వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణలో 11 వేల కోట్ల భారీ పెట్టుబడులు పెట్టటానికి అమెజాన్ రెడీ .. సెంటర్ల నిర్మాణానికి సన్నాహాలు

|
Google Oneindia TeluguNews

ప్రపంచ ప్రఖ్యాత ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ తెలంగాణలో భారీగా పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చింది. తెలంగాణా రాష్ట్రంలో దాదాపు 11,624 కోట్ల (1.6 బిలియన్ డాలర్లు) పెట్టుబడితో రెండు డేటా సెంటర్లు నిర్మించేందుకు సిద్ధమైంది ఈ టెక్నాలజీ దిగ్గజ సంస్థ అమెజాన్ . హైదరాబాద్ శివారులో రెండు ప్రాంతాల్లో ఇవి ఏర్పాటు కానున్నట్టు తెలుస్తుంది . దీంతో తెలంగాణా మణిహారంలో మరో దిగ్గజ సంస్థ చేరింది .

తెలంగాణా రెండు డేటా సెంటర్లు ఏర్పాటుకు అమెజాన్ సిద్ధం

తెలంగాణా రెండు డేటా సెంటర్లు ఏర్పాటుకు అమెజాన్ సిద్ధం

తెలంగాణాలో పెట్టబోయే రెండు డేటా సెంటర్లు తెలంగాణలో అమెజాన్ వెబ్ సర్వీసెస్ అభివృద్ధికి సాయం చేయనున్నాయి.అమెజాన్ పెట్టబోయే పెట్టుబడిలో 90 శాతం కంటే ఎక్కువ ఈ రెండు డేటా సెంటర్లలో ఉండే హై-ఎండ్ కంప్యూటర్, స్టోరేజ్ పరికరాల పైనే పెట్టనుంది. దీంతో ఇక్కడ నిరుద్యోగ యువతకు ఉపాధి దొరికే అవకాశం ఉంది .

Recommended Video

Good Morning India: 3 Minutes 10 Headlines : YS Jagan To Meet Modi, Amit Shah
పర్యావరణ అనుమతులు కోరిన అమెజాన్

పర్యావరణ అనుమతులు కోరిన అమెజాన్

హైదరాబాద్ శివార్లలో డేటా సెంటర్ల నిర్మించేందుకు అమెజానా డేటా సర్వీసెస్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్ పర్యావరణ అనుమతులు కోరుతూ ప్రభుత్వానికి దరఖాస్తు చేసింది. ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ నోటిఫికేషన్, 2006 ప్రకారం, 20,000 చదరపు మీటర్ల మించిన విస్తీర్ణంతో ఏదైనా నిర్మాణం చేపట్టాలంటే అందుకు పర్యావరణ క్లియరెన్స్ తప్పనిసరిగా తీసుకోవాలి . హైదరాబాద్ నగరంలో ఇప్పటికే ఓ పెద్ద కార్పోరేట్ ఆఫీస్ కలిగిన అమెజాన్ సంస్థ, అందుకు దగ్గరగా తమ డేటా సెంటర్లను హైదరాబాద్ శివారుల్లోనే ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకుంది.

చందన్ పల్లిలోనూ , మీర్ ఖాన్ పేట లోనూ డేటా సెంటర్లు

చందన్ పల్లిలోనూ , మీర్ ఖాన్ పేట లోనూ డేటా సెంటర్లు

రెండింటిలో ఓ డేటా సెంటర్‌ను శంషాబాద్ మండలంలోని చందన్‌వల్లిలో ఏర్పాటు చేయాలని ప్రతిపాదిస్తుంది. చందన్‌వల్లిలో 66,003 చదరపు మీటర్ల విస్తీర్ణంలో డేటా సెంటర్ ఏర్పాటు కానుంది. , రెండోదానిని కందుకూరు మండలంలోని మీర్‌ఖాన్‌పేట గ్రామంలో ఏర్పాటు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక ఇది మీర్‌ఖాన్‌పేటలో 82,833 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఏర్పాటు చేస్తారు. ఈ ప్రాంతం హైదరాబాద్ ఫార్మా సిటీ ప్రాజెక్టు పరిధిలో ఉంది.

 డేటా సెంటర్ల ఏర్పాటు .. తెలంగాణాకు గుడ్ న్యూస్

డేటా సెంటర్ల ఏర్పాటు .. తెలంగాణాకు గుడ్ న్యూస్

అమెజాన్ సంస్థ ప్రతిపాదనలను పరిశీలించిన తెలంగాణ ప్రభుత్వ పారిశ్రామిక మౌలిక సదుపాయాల విభాగం, ఆ రెండు ప్రదేశాలతో పాటు రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలోని రవిర్యాల వద్ద భూమిని కేటాయించేందుకు నిర్ణయించింది. ఇక శరవేగంగా అమెజాన్ తమ డేటా సెంటర్లను ఏర్పాటు చెయ్యనుండటం నిజంగా తెలంగాణా రాష్ట్రానికి గుడ్ న్యూస్ అనే చెప్పాలి.

English summary
Amazon, the world's leading e-commerce company, has started to invest heavily in Telangana. Amazon, the technology giant, is set to build two data centers in Telangana state with an investment of about Rs 11,624 crore ($ 1.6 billion). They are likely to be set up in two areas in the Hyderabad suburb. In Telangana account joins another iconic company.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X