వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కొత్త జిల్లాల ఏర్పాటు వేగవంతం, కేసీఆర్ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేసింది తెలంగాణ సర్కార్. ఇప్పటికే 27 జిల్లాలతో కేబినెట్ సబ్ కమిటీ తుది నివేదికను ఖరారు చేయగా.. దీనిపై శనివారం మధ్యాహ్నాం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసింది ప్రభుత్వం.

అఖిలపక్ష సమావేశంలో విపక్షాలు తమ అభిప్రాయాలను ప్రభుత్వానికి వినిపించనున్నాయి. అలాగే ఏ ప్రాతిపదికన కొత్తగా జిల్లాల ఏర్పాటు ప్రక్రియ జరుపుతున్నారనే దానిపై కూడా విపక్షాలు ప్రభుత్వాన్ని ప్రశ్నించే అవకాశముంది. తెలంగాణలో ఉన్న ఏడు పార్టీల నుంచి ఇద్దరు ప్రతినిధుల చొప్పున ఈ సమావేశానికి హాజరుకానున్నారు.

All-party meeting on new districts today

కాగా, అఖిలపక్ష సమావేశం అనంతరం.. ఆయా పార్టీల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని, దానిపై మంత్రివర్గ సమావేశంలో చర్చించనుంది ప్రభుత్వం. దసరా నాటికల్లా కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోన్న నేపథ్యంలో అఖిలపక్ష భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. అలాగే గద్వాల్, జనగామ ఏర్పాటు జిల్లాల డిమాండ్ లు, కొత్తగా జాబితాలో చేర్చిన పెద్దపల్లి జిల్లా కేంద్రాల ప్రస్తావన కూడా అఖిలపక్ష భేటీలో చర్చకు వచ్చే అవకాశం ఉంది.

English summary
Amid the ongoing protest with demands for new districts with their towns as headquarters, the State Government has called an all-party meeting on the issue of reorganisation of districts followed by the Cabinet meeting on Saturday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X