అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అమరావతికి వెళ్తున్నా, మళ్లీ వచ్చి చేస్తా: కెసిఆర్, సూర్యాపేట టు ఏపీ..

By Srinivas
|
Google Oneindia TeluguNews

గజ్వెల్: ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి తెలంగాణ సీఎం కెసిఆర్... గురువారం మధ్యాహ్నం చేరుకుంటారు. ఆయన బుధవారం (నేడు) సాయంత్రం సూర్యాపేటలో మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఇంట్లో బస చేస్తారు.

రేపు (గురువారం) ఉదయం పదిన్నర గంటల సమయంలో సూర్యాపేటలో హెలికాప్టర్ నుంచి అమరావతి శంకుస్థాపనకు వెళ్తారు. అక్కడి నుంచి రెండు గంటల ప్రాంతంలో తిరుగు పయనమవుతారు. అక్కడి నుంచి సూర్యాపేటకు వస్తారు. అక్కడి నుంచి ఎర్రవల్లి వచ్చి డబుల్ బెడ్ రూం కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు.

పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో కెసిఆర్

దేశం కోసం, ప్రజల భద్రత కోసం ప్రాణత్యాగం చేసిన పోలీసు అమరవీరులకు సమాజం రుణపడి ఉందని కెసిఆర్ అన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని గోషామహల్ స్టేడియంలో అమరవీరుల స్థూపం వద్ద సీఎం కేసీఆర్, హోమంత్రి నాయిని, డీజీపీ అనురాగ్ శర్మలు నివాళులర్పించారు.

ఈ సందర్భంగా కెసిఆర్ మాట్లాడారు. ఏ దేశమైన, రాష్ట్రమైన శాంతిభద్రతలు బాగుంటేనే అభివృద్ధి చెందుతాయి. బంజారాహిల్స్‌లో ఇంటిగ్రేటెడ్ పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ నిర్మిస్తామని, తీవ్రవాదం, ఉగ్రవాదం, వైట్‌కాలర్ నేరాలను, మతతత్వ శక్తులను ఎట్టిపరిస్థితుల్లో సహించేది లేదన్నారు.

 కెసిఆర్

కెసిఆర్

దసరా రోజే ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామాల్లో ఇండ్ల నిర్మాణానికి ముహూర్తం అని, ఐదు నెలల్లో కట్టుకుని కొత్త ఇళ్లలోకి వెళ్లాలని, అంతకన్నా ముఖ్యమైన వ్యవసాయం బాగు చేసుకోవాలని కెసిఆర్ అన్నారు. గ్రామాభివృద్ధి పనులపై పట్టుబట్టి యుద్ధం చేద్దామన్నారు.

కెసిఆర్

కెసిఆర్

మెదక్ జిల్లా జగదేవ్‌పూర్ మండలం ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామాల్లో మంగళవారం జరిగిన సమావేశాల్లో సీఎం కేసీఆర్ మాట్లాడారు. అనుకున్న పని పూర్తయ్యే వరకు చీమలదండు లెక్క పట్టుబట్టాలన్నారు. ఈ రెండు గ్రామాల ప్రజలు లక్ష్మీపుత్రులని, కావాల్సినంత అభివృద్ధి జరుగుతుందని భరోసా ఇచ్చారు.

కెసిఆర్

కెసిఆర్

ఒక్కో కుటుంబానికి రూ.20 లక్షలపైనే ప్రభుత్వం ఖర్చు చేస్తోందన్నారు. దసరా రోజు ఏపీ రాజధాని శంకుస్థాపనకు కోసం అమరావతికి వెళ్తున్నానని, సూర్యాపేటలో జరిగే కార్యక్రమంలో పాల్గొని తిరిగి ఎర్రవల్లికి వచ్చి రెండు గ్రామాల్లో ఇండ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తానని చెప్పారు.

కెసిఆర్

కెసిఆర్

ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్ ఇస్తామని, ఆడబిడ్డలెవరూ మంచినీటి కోసం గడపదాటి రావొద్దన్నదే లక్ష్యమన్నారు. కమతాలు ఏకీకరణ చేసుకోవడం ద్వారా కమతం ఒక్క దగ్గరికి రావడంతో పంటలు సాగుచేసుకునే వెసులుబాటు కలుగుతుందన్నారు.

కెసిఆర్

కెసిఆర్

ఇద్దరు, ముగ్గురి రైతులతో కలిపి అంకాపూర్ మాదిరిగా నీటిని నిల్వచేసే కుండీలను ఏర్పాటు చేసుకుందామన్నారు. నూతన పద్ధతుల్లో సాగు విధానానికి రబీ నుంచే శ్రీకారం చుడుతామన్నారు. రెండు గ్రామాల్లో తొలుత 30 ఎకరాల్లో విత్తన పంటలను సాగుచేసి వచ్చే ఖరీఫ్ నుంచి వ్యవసాయాన్ని అనుకున్న విధంగా కొనసాగించేందుకు ఏర్పాట్లు చేసుకుందామన్నారు.

కెసిఆర్

కెసిఆర్

2017లోపు పాములపర్తి రిజర్వాయర్ నిర్మాణం పూర్తవుతుందని, ఆ రిజర్వాయర్ ద్వారా అన్ని చెరువులను నింపుకుని ఎకరా భూమి ఖాళీ లేకుండా సాగు చేసే ఏర్పాట్లు చేసుకుందామన్నారు. రెండు గ్రామాల్లో ప్రతి ఎకరానికి డ్రిప్ సౌకర్యం కల్పించడంతోపాటు అవసరమైన వారికి బోర్లువేసి పంపుసెట్లను బిగిస్తామన్నారు.

కెసిఆర్

కెసిఆర్

కొండపాక మండలం నాగిరెడ్డిపల్లిని కూడా దత్తత తీసుకోనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ఎర్రవల్లి, నర్సన్నపేటలాగే అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకుని ఆదర్శ గ్రామంగా నిలుపుదామన్నారు.

సమాజ రక్షణ కోసం పోలీసులు ఎంతో కృషి చేస్తున్నారని, రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, తెలంగాణలో అసంఘటిత శక్తులకు చోటులేదని, ప్రభుత్వ గౌరవ మర్యాదలు పెంచేలా పోలీసులు పని చేయాలన్నారు.

ఇదిలా ఉండగా, మంగళవారం నాడు కెసిఆర్ నాగిరెడ్డిపల్లిని దత్తత తీసుకున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. ఎర్రవల్లి, నర్సన్నపేటలో ఇళ్ల నిర్మాణానికి దసరా రోజున శంకుస్థాపన చేస్తున్నట్లు చెప్పారు. విదేశాల నుంచి వచ్చి అధ్యయనం చేసేలా అభివృద్ధి చేసుకుందామన్నారు.

English summary
Telangana CM KCR will stay in Suryapet today night.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X