వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సన్‌రైజర్స్ హ్యాట్రిక్: మెరిసిన కేసీఆర్ మనవడు, నగర్ మేయర్ బొంతు

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయి నిరాశ పరిచిన సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ ఐపీఎల్‌లో వరుసగా మూడో విజయాన్ని సాధించింది. శనివారం ఉప్పల్‌ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్ ఐదు వికెట్ల తేడాతో పంజాబ్‌పై విజయం సాధించింది.

పంజాబ్‌ నిర్దేశించిన 144 పరుగుల లక్ష్యాన్ని హైదరాబాద్‌ మరో 13 బంతులు మిగిలుండగానే ఐదు వికెట్లు కోల్పోయి అలవోకగా ఛేదించింది. కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌ 59 పరుగులు వరుసగా మూడో అర్ధ శతకంతో చెలరేగగా, శిఖర్‌ ధావన్‌ (45), ఇయాన్‌ మోర్గాన్‌ (25) సత్తా చాటారు.

తొలుత బ్యాటింగ్‌ చేసిన పంజాబ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసింది. షాన్‌ మార్ష్‌ (34 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 40) జట్టులో టాప్‌ స్కోరర్‌. గ్లెన్‌ మాక్స్‌వెల్‌ (1), ఓపెనర్‌ మురళీ విజయ్‌ (2), కెప్టెన్‌ డేవిడ్‌ మిల్లర్‌ (9) తీవ్రంగా నిరాశ పరిచారు.

ఆఖర్లో అక్షర్‌ పటేల్‌ (17 బంతుల్లో ఫోర్‌, 3 సిక్సర్లతో 36 నాటౌట్‌) మెరుపు బ్యాటింగ్‌తో చెలరేగి జట్టుకు మంచి స్కోరును అందించాడు. నిఖిల్‌ నాయక్‌ (22)తో కలిసి ఆరో వికెట్‌కు అతను 50 పరుగులు జోడించాడు. ముస్తాఫిజుర్‌, హెన్రిక్స్‌ చెరో రెండు వికెట్లు తీసి ప్రత్యర్థిని కట్టడి చేశారు.

ఐదు మ్యాచ్‌ల్లో మూడు విజయాలు సాధించిన హైదరాబాద్‌ మొత్తం ఆరు పాయింట్లతో పట్టికలో మూడో స్థానానికి చేరుకుంది. ఈ మ్యాచ్‌లో సన్స్‌రైజర్సే కాదు వార్నర్‌ కూడా హ్యాట్రిక్‌ సాధించాడు. వరుసగా మూడో అర్ధసెంచరీ సాధించాడు.

ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌ని వీక్షించేందుకు మేయర్ బొంతు రామ్మోహాన్‌తో పాటు టీఆర్ఎస్ పార్టీ నేత కే కేశవరావుతో పాటు తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు మనవడు, కేటీఆర్ తనయుడు హిమాన్షుతో పాటు చెల్లెలు హాజరయ్యారు.

సన్‌రైజర్స్ హ్యాట్రిక్: మెరిసిన కేసీఆర్ మనవడు, నగర్ మేయర్ బొంతు

సన్‌రైజర్స్ హ్యాట్రిక్: మెరిసిన కేసీఆర్ మనవడు, నగర్ మేయర్ బొంతు

144 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన సన్‌రైజర్స్‌కు ఓపెనర్లు మంచి శుభారంభాన్ని ఇచ్చారు. ఇన్నింగ్స్‌ మూడో ఓవర్‌.. సందీప్‌శర్మ రెండో ఓవర్లో వార్నర్‌ రెండు సిక్సర్లు, ఒక బౌండరీతో పరుగుల ప్రవాహానికి తెరతీశాడు. ఆ తర్వాత వచ్చిన బౌలర్లంతా వార్నర్‌ బాధితలయ్యారు.

 సన్‌రైజర్స్ హ్యాట్రిక్: మెరిసిన కేసీఆర్ మనవడు, నగర్ మేయర్ బొంతు

సన్‌రైజర్స్ హ్యాట్రిక్: మెరిసిన కేసీఆర్ మనవడు, నగర్ మేయర్ బొంతు

ఆకాశమే హద్దుగా చెలరేగిన వార్నర్‌ 23 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ సీజన్‌లో అతనికిది నాలుగోది కాగా.. ఐపీఎల్‌ మొత్తంలో 27వ అర్ధశతకం. గత మ్యాచ్‌లో గాడినపడ్డ ధావన్‌.. వార్నర్‌కు సహాయ పాత్రలో ఒదిగిపోయాడు.

 సన్‌రైజర్స్ హ్యాట్రిక్: మెరిసిన కేసీఆర్ మనవడు, నగర్ మేయర్ బొంతు

సన్‌రైజర్స్ హ్యాట్రిక్: మెరిసిన కేసీఆర్ మనవడు, నగర్ మేయర్ బొంతు

సందీప్‌ బౌలింగ్‌లో భారీషాట్‌కు ప్రయత్నించిన వార్నర్‌ లాంగాన్‌లో మిల్లర్‌ చేతికి చిక్కాడు. ఐతే అప్పటికే వార్నర్‌.. పంజాబ్‌కు మ్యాచ్‌ను దూరం చేశాడు. వార్నర్‌, ధావన్‌ మొదటి వికెట్‌కు 90 (59 బంతుల్లో) పరుగులు జోడించి జట్టు విజయానికి బాటలు వేశారు.

