హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆల్‌ఖైదాకు నిధులు సేకరించిన ఇబ్రహీం జుబేర్ మొహమ్మద్ త్వరలో హైదరాబాద్‌కు..

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: అమెరికాలో ఉగ్రవాద సంస్థ ఆల్‌ఖైదాకు భారీగా నిధులు సమీకరించిన తెలంగాణ ఇంజినీర్ ఇబ్రహీం జుబేర్ మొహమ్మద్‌ను కొద్ది రోజుల్లో హైదరాబాద్ నగరానికి తీసురానున్నారు. కరోనా నేపథ్యంలో అమెరికాలోని ఖైదీలను విడుదల చేసిన విషయం తెలిసిందే.

అమెరికాలో ఉగ్రవాద సంస్థకు నిధులు సేకరించిన తెలంగాణ ఇంజినీర్ విడుదలఅమెరికాలో ఉగ్రవాద సంస్థకు నిధులు సేకరించిన తెలంగాణ ఇంజినీర్ విడుదల

ఈ క్రమంలోనే 40ఏళ్ల జుబేర్ కూడా విడుదలయ్యాడు. ఇటీవల అతడ్ని భారతదేశానికి తీసుకువచ్చారు. 2015లో ఆల్ ఖైదాకు నిధులు సేకరించిన కేసులో అతడ్ని అమెరికాలో అదుపులోకి తీసుకున్నారు. ఉగ్రవాద సంస్థకు నిధులు సేకరించినట్లు నేరం రుజువు కావడంతో అతడ్ని అమెరికాలోని జైల్లో పెట్టారు.

Alleged Al-Qaeda operative Ibrahim Zubair Mohammed being brought to Hyderabad

కరోనా నేపథ్యంలో అతడ్ని విడుదల చేసి స్వదేశానికి పంపించారు. మే 19న అమృత్ సర్ చేరుకున్న అతడ్ని అధికారులు క్వారంటైన్ కు తరలించారు.
కాగా, త్వరలోనే జుబేర్ ను హైదరాబాద్ తీసుకురానున్నట్లు తెలంగాణ పోలీసు వర్గాలు తెలిపాయి. ఆ తర్వాత అతడ్ని క్వారంటైన్లో ఉంచుతామని వెల్లడించాయి. తెలంగాణలో అతనిపై ఎలాంటి కేసులు లేనప్పటికీ నిఘా ఉంచుతామని తెలిపాయి.

2001లో విద్యాభ్యాసం కోసం వెళ్లిన జుబేర్ మొహమ్మద్ 2006లో అమెరికా జాతీయురాలిని వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత శాశ్వత నివాసి అయ్యాడు. టోలెడోలోని ఓహియోలో అతడు నివాసం ఉన్నాడు. ఆల్ ఖైదాకు నిధులు సమకూర్చినవారిలో ఇబ్రహీంతోపాటు మరో ఇద్దరు దోషులుగా తేలారు. ఆఫ్ఘనిస్థాన్‌లో 2011లో డ్రోన్ దాడిలో హతమైన ఆల్ ఖైదా నేత ఆల్ అవ్లాకి కోసం వీరంతా పనిచేశారు.

English summary
A Telangana man who financed the al-Qaeda and spent five years in jail in the United States is to be brought to Hyderabad, his home town after his deportation to India.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X