హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చేపమందు నేటినుంచే: ఇప్పటికే నగరానికి చేరిన 30వేలమంది(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: మృగశిర కార్తె సందర్భంగా ఆస్తమా వ్యాధిగ్రస్తులకు బత్తిని సోదరులు బుధవారం నుంచి చేప మందును పంపిణీ చేయనున్నారు. నగరంలోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో ఉదయం 8.30 నుంచి గురువారం రాత్రి వరకు పంపిణీ జరుగుతుందని కలెక్టర్ రాహుల్‌ బొజ్జా తెలిపారు. ఈ మేరకు అన్ని శాఖల సమన్వయంతో ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆయన వివరించారు.

కాగా, టోకెన్ల కోసం 40 కౌంటర్లు, చేప ప్రసాదం స్వీకరించేందుకు 30 కౌంటర్లను ఏర్పాటు చేశారు. వివిధ రాష్ట్రాల నుంచి 30 వేల మంది ఆస్తమా రోగులు ఇప్పటికే ఎగ్జిబిషన్ గ్రౌండ్‌కు తరలివచ్చారని, ఈ నేపథ్యంలో నగరవాసులు మధ్యాహ్నం తర్వాతే రావాలని డీసీపీ కమలాసన్‌రెడ్డి సూచించారు.

బుధవారం ఉదయం 8.30 గంటల నుంచి 9వ తేదీ రాత్రివరకు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో చేప ప్రసాదం పంపిణీ జరుగుతుందని కలెక్టర్ రాహుల్ బొజ్జా తెలిపారు. పోలీసు రెవెన్యూ ఆర్‌అండ్‌బీ, వాటర్‌వర్క్స్, మత్య్స, సమాచార, విద్యుత్తు, వైద్య, జీహెచ్‌ఎంసీ, అగ్నిమాపక తదితర శాఖల సమన్వయంతో పని చేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది అసౌకర్యం కలగకుండా చూస్తున్నామని తెలిపారు.

భద్రతా ఏర్పాట్లు

హైదరాబాద్ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో బుధ, గురువారాల్లో (జూన్ 8, 9 తేదీల్లో) జరిగే చేప మందు పంపిణీ సందర్భంగా మూడంచెల బందోబస్తు ఏర్పాటు చేసినట్టు సెంట్రల్ జోన్ డిసిపి కమలాసన్ రెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చేప మందుకోసం పలు రాష్ట్రాల నుంచి వచ్చే వారికి భద్రత కల్పించే విధంగా తగు చర్యలు తీసుకున్నామని, 1200 మంది సిబ్బందితో గట్టి భద్రత ఏర్పాట్లు చేశామన్నారు.

బత్తిని సోదరుల ఆధ్వర్యంలో సుమారు నాలుగు లక్షల మందికి చేప మందు వేయనున్నారని, రెండు రోజుల పాటు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా నిర్వాహకులు ఏర్పాట్లు చేశారని చెప్పారు. చేప మందు పంపిణీ సందర్భంగా నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ప్రత్యేక కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశామన్నారు. అదేవిధంగా నాంపల్లి పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించామని డిసిపి కమలాసన్ రెడ్డి తెలిపారు.

చేపమందు పంపిణీకి సర్వం సిద్ధం

చేపమందు పంపిణీకి సర్వం సిద్ధం

మృగశిర కార్తె సందర్భంగా ఆస్తమా వ్యాధిగ్రస్తులకు బత్తిని సోదరులు బుధవారం నుంచి చేప మందును పంపిణీ చేయనున్నారు.

చేపమందు పంపిణీకి సర్వం సిద్ధం

చేపమందు పంపిణీకి సర్వం సిద్ధం

నగరంలోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో ఉదయం 8.30 నుంచి గురువారం రాత్రి వరకు పంపిణీ జరుగుతుందని కలెక్టర్ రాహుల్‌ బొజ్జా తెలిపారు. ఈ మేరకు అన్ని శాఖల సమన్వయంతో ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆయన వివరించారు.

చేపమందు పంపిణీకి సర్వం సిద్ధం

చేపమందు పంపిణీకి సర్వం సిద్ధం

టోకెన్ల కోసం 40 కౌంటర్లు, చేప ప్రసాదం స్వీకరించేందుకు 30 కౌంటర్లను ఏర్పాటు చేశారు.

చేపమందు పంపిణీకి సర్వం సిద్ధం

చేపమందు పంపిణీకి సర్వం సిద్ధం

వివిధ రాష్ట్రాల నుంచి 30 వేల మంది ఆస్తమా రోగులు ఇప్పటికే ఎగ్జిబిషన్ గ్రౌండ్‌కు తరలివచ్చారని, ఈ నేపథ్యంలో నగరవాసులు మధ్యాహ్నం తర్వాతే రావాలని డీసీపీ కమలాసన్‌రెడ్డి సూచించారు.

