వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విష్ణును పట్టించుకోని పవన్ -ఉప రాష్ట్రపతి సన్మానం : గిరిజన మహిళలతో గవర్నర్ నృత్యం : సందడిగా అలయ్‌- బలయ్..!!

By Chaitanya
|
Google Oneindia TeluguNews

దసరా సందర్బంగా ప్రతీ ఏటా బండారు దత్తాత్రేయ అలయ్- బలయ్ నిర్వహించేవారు. ఆర్భాటంగా నిర్వహిస్తున్న 'అలయ్ బలాయ్' కార్యక్రమాన్ని గత రెండేళ్ల నుండి గవర్నర్ కూతురు విజయలక్ష్మి నిర్వహిస్తున్నారు. దసరా పండగ తర్వాత రెండో రోజు అలయ్ బలయ్ కొనసాగుతోంది. జలవిహార్ లో లంగాణ గవర్నర్‌ తమిళసై సౌదర్యరాజన్ ప్రారంభించారు. అనంతరం ఆమె గిరిజన మహిళలలో నృత్యం చేశారు. అలయ్‌- బలయ్‌ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

అలయ్ బలయ్ లో ప్రముఖులంతా

అలయ్ బలయ్ లో ప్రముఖులంతా

దుర్గామాత..జమ్మిచెట్టుకు వెంకయ్యనాయుడు..దత్తాత్రేయ..కిషన్ రెడ్డి..పవన్ కళ్యాణ్ పూజలు చేసారు. హర్యానా గవర్నర్ దత్తాత్రేయ మాట్లాడుతూ.. కలిసి తిందాం, కలిసి పాడుదాం, కలిసి ఆడుదాం అనే సంప్రదాయం 'అలయ్ బలాయ్' కార్యక్రమానిదని తెలిపారు. ఏళ్లుగా 'అలయ్ బలయ్' కొనసాగుతోందని తెలిపారు. విజయలక్ష్మీ మాట్లాడుతూ.. 'అలాయ్ బలాయ్' తెలంగాణ రుచులను ప్రోత్సహిస్తూ.. ప్రతి ఒక్కరిని సమానదృష్టితో చూస్తుందని తెలిపారు. తెలంగాణ సాధనకోసం అన్ని పార్టీలను ఏకతాటిపైకి తెచ్చిందని అన్నారు.

గిరిజన మహిళలతో కలిసి గవర్నర్ డాన్స్

గిరిజన మహిళలతో కలిసి గవర్నర్ డాన్స్

పార్టీలకు జెండాలకు అతీతంగా అందరిని ఒకే వేదికపైకి తెచ్చేది 'అలయ్ బలాయ్' అని చెప్పారు. తెలంగాణ సంస్కృతిని తరతరాలకు అందించడమే 'అలయ్ బలాయ్' ఉద్దేశమని పేర్కొన్నారు. తెలంగాణలో దసరా సంబురాలు ఘనంగా జరుపుకుంటున్నామని గవర్నర్ తమిళసై చెప్పారు. తుకమ్మ పండుగ ఉత్సవాలు గొప్పగా జరిగాయన్నారు. రాజ్‌భవన్‌లో కూడా బతుకమ్మను ఘనంగా జరుపుకున్నామన్నారు. అలయ్‌ బలయ్‌ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. 16 ఏండ్లుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం గర్వంగా ఉందని చెప్పారు.

ప్రముఖులకు వెంకయ్య సత్కారం

అలయ్‌ బలయ్‌.. తెలంగాణ సంస్కృతికి అద్దంపడుతున్నదని వెల్లడించారు.హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అలయ్ బలయ్‌ సైతం కార్యక్రమ నిర్వహణను అభినందించారు. అలయ్ బలయ్‌లో తెలంగాణ సంసృతి ఉట్టిపడే కళాకారుల నృత్యాలతోపాటు తెలంగాణ చడ్రుచుల వంటకాలు ఇక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేసారు. కరోనా కారణంగా సాధారణంగా జరిగే ఆలింగనాలకు దూరంగా కేవలం నమస్కారాలతో కార్యక్రమం కొనసాగింది. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు సత్కరించారు.

పవన్ తో మాట్లాడేందుకు విష్ణు ప్రయత్నం

పవన్ తో మాట్లాడేందుకు విష్ణు ప్రయత్నం

జనసేన అధినేత పవన్ కళ్యాణ్...మా నూతన అధ్యక్షుడు మంచు విష్ణు...భారత్ బయోటెక్ ఛైర్మన్ క్రిష్ణ ఎల్లా..రెడ్డి లేబరేటరీస్ అధినేత ప్రసాద్ రెడ్డి..మహిమ దాట్ల..డాక్టర్ నాగేశ్వర రెడ్డిలు ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు సత్కరించిన వారిలో ఉన్నారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్, తెలంగాణ మండలి ప్రొటెం ఛైర్మెన్ భూపాల్ రెడ్డి, హోమ్ మంత్రి మహమూద్ అలీ, నటుడు కోట శ్రీనివాస్ రావు హాజరయ్యారు. అయితే, కార్యక్రమంలో పవన్ కూర్చున్న వీడియోను విష్ణు పోస్టు చేసారు. పవన్ తో మాట్లాడేందుకు విష్ణు అక్కడ ప్రయత్నించారు. కానీ, పవన్ కళ్యాణ్ పట్టించుకోలేదు.

English summary
This year Alai bhalai hosted by Haryana Governor Dattatreya kicked off grandly that witnessed Vice President Venkaiah Naidu as chief guest
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X