వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పదోతరగతి పరీక్షలకు సర్వం సిద్ధం ... ఒక నిముషం నిబంధన సడలింపు

|
Google Oneindia TeluguNews

రాష్ట్ర వ్యాప్తంగా పదోతరగతి పరీక్షలకు సర్వం సిద్ధం అయ్యింది. అంతే కాదు పదోతరగతి విద్యార్థులకు గుడ్ న్యూస్ కూడా చెప్పారు అధికారులు. ఇప్పటి వరకు ఎంతో కఠిన నిబంధనగా ఉన్న 'ఒక్క నిమిషం' నిబంధనను అధికారులు ఎత్తివేశారు. 10వ తరగతి ఎగ్జామ్స్ మార్చి 16వ తేదీ నుంచి ప్రారంభం అవుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా పదవ తరగతి పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు అధికారులు చెబుతున్నారు .

<strong>శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో నకిలీ వీసాల కలకలం .. 26 మంది మహిళలు అరెస్ట్ </strong>శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో నకిలీ వీసాల కలకలం .. 26 మంది మహిళలు అరెస్ట్

నిముషం లేట్ అయితే నో ఎంట్రీ .. నిబంధన సడలింపు

నిముషం లేట్ అయితే నో ఎంట్రీ .. నిబంధన సడలింపు

నిమిషం లేటయితే పరీక్షా కేంద్రాల్లోకి స్టూడెంట్స్‌ని అనుమతించడం లేదనే సంగతి తెలిసిందే. ఎన్నో పరీక్షలకు ఈ నిబంధనను అధికారులు అమలు పెడుతున్నారు. దీనివల్ల అమూల్యమైన విద్యా సంవత్సరాన్ని కోల్పోయిన స్టూడెంట్స్ ఉన్నారు. దీనిపై విద్యాశాఖాధికారులు సమీక్షించి.. నిబంధనను ఎత్తివేశారు. అలా అని ఎప్పుడుపడితే అప్పుడు ఎగ్జామ్ కు వస్తామంటే కుదరదు. ఐదు నిమిషాల వరకు అనుమతి ఇస్తారు.10వ తరగతి ఎగ్జామ్స్ మార్చి 16వ తేదీ నుంచి ప్రారంభం అవుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా పదవ తరగతి పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు అధికారులు చెబుతున్నారు . ఒక్క నిమిషం నిబంధన వర్తించదని, అయిదు నిమిషాల వరకు పరీక్ష కేంద్రాల్లోకి అనుమతినిస్తామన్నారు.

2523 పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించటానికి సన్నాహాలు చేసిన అధికారులు

2523 పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించటానికి సన్నాహాలు చేసిన అధికారులు

రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2523 పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించనున్నట్లు విద్యా శాఖ కార్యదర్శి జనార్దన్ రెడ్డి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 11023 పాఠశాలల నుంచి 5 లక్షల 52 వేల 302 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు అవుతారని అధికారిక లెక్కల ప్రకారం తెలుస్తోంది. ఇక పరీక్షల ఏర్పాట్లపై విద్యాశాఖ అధికారులు జిల్లా కలెక్టర్లు , డీఈవో లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకొని పరీక్ష కేంద్రాల వద్ద ఒక ఏఎన్ఎం ను , ఆశా వర్కర్ లను అందుబాటులో ఉంచుకోవాలని, అలాగే ఓ ఆర్ ఎస్ ప్యాకెట్లను కూడా అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు పరీక్షల దృష్ట్యా విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా విద్యుత్ సరఫరాకు ఆటంకం కలగకుండా చూడాలని విద్యుత్ శాఖ అధికారులను కోరారు.

విద్యార్థులకు సూచనలు

విద్యార్థులకు సూచనలు

ఎగ్జామ్స్ సెంటర్స్‌కు విద్యార్థులు, పరీక్ష సిబ్బంది మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకరావద్దని అధికారులు సూచిస్తున్నారు. పరీక్ష కేంద్రాన్ని విద్యార్థులు ఒక రోజు ముందేగానే చూసుకోవాలని ,విద్యార్థులు హాల్ టికెట్, పెన్, పెన్సిల్, రైటింగ్ ప్యాడ్ తీసుకొచ్చుకోవాలని చెప్తున్నారు. ఒక నిమిషం నిబంధన తరలించినప్పటికీ,పరీక్ష కేంద్రానికి గంట ముందుగానే చేరుకుంటే బెటర్ అంటున్నారు విద్యాశాఖ అధికారులు. ఒక్క నిమిషం నిబంధన సడలించి అయిదు నిమిషాల వరకు పరీక్ష కేంద్రాల్లోకి అనుమతినిస్తామన్నారు.

English summary
All the arrangements have been made for the smooth conduct of tenth class examination to be held from March 16.During the examination hours, section 144 would be in effect at the centres. Education Secretary Janardan Reddy said that all 2523 exam centers will be conducted across the state. According to official figures, 5 lakh 52,302 students from 11023 schools across the state will appear for exams. The one-minute regulation changed into five minutes.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X