హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అద్భుతం, అభినందిస్తున్నా: కేసీఆర్ ప్రభుత్వంపై అల్లు అర్జున్ ప్రశంసలు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: కేసీఆర్ ప్రభుత్వంపై ప్రముఖ నటుడు అల్లు అర్జున్న ప్రశంసలు కురిపించారు. ప్రపంచ తెలుగు మహాసభలను అద్భుతంగా నిర్వహించిందంటూ తెలంగాణ ప్రభుత్వంపై ప్రశంసల వర్షం కురిపించారు.

Recommended Video

బాలకృష్ణ, నాగార్జున, చిరంజీవి ఒకే వేదికపై : పొగడ్తల హోరు !

<br>ముగింపు వేడుకల్లో.. తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించిన రాష్ట్రపతి, పద్యం చదివి వినిపించిన కేసీఆర్
ముగింపు వేడుకల్లో.. తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించిన రాష్ట్రపతి, పద్యం చదివి వినిపించిన కేసీఆర్

తెలుగు సాహిత్యం, సంస్కృతిని చాటి చెప్పేందుకు ప్రభుత్వం నిర్వహించిన కార్యక్రమం ఎంతో అద్భుతమని కొనియాడారు. తెలంగాణ ప్రభుత్వాన్ని తాను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని చెప్పారు.

గర్వంగా ఉందని అల్లు అర్జున్

అల్లు అర్జున్ ఈ మేరకు సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్‌లో స్పందించారు. ప్రపంచ తెలుగు మహాసభలు విజయవంతం కావడం ఎంతో గర్వంగా ఉందని పేర్కొన్నారు. ప్రపంచ తెలుగు మహాసభలకు సంబంధించి ఓ ఫోటోను కూడా ఆయన పోస్ట్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం ప్రపంచ తెలుగు మహాసభలను ఘనంగా నిర్వహించిన విషయం తెలిసిందే.

తెలుగు భాషలోనే మందుల పేర్లు

తెలుగు భాషలోనే మందుల పేర్లు

రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో పేదలకు ఉచితంగా అందించే ఔషధాలపై పేర్లను ఇంగ్లీష్‌తో పాటు తెలుగులోను ప్రభుత్వం ముద్రిస్తోంది. వివిధ చికిత్సల కోసం ప్రస్తుతం 420 రకాల మందులు ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుబాటులో ఉన్నాయి. వాటిలో 220 రకాల పేర్లు తెలుగు భాషలో దర్శనం ఇస్తున్నాయి. దీంతో తెలుగు భాషను గౌరవించడంతో పాటు మందుల పేర్లను ఇంగ్లీష్ పరిజ్ఞానం లేని రోగులు సులభంగా గుర్తుంచుకునేందుకు ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.

17 రాష్ట్రాలు, 42 దేశాల నుంచి

17 రాష్ట్రాలు, 42 దేశాల నుంచి

ఈ నెల 15వ తేదీ నుంచి తెలుగు మహాసభలు ప్రారంభమయ్యాయి. ఈ వేడుకలకు 17 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతం, 42 దేశాలు, తెలంగాణలోని 31 జిల్లాల నుంచి ఎనిమిది వేల మంది ప్రతినిధులు పేర్లను నమోదు చేసుకున్నారు. సాహిత్య ప్రాంగణాలు కిక్కిరిసిపోయాయి.

 ఆకట్టుకున్న ప్రసంగాలు

ఆకట్టుకున్న ప్రసంగాలు

ముగింపు వేడుకలకు వచ్చిన రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించడంతో పాటు మధ్యమధ్యలో తెలుగులో మాట్లాడారు. తెలుగు ప్రముఖుల పేర్లు ప్రస్తావించారు. ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు అని కోవింద్ అన్నప్పుడు, చివరికి 'ఏ దేశ మేగినా ఎందుకాలిడినా..' అని ప్రస్తావించినప్పుడు అంతా హర్షధ్వానాలు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రసంగానికి మరోసారి భారీ స్పందన వచ్చింది. సీఎం పద్యం చెబుతానని ఆనగానే చప్పట్లు మిన్నంటాయి. ఆయన ముఖ్య అంశాలను ప్రస్తావిస్తున్నప్పుడు అంతా హర్షం వ్యక్తంచేశారు. గవర్నర్‌ తెలుగులో మాట్లాడి ఆదర్శంగా నిలిచారు. రాష్ట్రపతి, సీఎం, గవర్నర్‌ ప్రసంగిస్తున్నంత సేపు కరతాళ ధ్వనులు మార్మోగాయి.

English summary
'I whole heartedly appreciate this wonderful initiative taken by the government to promote Telugu literature & culture with Prapancha Telugu Mahasabhalu Program . Really Proud & Elated' Allu Arjun tweet.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X