హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మీడియాలో సినీ స్టార్ల పేర్లు, ఆ పేర్లతో సంబంధం లేదని సబర్వాల్ ఆగ్రహం

డ్రగ్స్ కేసులో సినీ ప్రముఖుల పేర్లు వెల్లడిపై ఎక్సైజ్ శాఖలో ముసలం ప్రారంభమైంది. మీడియాలో పేర్లు రావడంపై ఎక్సైజ్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: డ్రగ్స్ కేసులో సినీ ప్రముఖుల పేర్లు వెల్లడిపై ఎక్సైజ్ శాఖలో ముసలం ప్రారంభమైంది. మీడియాలో పేర్లు రావడంపై ఎక్సైజ్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

త్వరలో అకున్ సబర్వాల్ సెలవులపై వెళ్లనున్నారు. టాలీవుడ్ ప్రముఖులకు నోటీసుల జారీ నేపథ్యంలో ఎక్సైజ్ అధికారులపై తీవ్ర ఒత్తిడి రానుంది. మీడియాలో పేర్లు రావడం వ్యూహాత్మకమే కావొచ్చునని అంటున్నారు.

<strong>డ్రగ్స్: ఆ హీరోయిన్ ఎక్కడికి పిలిచినా వస్తుందని కెల్విన్, ఓ హీరో అరెస్ట్ ఖాయమా?</strong>డ్రగ్స్: ఆ హీరోయిన్ ఎక్కడికి పిలిచినా వస్తుందని కెల్విన్, ఓ హీరో అరెస్ట్ ఖాయమా?

అంతకుముందు, ఆయన మాట్లాడుతూ.. ఎనిమిది మంది సినీ ప్రముఖులకు నోటీసులు ఇచ్చినట్లు చెప్పారు. 19 నుంచి 27వ తేదీ వరకు నోటీసులు ఇచ్చిన వారిని విచారిస్తామన్నారు. ముమైత్ ఖాన్, చార్మిల గురించి మీడియా ప్రశ్నించగా పేర్ల విషయంలో తాను మాట్లాడనని చెప్పారు.

తాను వ్యక్తిగత కారణాలతో సెలవులపై వెళ్తున్నానని, ఎలాంటి ఒత్తిడి లేదన్నారు. నోటీసులు ఇచ్చినంత మాత్రాన నిందితులు కారన్నారు. పేర్లు బయటపెట్టడం నిబంధనలకు విరుద్ధమన్నారు.

ఎవరి పేర్లు బయటపెట్టలేదు.. ఆ పేర్లకు మాకు సంబంధం లేదు

ఎవరి పేర్లు బయటపెట్టలేదు.. ఆ పేర్లకు మాకు సంబంధం లేదు

డ్రగ్స్ లింక్‌లో ప్రత్యేక దర్యాఫ్తు బృందం (సిట్) ఇంత వరకు ఎవరి పేర్లు బయట పెట్టలేదని అకున్ సబర్వాల్ చెప్పారు. ప్రచారంలో ఉన్న పేర్లకు, తమకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు.

Recommended Video

Tollywood drugs scandal : Tollywood Top Director, Heroes and 3 Heroines Names revealed
ఎందుకిచ్చారో తెలియదు

ఎందుకిచ్చారో తెలియదు

డ్రగ్స్ కేసులో తనకు నోటీసులు అందిన మాట నిజమేనని సినీ నటుడు సుబ్బరాజు తెలిపారు. నోటీసులో 21వ తేదీన తనను విచారణకు హాజరుకావాలని కోరారని చెప్పారు. అయితే, తనకు నోటీసులు ఎందుకు ఇచ్చారో తనకే అర్థం కావడం లేదన్నారు. తనకు డ్రగ్స్ అలవాటు లేదని, అప్పుడప్పుడు వైన్ మాత్రమే తీసుకుంటానని చెప్పారు.

కెల్విన్ ఎవరో తెలియదు

కెల్విన్ ఎవరో తెలియదు

కెల్విన్ ఎవరో తనకు తెలియదని సుబ్బరాజు చెప్పారు. అతని ఫోన్‌లో తన నెంబర్ ఎందుకు ఉన్నదో తెలియదన్నారు. తన తప్పు లేదనే విషయాన్ని తాను నిరూపించుకుంటానని, తనకు ఆ విశ్వాసం ఉందని చెప్పారు. ఎక్సైజ్ ఆఫీసుకు విచారణ కోసం రమ్మని నోటీసులో పేర్కొన్నారని, తాను, కచ్చితంగా విచారణకు హాజరై తన వాదన వినిపిస్తానని చెప్పారు.

నోటీసులు అందలేదని..

నోటీసులు అందలేదని..

తనకు ఎలాంటి నోటీసులు అందలేదని నందు చెప్పాడని తెలుస్తోంది. మీడియా వాస్తవాలను పరిగణలోకి తీసుకోవాలని చెప్పారు.

ఎవరిని ఎప్పుడు పిలిచారంటే..

ఎవరిని ఎప్పుడు పిలిచారంటే..

పరిశ్రమలోని 12 మందికి నోటీసులు పంపిన సిట్, వారు విచారణకు ఎప్పుడు, ఎక్కడ హాజరు కావాలన్న విషయాన్ని స్పష్టంగా తెలిపింది. ఈ పన్నెండు మందిలో 10 మందికి నోటీసులు వెళ్లినట్టు అక్నాలెడ్జ్‌మెంట్ అందగా, మరో ఇద్దరికి ఈ ఉదయం నోటీసులు వెళ్లాయి. ఇక క్యారెక్టర్ ఆర్టిస్టు సుబ్బరాజును 21వ తేదీ ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట మధ్య ఎక్సైజ్ కార్యాలయంలోని ఐదో అంతస్తులో ఉన్న సిట్ ఆఫీసుకు రావాలని ఆదేశించారు. నవదీప్ ను 24వ తేదీ అదే ప్రాంతానికి రావాలని సూచించారు. పూరీ జగన్నాథ్, చార్మీ, ముమైత్ ఖాన్ లను 23న విచారణకు రావాలని ఆదేశించారు. చిన్నా, శ్యామ్ కే నాయుడులను కూడా 21వ తేదీన తమ ఎదుట హాజరు కావాలని ఆదేశాలు జారీ చేశారు. తరుణ్, రవితేజలను ఎప్పుడు విచారణకు పిలిచారన్న విషయం తెలియరాలేదు.

English summary
Excise director Akun Sabharwal unhappy with revealing of tollywood personilities names in drugs case. Many names revealed in Drunk link case on friday morning.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X