వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అసలే కరోనా ప్రభావం ... ఆపై వర్షం పడే అవకాశం..తస్మాత్ జాగ్రత్త అంటున్న వాతావరణ శాఖ

|
Google Oneindia TeluguNews

తెలంగాణ‌లో కరోనా కేసులు చాలా ఎక్కువగా నమోదు అవుతున్నాయి. ఇప్పటికే తెలంగాణా రాష్ట్రంలో 229కేసులు నమోదు కావటంతో తెలంగాణా ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా పోయింది. కరోనా వైరస్ ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటే త్వరగా చనిపోతుంది . దాని ప్రభావం పెద్దగా ఉండదు అని చెప్తున్న వేళ కరోనా వైరస్ ప్రభావం పెరుగుతున్న సమయంలో వాతావరణ శాఖ షాకింగ్ విషయం వెల్లడించింది.

Recommended Video

Rainfall Chances In Telangana|క‌రోనా డేంజ‌ర్ బెల్స్ మోగిస్తోన్న వేళ‌ వర్షం పడితే ఏమవుతుందో తెలుసా ?

సింగరేణి ఉద్యోగులకూ తప్పని వేతనాల కోత .. కరోనా,లాక్ డౌన్ ల ఎఫెక్ట్సింగరేణి ఉద్యోగులకూ తప్పని వేతనాల కోత .. కరోనా,లాక్ డౌన్ ల ఎఫెక్ట్

క‌రోనా డేంజ‌ర్ బెల్స్ మోగిస్తోన్న వేళ‌ హైదరాబాద్ వాతావరణ కేంద్రం రాబోయే మూడు రోజుల్లో తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉంద‌ని వెల్ల‌డించింది. తెలంగాణా రాష్ట్రంలో తేలికపాటి జ‌ల్లుల‌ నుంచి ఓ మోస్తరు వ‌ర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో వర్షపాతం న‌మోద‌య్యే ఛాన్స్ ఉంద‌ని పేర్కొంది. కోమోరిన్ ఏరియా నుంచి రాయలసీమ వరకు 0.9 కి.మీ ఎత్తు వద్ద ఉపరితల ద్రోణి ప్ర‌భావం క‌నిపిస్తోంది. మ‌రోవైపు సౌత్ మధ్య మహారాష్ట్ర, దాని రీజ‌న‌ల్ ఏరియాస్ లో 1.5 కి.మీ ఎత్తు వద్ద ఉపరితల ఆవర్తనం ఏర్పడినట్లు వాతావ‌ర‌ణ శాఖ‌ అధికారులు వెల్లడించారు. వీటి ప్ర‌భావంతో తెలంగాణలోని పలు ప్రాంతాలతో పాటు రాజ‌ధాని న‌గ‌రం హైద‌రాబాద్ లోనూ ఆకాశం మేఘావృతమై ఉంది.వర్షం పడే ఛాన్స్ ఉందని చెప్పింది .

 Alert :Hyderabad Meteorological Department says chance of rainfall in telangana

మ‌రోవైపు ఇప్పటివరకు గమనిస్తే రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు పెరిగాయి. గత రెండు రోజులు గ‌రిష్ఠంగా 38.2 డిగ్రీలు, కనిష్టంగా 24.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డ‌య్యాయి. వాతావరణశాఖ వ‌ర్షాల అంచనాతో ప‌రిస్థితులు పూర్తిగా మారిపోయే అవకాశం ఉంది. ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితుల నేప‌థ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. కరోనా ప్రభావం పెరుగుతున్న నేపధ్యంలో వర్షాలు పడితే జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు .పంటలు కూడా చాలా వరకు పొలాల్లోనే ఉండిపోవటంతో వర్షం పడుతుందన్న వాతావరణ శాఖ సమాచారంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు.

English summary
The Hyderabad Meteorological Department has forecast rainfall in Telangana over the next three days while the Corona Danger Bells are ringing. Telangana state Meteorological Department has says that it is possible to get mild from light showers. There are chances of rainfall in different parts of the state..
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X