హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కేసీఆర్‌తో భేటీ: విందు అనంతరం కొత్త ఫ్రంట్, తాజా రాజకీయాలపై చర్చ

|
Google Oneindia TeluguNews

Recommended Video

అఖిలేశ్-కేటీఆర్ సరదా సంభాషణ

హైదరాబాద్: దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పే లక్ష్యంగా పెట్టుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్ రావు బుధవారం ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ కుమార్ యాదవ్‌తో భేటీ అయ్యారు. బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రగతి భవన్‌కు చేరుకున్న అఖిలేష్ యాదవ్‌కు మొదట కేసీఆర్ విందు ఇచ్చారు.

Akhilesh Yadav met Telangana Chief Minister and TRS chief KC Rao

ఈ కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇతర నేతలు పాల్గొన్నారు. భోజనం అనంతరం తాజా రాజకీయ పరిస్థితులపై నేతలు చర్చించుకున్నారు. అంతకుముందు లక్నో నుంచి బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న అఖిలేష్‌కు మంత్రులు కేటీఆర్, తలసాని ఘన స్వాగతం పలికారు.

బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు వ్యతిరేకంగా కొత్త ఫ్రంట్ తీసుకొస్తామని చెప్పిన కేసీఆర్.. ఇప్పటికే ఆ దిశగా అడుగులు వేస్తున్న విషయం తెలిసిందే. పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, మాజీ ప్రధాని, జేడీఎస్ నేత దేవెగౌడ, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి, జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్‌తో కేసీఆర్ ఇప్పటికే చర్చలు జరిపారు.

English summary
Samajwadi Party President Akhilesh Yadav met Telangana Chief Minister and TRS chief KC Rao in Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X