వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మూఢనమ్మకాలతోనే సచివాలయం కూల్చివేత : రేవంత్ రెడ్డి

|
Google Oneindia TeluguNews

ఓ వైపు నూతన సచివాలం తోపాటు అసెంబ్లీ నిర్మాణాలకు తెలంగాణ ప్రభుత్వం పావులు కదుపుతుంటే మరోవైపు ప్రతిపక్షాలు ముఖ్యమంత్రి కేసీఆర్ చర్యను అడ్డుకునేందుకు తమ పోరాటాన్ని ఉదృతం చేశాయి. ఈనేపథ్యంలో సచివాలయంతోపాటు అసెంబ్లీ కూల్చివేతలను వ్యతిరేకిస్తూ అఖిలపక్ష పార్టీలు హైదరాబాద్‌లోని పార్క్ హయత్ హోటల్‌లో రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేశాయి.

మూఢనమ్మకాలతోనే సచివాలయం కూల్చివేత: రేవంత్ రెడ్డి

మూఢనమ్మకాలతోనే సచివాలయం కూల్చివేత: రేవంత్ రెడ్డి

ఈ సంధర్భంగా కాంగ్రెస్ పార్టీ ఎంపీ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ విలాసంతమైన జీవితం గడపడంతోపాటు మూఢనమ్మకాలతోనే సచివాలయం కూల్చుతున్నాడని మండిపడ్డారు. అసెంబ్లీతోపాటు, సచివాలయం కూడ 35 సంవత్సరాల క్రితమే నిర్మించారని అన్నారు. అలాంటప్పుడు ఎందుకు కూల్చుతున్నారని ప్రశ్నించారు.పార్టీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ అసెంబ్లీ భవనం చారీత్రకత్మకమైందని అన్నారు. మెట్రో పనులు చేపడుతున్నప్పుడు అసెంబ్లీని ముట్టుకోవద్దని హెచ్చరించిన సీఎం కేసీఆర్ ఇప్పుడు మాత్రం వాటిని కూల్చి వేసేందుకు చర్యలు చేపడుతున్నాడని మండిపడ్డారు.

వాస్తు దోషాలు ఉంటే సరిదిద్దు కోవాలి..డా.లక్ష్మణ్

వాస్తు దోషాలు ఉంటే సరిదిద్దు కోవాలి..డా.లక్ష్మణ్

వాస్తు దోషాలు ఉంటే వాటిని సరిదిద్దుకోవాలి తప్ప మొత్తం భవనాలను కూల్చడం ఎందుకని బీజేపీ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్ ప్రశ్నించారు. ఈనేపథ్యంలోనే స్థలం సరిపోవడం లేదని సచివాలయ ఉద్యోగులు ఎవరైనా చెప్పారా?..అసెంబ్లీలో సరిపోవడం లేదని ఎమ్మెల్యేలు ఎవరైనా అన్నారా? అని లక్ష్మణ్‌ ప్రశ్నించారు. ప్రాజెక్టుల్లో దోచుకోవడం అయిపోయిందన్నారు. సచివాలయం, అసెంబ్లీ నిర్మాణాలపై దండుకోవడానికి ప్లాన్‌ చేశారని ఆరోపించారు. కుమారుడిని సీఎం చేసేందుకు వాస్తు సరిగాలేకుంటే సరిదిద్దుకోండి.. కానీ కూలుస్తారా? అని ప్రశ్నించారు.

ఇష్థానుసారం చేస్తే చూస్తూ ఊరుకోం.. కోదండరాం

ఇష్థానుసారం చేస్తే చూస్తూ ఊరుకోం.. కోదండరాం

ఇక ప్రభుత్వం తమ ఇష్టానుసారం చేస్తామంటే వదిలిపెట్టే ప్రసక్తేలేదని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రో. కోదండరాం హెచ్చరించారు.ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు వారి ప్రజాభీష్టం ప్రకారం పాలన సాగించాలని సూచించారు... సీఎం కేసీఆర్‌కు భవనాలపై ఉన్న దృష్టి.. ప్రజల అవసరాలను తీర్చడంలో లేదని ఆయన ఎద్దేవా చేశారు. సీఎం కేసీఆర్ తుగ్లక్‌లా వ్యవహరిస్తున్నారని మాజీ ఎంపీ వివేక్ విమర్శించారు.

English summary
the Telangana government moves on to build the new secretariat and the assembly structures,on the other hand the opposition has sparked their struggle to block the chief minister's KCR action. Against this cm decition the all-party party held a round table meeting at the Park Hyatt Hotel in Hyderabad to protest the demolition.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X