హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆంధ్రోళ్ల అడ్డా కానివ్వొద్దు: అల్లం, తట్టుకోలేరని శివాజీ హెచ్చరిక(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ ఉద్యమంలో విద్యుత్ ఉద్యోగుల పాత్ర చాలా కీలకమైందని, అలాంటి విద్యుత్ సౌధాను ఆంధ్రోళ్లు అడ్డాగా మార్చుకుంటామంటే సహించబోమని ప్రెస్ అకాడమీ ఛైర్మన్ అల్లం నారాయణ అన్నారు. ఏపీలో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగుల ఆందోళనకు మద్దతుగా తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఇంజినీర్స్ అసోసియేషన్ (టీఈఈఏ), తెలంగాణ విద్యుత్ అకౌంట్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు సోమవారం విద్యుత్‌సౌధలో ప్రారంభమయ్యా యి.

ఈ దీక్షల్లో 227 మంది విద్యుత్ ఉద్యోగులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు సంఘాల నాయకులు దీక్షలో కూర్చున్న వారికి మద్దతు ప్రకటించారు. సాయంత్రం దీక్షా శిబిరాన్ని సందర్శించిన ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ దీక్షలో కూర్చున్న వారికి నిమ్మరసం ఇచ్చి విరమింపజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్నదే నీళ్లు, నిధులు, నియామకాల కోసమని, అలాంటప్పుడు తెలంగాణ ఉద్యోగాల్లో ఆంధ్రోళ్లు పనిచేస్తుంటే ఎలా అంగీకరిస్తామని అన్నారు. ఆందోళనను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, ఈ ఉద్యమం న్యాయమైనది అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా వెంటనే చొరవ చూపాలని అన్నారు.

టీఈఈఏ అధ్యక్షుడు శివాజీ మాట్లాడుతూ.. ఓపికకు కూడా హద్దులుంటాయని, ఏపీ విద్యుత్ సంస్థల అధికారులు తెలంగాణ ఉద్యోగులను వెంటనే రిలీవ్ చేయాలని డిమాండ్ చేశారు. ఓపికను అసమర్ధతగా చూడొద్దని, అది కట్టలు తెంచుకొంటే తట్టుకోలేరని శివాజీ హెచ్చరించారు.

విద్యుత్ ఉద్యోగుల దీక్ష

విద్యుత్ ఉద్యోగుల దీక్ష

తెలంగాణ ఉద్యమంలో విద్యుత్ ఉద్యోగుల పాత్ర చాలా కీలకమైందని, అలాంటి విద్యుత్ సౌధాను ఆంధ్రోళ్లు అడ్డాగా మార్చుకుంటామంటే సహించబోమని ప్రెస్ అకాడమీ ఛైర్మన్ అల్లం నారాయణ అన్నారు.

విద్యుత్ ఉద్యోగుల దీక్ష

విద్యుత్ ఉద్యోగుల దీక్ష

ఏపీలో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగుల ఆందోళనకు మద్దతుగా తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఇంజినీర్స్ అసోసియేషన్ (టీఈఈఏ), తెలంగాణ విద్యుత్ అకౌంట్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు సోమవారం విద్యుత్‌సౌధలో ప్రారంభమయ్యా యి.

విద్యుత్ ఉద్యోగుల దీక్ష

విద్యుత్ ఉద్యోగుల దీక్ష

ఈ దీక్షల్లో 227 మంది విద్యుత్ ఉద్యోగులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు సంఘాల నాయకులు దీక్షలో కూర్చున్న వారికి మద్దతు ప్రకటించారు.

విద్యుత్ ఉద్యోగుల దీక్ష

విద్యుత్ ఉద్యోగుల దీక్ష

సాయంత్రం దీక్షా శిబిరాన్ని సందర్శించిన ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ దీక్షలో కూర్చున్న వారికి నిమ్మరసం ఇచ్చి విరమింపజేశారు.

విద్యుత్ ఉద్యోగుల దీక్ష

విద్యుత్ ఉద్యోగుల దీక్ష

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్నదే నీళ్లు, నిధులు, నియామకాల కోసమని, అలాంటప్పుడు తెలంగాణ ఉద్యోగాల్లో ఆంధ్రోళ్లు పనిచేస్తుంటే ఎలా అంగీకరిస్తామని అన్నారు.

విద్యుత్ ఉద్యోగుల దీక్ష

విద్యుత్ ఉద్యోగుల దీక్ష

ఆందోళనను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, ఈ ఉద్యమం న్యాయమైనది అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా వెంటనే చొరవ చూపాలని అన్నారు.

విద్యుత్ ఉద్యోగుల దీక్ష

విద్యుత్ ఉద్యోగుల దీక్ష

టీఈఈఏ అధ్యక్షుడు శివాజీ మాట్లాడుతూ.. ఓపికకు కూడా హద్దులుంటాయని, ఏపీ విద్యుత్ సంస్థల అధికారులు తెలంగాణ ఉద్యోగులను వెంటనే రిలీవ్ చేయాలని డిమాండ్ చేశారు. ఓపికను అసమర్ధతగా చూడొద్దని, అది కట్టలు తెంచుకొంటే తట్టుకోలేరని శివాజీ హెచ్చరించారు.

విద్యుత్ ఉద్యోగుల దీక్ష

విద్యుత్ ఉద్యోగుల దీక్ష

అడ్వకేట్ జేఏసీ ప్రతినిధి ఉపేందర్ ఈ సందర్భంగా మద్దతు ప్రకటించారు. తెలంగాణ విద్యుత్ అకౌంట్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి అంజయ్య మాట్లాడుతూ.. సమస్య పరిష్కారమయ్యే వరకు ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉంటామని స్పష్టం చేశారు.

విద్యుత్ ఉద్యోగుల దీక్ష

విద్యుత్ ఉద్యోగుల దీక్ష

టీఈఈఏ ప్రధాన కార్యదర్శి మధుసూదన్‌రెడ్డి, నాయకులు రవి, శెట్టి, నీలకంఠం, తెలంగాణ అసిస్టెంట్ ఇంజినీర్స్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శి వినోద్, హమీద్, 1104 యూనియన్ అధ్యక్ష కార్యదర్శి పద్మారెడ్డి, జనార్దన్‌రెడ్డి, 327 యూనియన్ అధ్యక్షుడు శ్రీధర్, తెలంగాణ విద్యుత్ కార్మిక సంఘం అధ్యక్షుడు సత్యనారాయణ దీక్షలో పాల్గొన్నారు.

విద్యుత్ ఉద్యోగుల దీక్ష

విద్యుత్ ఉద్యోగుల దీక్ష

విద్యుత్ మహిళా ఉద్యోగుల అసోసియేషన్ అధ్యక్షురాలు మాధవి, కార్యదర్శి ఆరోగ్యరాణి, తెలంగాణ గిరిజన వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు రామచంద్రు, సురేశ్, ఏపీలో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగు లు అమర్‌సింగ్, లావణ్య, మాధవరెడ్డి, రమేశ్ తదితరులు దీక్షలో పాల్గొన్నారు.

English summary
Telangana Press Academy Chairman Allam Narayana supported electricity employees relay hunger strike held in hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X