సన్‌రైజర్స్ హ్యాట్రిక్: మెరిసిన కేసీఆర్ మనవడు, నగర్ మేయర్ బొంతు

సన్‌రైజర్స్ హ్యాట్రిక్: మెరిసిన కేసీఆర్ మనవడు, నగర్ మేయర్ బొంతు

ఆదిత్య తారె (0), ధావన్‌ వెంటవెంటనే ఔటవడంతో చివర్లో సన్‌రైజర్స్‌ పరుగుల వేగం మందగించినా మోర్గాన్‌ (25; 20 బంతుల్లో 2×4, 1×6) చాలావరకు పని పూర్తిచేశాడు. 17వ ఓవర్లో పంజాబ్‌ వరుసగా 2 వికెట్లు తీసినా ఆలస్యమైంది.

 సన్‌రైజర్స్ హ్యాట్రిక్: మెరిసిన కేసీఆర్ మనవడు, నగర్ మేయర్ బొంతు

సన్‌రైజర్స్ హ్యాట్రిక్: మెరిసిన కేసీఆర్ మనవడు, నగర్ మేయర్ బొంతు

ముస్తాఫిజుర్‌ 4-1-9-2: గత రెండు మ్యాచ్‌ల్లోనూ పకడ్బందీ బౌలింగ్‌తో ప్రత్యర్థుల్ని కట్టడి చేసి ముందే మ్యాచ్‌పై పట్టు బిగించిన సన్‌రైజర్స్‌.. శనివారమూ అలాగే ఆడింది. బౌలింగ్‌కు సహకరిస్తున్న వికెట్‌పై బౌలర్లు మరోసారి విజృంభించారు.

 సన్‌రైజర్స్ హ్యాట్రిక్: మెరిసిన కేసీఆర్ మనవడు, నగర్ మేయర్ బొంతు

సన్‌రైజర్స్ హ్యాట్రిక్: మెరిసిన కేసీఆర్ మనవడు, నగర్ మేయర్ బొంతు

స్వింగ్‌తో ఆకట్టుకున్న భువి బౌలింగ్‌లో ఓపెనర్‌ మురళీ విజయ్‌ (2) వెనుదిరిగాడు. వూపుమీద కనిపించిన మనన్‌ వోహ్రా (25; 23 బంతుల్లో 3×4, 1×6) కూడా ఎంతోసేపు నిలవలేదు. ముస్తాఫిజుర్‌ వేసిన ఆరో ఓవర్‌ సన్‌రైజర్‌ బౌలింగ్‌కే హైలైట్‌.

 సన్‌రైజర్స్ హ్యాట్రిక్: మెరిసిన కేసీఆర్ మనవడు, నగర్ మేయర్ బొంతు

సన్‌రైజర్స్ హ్యాట్రిక్: మెరిసిన కేసీఆర్ మనవడు, నగర్ మేయర్ బొంతు

అద్భుతమైన స్వింగ్‌ బౌలింగ్‌తో ఆకట్టుకున్న ముస్తాఫిజుర్‌ మెయిడెన్‌ వికెట్‌తో సత్తాచాటాడు. ముస్తాఫిజుర్‌ విసిరిన బంతులకు వోహ్రా దగ్గర సమాధానమే లేకపోయింది. వోహ్రా లేని పరుగుకు ప్రయత్నించి రనౌటయ్యాడు.

 సన్‌రైజర్స్ హ్యాట్రిక్: మెరిసిన కేసీఆర్ మనవడు, నగర్ మేయర్ బొంతు

సన్‌రైజర్స్ హ్యాట్రిక్: మెరిసిన కేసీఆర్ మనవడు, నగర్ మేయర్ బొంతు

హెన్రిక్స్‌ వేసిన పదో ఓవర్లో మిల్లర్‌ (9), మాక్స్‌వెల్‌ (1) ఔటవడంతో సన్‌రైజర్స్‌ మ్యాచ్‌పై పట్టుబిగించింది. ఐతే అక్షర్‌ పటేల్‌, నిఖిల్‌ నాయక్‌ (22; 28 బంతుల్లో 1×4) ఐదో వికెట్‌కు 50 పరుగులు (35 బంతుల్లో) జోడించి జట్టును గట్టెక్కించారు.

సన్‌రైజర్స్ హ్యాట్రిక్: మెరిసిన కేసీఆర్ మనవడు, నగర్ మేయర్ బొంతు

సన్‌రైజర్స్ హ్యాట్రిక్: మెరిసిన కేసీఆర్ మనవడు, నగర్ మేయర్ బొంతు

సన్ రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్లు వార్నర్‌, ధావన్‌ల ఓపెనింగ్‌ భాగస్వామ్యాల సగటు 54.95గా నమోదు చేశారు. ఐపీఎల్‌లో కనీసం పదిహేను సార్లు కలిసి ఓపెనింగ్‌ చేసిన జోడీల్లో వీరిద్దరిదే అత్యుత్తమం.

English summary
Riding on a superb bowling performance followed by skipper David Warner's quick-fire 59, Sunrisers Hyderabad outclassed a spiritless Kings XI Punjab by five wickets in an Indian Premier League (IPL) match at the Rajiv Gandhi International Stadium here on Saturday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X