హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణలో కరోనా విజృంభణకు మద్యం షాపులు, ఇతర మినహాయింపులే కారణమా..?ఇప్పుడేంచేయాలి..?

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : అంతా సెట్ అయ్యిందనుకుంటున్న తరుణంలో కరోనా అదునుచూసి పంజావిసిరుతోంది. రెండ్ జోన్లు గ్రీన్ జోన్లుగా మారుతున్నాయన్న సంతోషం నిమిషాల్లోనే ఆవిరైపోతోంది. స్వీయ నియంత్రణ పాటిస్తూ ప్రజలు, ఉద్యోగులు ఇళ్లకే పరిమితమవుతున్నప్పటికి కేసుల పెరుగుదల శరాఘాతంగా పరిణమిస్తోంది. తెలంగాణ ప్రభుత్వం కరోనా వైరస్ కట్టడికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోందనుకుంటున్న తరుణంలో ముఖ్యమంత్రి చందరశేఖర్ రావు ప్రకటించిన మినహాయింపులు ప్రమాదఘంటికలు మోగించాయనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అంతే కాకుండా ప్రజలు యధేచ్చగా రోడ్ల మీదకు వచ్చి లాక్‌డౌన్ ఆంక్షలు ఉల్లఘించినట్టు తెలుస్తోంది.

 తెలంగాణలో మరోసారి భారీగా పెరిగిన కరోనా కేసులు తెలంగాణలో మరోసారి భారీగా పెరిగిన కరోనా కేసులు

కథ మళ్లీ మొదటికి.. తెలంగాణలో చాప కింద నీరులా కరోనా విజృంభణ..

కథ మళ్లీ మొదటికి.. తెలంగాణలో చాప కింద నీరులా కరోనా విజృంభణ..

తెలంగాణలో మొన్నటి వరకూ ఉన్న లాక్‌డౌన్ సీరియస్ నెస్ జనాల్లో ఇప్పుడు కనిపించడం లేదు. ఆంక్షలను బేఖాతరు చేస్తూ ఏదో ఒక కారణం చూపిస్తూ విచ్చలవిడిగా రోడ్లపై విహరిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన మినహాయింపులను ఆసరా చేసుకుని ప్రజలు రోడ్ల మీదకు వస్తున్నట్టు తెలుస్తోంది. నగరంలో ఏ రోడ్డు చూసినా వాహనాలతో రద్దీగీ కనిపిస్తోంది. పోలీసులు కూడా ఉదాసీనంగా వ్యవహరిస్తుండంతో ప్రజలు మరింత స్వతంత్ర్యంగా రోడ్లమీదకు వస్తున్నట్టు కనిపిస్తోంది. స్వీయ నియంత్రణ నిబంధనలు పక్కన పెట్టి సనాలు సమూహాలుగా ఏర్పడడం కూడా కరోనా విజృంభణకు కారణంగా చర్చ జరుగుతోంది.

స్వీయ నియంత్రణ పట్ల అలసత్వం... గుంపులు గుంపులుగా రోడ్ల మీదకు వస్తున్న జనం..

స్వీయ నియంత్రణ పట్ల అలసత్వం... గుంపులు గుంపులుగా రోడ్ల మీదకు వస్తున్న జనం..

గత వారం, పది రోజులుగా తెలంగాణలో కరోనా కంట్రోల్ అయినట్టు నమ్మించింది. కేసుల సంఖ్య తగ్గడం పట్ల అంతా ఊపిరి పీల్చుకున్నారు. కాని వెంటనే తగ్గిన కరోనా కేసుల సంఖ్య గణనీయంగా పెరిగిపోయాయి. దీంతో మళ్లీ కరోనా గట్టిగానే విజృంభిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా నమోదవుతున్న కొత్త కేసులన్నీ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనే కావడం ఆందోళన కలిగిస్తోంది. అంతే కాకుండా కరోనా గ్రామీణ ప్రాంతాల్లో తక్కువడా ఉందని, పల్లెలకు విస్తరిస్తే వ్యవసాయంపై తీవ్ర ప్రభావం పడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. కేసులు హైదరాబాదులో మాత్రమే నమోదవడం వల్ల అధికార యంత్రాంగం అప్రమత్తంగా వ్యవహరిస్తున్నట్టు తెలుస్తోంది.

నగరంలో పెరుగుతున్న కేసులు.. ప్రత్యేక దృష్టి సారించనున్న అధికారులు..

నగరంలో పెరుగుతున్న కేసులు.. ప్రత్యేక దృష్టి సారించనున్న అధికారులు..

కంటైన్మెంట్ లలో ఉన్న ప్రజలకు వ్యాధి సోకకుండా చూసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు అధికారులు చెప్పుకొస్తున్నారు. వైద్య సేవలు అందించే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయని నిర్దారిస్తున్నారు. అంతే కాకుండా తెలంగాణకు ఆదాయం వచ్చే రాజధారనిలో కరోనా కన్నెర్ర చేస్తోంది. హైదరాబాద్ లాంటి అబివృద్ది చెందిన నగరం కరోనా కోరల్లో చిక్కుకోవడం ప్రమాదకరమని పరిశోదకులు విశ్లేషిస్తున్నారు. దీనివల్ల మహానగరంలో ఉత్పాదకత పడిపోతుందని, ప్రభుత్వ ఆదాయంతో పాటు ప్రజల ఆదాయం పడిపోతుందనే చర్చ జరుగుతోంది. ముఖ్యంగా కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య నగరంతో పాటు మరో రెండు జిల్లాల్లో పెరుగుతుండడం విస్మయానికి గురిచేస్తోందని అధికారులు చెప్పుకొస్తున్నారు.

ఈనెల 15న మరోసారి సమీక్ష.. కీలక నిర్ణయం తీసుకోనున్న సీఎం కేసీఆర్..

ఈనెల 15న మరోసారి సమీక్ష.. కీలక నిర్ణయం తీసుకోనున్న సీఎం కేసీఆర్..

తెలంగాణ ప్రభుత్వం సంపద సృష్టి కోసం కల్పించిన మినహాయింపులు అవరోధాలకు కారణమైతే ప్రభుత్వం మరో కఠిన నిర్ణయం తీసుకునే అవకాశం లేకపోలేదు. ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గతంలో ప్రకటించినట్టు ఈ నెల పదిహేనవ తారీఖులోపు కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య తగ్గకపోతే మరో కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు కేనిపిస్తున్నాయి. మూడు జిల్లాల్లో పెరుగుతున్న కేసుల ప్రభావం ఇతర జిల్లాలపై ప్రభావం చూపే అవకాశాలు ఉన్నందున హోదరాబాద్ లో కరోనా కట్టడికి నూతన వ్యూహాలు రచించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మే పదిహేనవ తారీఖున నిర్వహించనున్న సమీక్షా సమావేశంలో లాక్‌డౌన్ ఆంక్షలు, పాజిటీవ్ కేసుల పెరుగుదల, కేంద్ర ప్రభుత్వం మినహాయింపులు, మార్గదర్శకాలు తదితర అంశాలపై తెలంగాణ సర్కార్ దృష్టి కేంద్రీకరించబోతున్నట్టు తెలుస్తొంది.

English summary
As Chief Minister Chandrasekhar Rao has previously announced, the number of coronavirus cases is likely to fall short of the fifteenth of this month, and another key decision is likely. The growing number of cases in the three districts has the potential to impact other districts, and there are new strategies for corona building in Hodarabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X