• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

చార్మీ సహా అందరికీ అకున్ గట్టి జవాబు, అందుకే సినీ స్టార్స్ పేర్లు!

|

హైదరాబాద్: డ్రగ్ కేసు వ్యవహారంలో సినిమా వాళ్లనే టార్గెట్ చేస్తున్నారన్న విమర్శలపై ఎక్సైజ్ ఎన్‌ఫోర్సుమెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ సోమవారం గట్టి కౌంటర్ ఇచ్చారు.

రామ్ గోపాల్ వర్మ, ఆర్ నారాయణ మూర్తి సహా పలువురు సినిమా పరిశ్రమనే టార్గెట్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బలవంతంగా నమూనాలు సేకరిస్తున్నారని చార్మీ ఏకంగా హైకోర్టుకు ఎక్కారు.

కెల్విన్ అమాయకుడంటూ.. లాయర్ ఆసక్తికర వ్యాఖ్యలు

పరిశ్రమను టార్గెట్ చేస్తున్నారని చాలామంది విమర్శలు చేస్తున్నారు. అయితే, అకున్ వీటికి గట్టి సమాధానం చెప్పారు. తాము ఎంతమందిని విచారించామో లెక్కతో సహా చెప్పారు. ఒక్కరిని టార్గెట్ చేస్తున్నామని చెప్పడం సరికాదన్నారు.

అకున్ సబర్వాల్ వివరణ నేపథ్యంలో.. కేవలం సినిమా వాళ్లు అనే కారణంతోనే కొందరి పేర్లు హైలెట్ అవుతున్నట్లుగా కనిపిస్తోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఆ తర్వాత జడ్జి చూసుకుంటారు... చార్మీకి కౌంటర్

ఆ తర్వాత జడ్జి చూసుకుంటారు... చార్మీకి కౌంటర్

కొందరు తమపై కోర్టుకు వెళ్లారని చార్మీ పేరు చెప్పకుండా అకున్ అన్నారు. లేడీస్ ఎక్కడ కావాలంటే అక్కడ విచారిస్తామని చెప్పారు. కోర్టును ఆశ్రయించినట్టు తమ దృష్టికి వచ్చిందని, అధికారికంగా తమకెలాంటి పత్రాలు రాలేదన్నారు. ఎట్టిపరిస్థితుల్లోనూ తాము దౌర్జన్యంగా విచారించే ప్రసక్తేలేదన్నారు. రక్తనమూనాలు, బ్లడ్ శాంపిల్స్ బలవంతంగా తీసుకుంటున్నారని ఆరోపించడం సరికాదన్నారు. వారు అంగీకరిస్తేనే తీసుకుంటామని, లేదంటే కేసు డైరీలో రాస్తామని, ఆ తర్వాత జడ్జి చూసుకుంటారని చెప్పారు. విచారణలో మహిళా అధికారులు కూడా ఉన్నారని చెప్పారు. ఇద్దరి నుంచి నమూనాలు సేకరించామన్నారు.

విచారణ ఇలా..

విచారణ ఇలా..

ఓ గదిలో కూర్చోబెట్టి విచారణ జరుపుతున్నామని అకున్ చెప్పారు. ప్రతి రోజు నలుగురు అధికారుల బృందం వారిని ప్రశ్నిస్తోందన్నారు. డ్రగ్ కేసులో స్కూల్ పిల్లల పేర్లు ఎట్టి పరిస్థితుల్లో బయట పెట్టమని తేల్చి చెప్పారు. వారి పేర్లు చెబితే భవిష్యత్తు నాశనమవుతుందన్నారు. వారి తల్లిదండ్రులను పిలిచి కౌన్సెలింగ్ ఇస్తున్నామన్నారు.

వీడియో తీస్తున్నాం..

వీడియో తీస్తున్నాం..

విచారణపై ఎవరికీ అనుమానాలు అక్కర్లేదని అకున్ తేల్చి చెప్పారు. విచారణను వీడియో తీస్తున్నామని చెప్పారు. అందరినీ సమానంగా ట్రీట్ చేస్తున్నామన్నారు. వీడియోలు కోర్టులో జమ చేస్తామన్నారు. డ్రగ్స్ కొనడం, అమ్మడం, ఇంట్లో ఉండటం, వాడటం, తాగడం నేరమని చెప్పారు. కేసు బుక్ చూడకుండా ప్రచారం తగదన్నారు.

కొంత తెలిసి జడ్జిమెంట్ చేయడం సరికాదు

కొంత తెలిసి జడ్జిమెంట్ చేయడం సరికాదు

తాము కేవలం టాలీవుడ్‌నే టార్గెట్ చేయడం లేదని అకున్ స్పష్టం చేసారు. చట్ట ప్రకారం ముందుకు వెళ్తున్నామని చెప్పారు. అన్ని వర్గాల వారిని విచారణకు పిలుస్తున్ామని చెప్పారు. ఎక్సైజ్ శాఖకు అన్ని అధికారాలు ఉన్నాయని చెప్పారు. ఇప్పటి దాకా 27 మందని విచారించామని, అందులో సినిమా వాళ్లు 5గురు అని చెప్పారు. 19 మందిని అరెస్టు చేశామని, అందులో ఆరుగురు ముఖ్యులని చెప్పారు. కొంతనే తెలిసి జడ్జిమెంట్ చేయడం సరికాదని అకున్ సబర్వాల్ అన్నారు. ఇప్పటి వరకు ఏడు కేసులు నమోదు చేశామన్నారు.

రామ్ గోపాల్ వర్మకు కౌంటర్

రామ్ గోపాల్ వర్మకు కౌంటర్

స్కూల్ పిల్లలను కూడా ఇలాగే విచారిస్తారా అని ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అన్నారు. దానికి కూడా అకున్ గట్టి కౌంటర్ ఇచ్చారు. డ్రగ్ కేసులో స్కూల్ పిల్లల పేర్లు ఎట్టి పరిస్థితుల్లో బయట పెట్టమని తేల్చి చెప్పారు. వారి పేర్లు చెబితే భవిష్యత్తు నాశనమవుతుందన్నారు. వారి తల్లిదండ్రులను పిలిచి కౌన్సెలింగ్ ఇస్తున్నామన్నారు.

నో డేంజర్

నో డేంజర్

తన భద్రత గురించి ఎలాంటి భయం లేదని అకున్ సబర్వాల్ చెప్పారు. చాలామందికి తన సెక్యూరిటీ గురించి టెన్షన్ ఉందని, తన ఇద్దరు బాడీగార్డ్స్, తన పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్.. చాలా మంచివాళ్లని చెప్పారు. తాను పూర్తిగా భద్రంగా ఉన్నానని చెప్పారు. ఏం భయం లేదని, ఎలాంటి డేంజర్ లేదన్నారు. కాగా, డ్రగ్స్ కేసులో మరికొంతమందికి నోటీసులు ఇస్తామని చెప్పారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Excise enforcement director Akun Sabharwal counter to film personalities who alleged on drug racket case issue. He said that we are not forcing to collect samples.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more