rain means the city dwellers are running out. Heavy rains lashed Hyderabad again on Monday evening. videos of Historical Puranapul bridge, which was said tobe damaged due to latest rains went viral on social media. other side imd radar is under annual preventive maintenance.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X