చేపమందు పంపిణీకి సర్వం సిద్ధం

చేపమందు పంపిణీకి సర్వం సిద్ధం

బుధవారం ఉదయం 8.30 గంటల నుంచి 9వ తేదీ రాత్రివరకు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో చేప ప్రసాదం పంపిణీ జరుగుతుందని కలెక్టర్ రాహుల్ బొజ్జా తెలిపారు.

చేపమందు పంపిణీకి సర్వం సిద్ధం

చేపమందు పంపిణీకి సర్వం సిద్ధం

పోలీసు రెవెన్యూ ఆర్‌అండ్‌బీ, వాటర్‌వర్క్స్, మత్య్స, సమాచార, విద్యుత్తు, వైద్య, జీహెచ్‌ఎంసీ, అగ్నిమాపక తదితర శాఖల సమన్వయంతో పని చేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది అసౌకర్యం కలగకుండా చూస్తున్నామని తెలిపారు.

చేపమందు పంపిణీకి సర్వం సిద్ధం

చేపమందు పంపిణీకి సర్వం సిద్ధం

రాష్ట్ర ఫిషరీష్ శాఖ ఆధ్వర్యంలో ఇప్పటిసుమారు వరకు 50వేల కొర్రమీన్లు అందుబాటులో ఉన్నాయని, రేపటివరకు లక్ష అందుబాటులో ఉంచుతామన్నారు.

చేపమందు పంపిణీకి సర్వం సిద్ధం

చేపమందు పంపిణీకి సర్వం సిద్ధం

కొర్రమీన్ల కొనుగోలుకు ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో టోకెన్ల స్వీకరణకు 40 కౌంటర్లను, చేప పిల్లలను స్వీకరించేందుకు 30 కౌంటర్లను ఏర్పాటు చేశారు. ఇందులో మహిళలకు, వికలాంగులకు, వృద్ధులకు, ప్రముఖులకు ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశారు.

చేపమందు పంపిణీకి సర్వం సిద్ధం

చేపమందు పంపిణీకి సర్వం సిద్ధం

ఒక్కో కొర్రమీను రూ.15కు విక్రయించనున్నారు. అగర్వాల్ సమాజ్, ఉత్తర భారతీయ నాగరిక్ సంఘ్ తదితర స్వచ్ఛంద సంస్థలు ప్రజలకు ఉచిత భోజన వసతిని ఏర్పాటు చేస్తున్నాయి.

చేపమందు పంపిణీకి సర్వం సిద్ధం

చేపమందు పంపిణీకి సర్వం సిద్ధం

ప్రజల సౌకర్యార్థం ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో కంట్రోల్ రూం ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. ఇందులో తెలుగు, హిందీ, ఉర్దూ తదితర భాషల్లో ప్రజలకు సూచలనలు ఇచ్చేందుకు అనౌన్సర్లను సిద్ధంగా ఉంచామన్నారు.

చేపమందు పంపిణీకి సర్వం సిద్ధం

చేపమందు పంపిణీకి సర్వం సిద్ధం

జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో 4 ఆరోగ్య శిబిరాలు, 4 అంబులెన్సులు, మూడు 108 సర్వీసులను కూడా అందుబాటులో ఉంచినట్టు తెలిపారు. మొబైల్ టాయిలెట్లను ఏర్పాటు చేశామన్నారు.

చేపమందు పంపిణీకి సర్వం సిద్ధం

చేపమందు పంపిణీకి సర్వం సిద్ధం

జలమండలి ద్వారా మంచీనీటి ట్యాంకర్లు, తాగునీటి ప్యాకెట్లు సిద్ధం చేసినట్లు తెలిపారు.

చేపమందు పంపిణీకి సర్వం సిద్ధం

చేపమందు పంపిణీకి సర్వం సిద్ధం

సెంట్రల్ జోన్ డీసీపీ కమలాసన్‌రెడ్డి నేతృత్వంలో దాదాపు 1500మంది పోలీసులు బందోబస్తులో పాల్గొంటున్నారని, 35 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామని తెలిపారు. హైదరాబాద్ ఆర్డీవో నిఖిలతోపాటు ఆయా మండల తహసీల్దార్లు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారని కలెక్టర్ వివరించారు.

English summary
All arrangements have been made for traditional 'fish medicine' administered by 'Goud' family for asthma patients on Wednesday and Thursday at Exhibition Grounds in Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X