వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అద్భుతం!: నగరం నడిబొడ్డున విశాలంగా మెట్రో అమీర్‌పేట ఇంటర్‌స్టేషన్

హైదరాబాద్ నగర నడిబొడ్డున అమీర్ పేటలో మెట్రో రైలు ప్రాజెక్టు మహాద్భుతం ఆవిష్కరించనున్నది. మూడంతస్తుల్లో చేపట్టిన అమీర్ పేట ఇంటర్‌ఛేంజ్ స్టేషన్ ప్రయాణికులకు కనువిందు చేయనున్నది.

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: భాగ్యనగరానికే తల మానికం 'హైదరాబాద్ మెట్రో' ప్రాజెక్టు. అందునా నగరం మధ్యలో నడిరోడ్డుపై మూడంతస్తుల అద్భుతం ఆవిష్క్రుతం కానున్నది. అదీ అమీర్ పేటలో.. అదీ ఇంటర్ చేంజ్ స్టేషన్. అత్యున్నత పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో చేపట్టిన ఈ ఇంటర్ ఛేంజ్ స్టేషన్ మహాద్భుతం కానున్నది. ప్రాజెక్టు ప్రజలకు వినియోగంలోకి వచ్చిన తర్వాత ఇది దేశంలోనే అతి పెద్ద స్టేషన్‌గా గుర్తింపు పొందనున్నది. సదరు ఇంటర్ ఛేంజ్ స్టేషన్‌ను రెండు లక్షల చదరపుటడుగుల్లో నిర్మాణం చేపడుతున్నారు.
ఒకేసారి ఆరు వేల మంది నిలిచే ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నెలాఖరులో ప్రధాని నరేంద్రమోదీ చేతులో మీదుగా మెట్రోరైలును ప్రారంభించేందుకు సర్వం సిద్ధమవుతున్న తరుణంలో తుది మెరుగులు దిద్దుకుంటున్న భారీ రైల్వే స్టేషన్‌లో అడుగు పెడితే సరికొత్త అనుభూతి సొంతం కావటమే కాదు.. 'యే హమారా' అని గర్వంగా చెప్పుకొనేలా దీనిని రూపొందించారు.

ఇలా మెట్రో రైలు ప్రయాణం

ఇలా మెట్రో రైలు ప్రయాణం

మెట్రో రైలు ప్రాజెక్టులో ఇంటర్‌ చేంజ్‌ స్టేషన్ల నిర్మాణం పూర్తిగా భిన్నమైంది. రెండు వేర్వేరు కారిడార్లను కలిపే జంక్షన్‌ ఈ ఇంటర్‌ చేంజ్‌ స్టేషన్‌. ఉదాహరణకు నాగోల్‌ నుంచి మియాపూర్‌ వెళ్లాల్సిన వ్యక్తి ఒకే మెట్రో రైలులో వెళ్లలేడు. ఖచ్చితంగా అమీర్‌పేటలో దిగి రైలు మారాల్సిందే. ఇక్కడే, ఒకవైపు నుంచి వచ్చిన రైలు రెండో అంతస్తులో.. మరో వైపు నుంచి వచ్చిన రైలు మూడో అంతస్తులో ఆగుతాయి. ప్రయాణికులు తమ తమ గమ్యస్థానాల ఆధారంగా రైళ్లు మారాల్సి ఉంటుంది. అందుకే వీటిలో, ఒకేసారి నాలుగు మెట్రో రైళ్లు రాకపోకలు సాగించేలా నిర్మాణాలు ఉంటాయి. మిగతా స్టేషన్లలో 20 సెకన్లు మాత్రమే ఆగే రైళ్లు.. అమీర్ పేటలో రెండు నిమిషాల సేపు ఆగుతాయి.

ఒకేసారి ఆరువేల మంది ఉండేలా ఏర్పాట్లు

ఒకేసారి ఆరువేల మంది ఉండేలా ఏర్పాట్లు

ప్రతి మెట్రో స్టేషన్‌ రెండంతస్తులు ఉంటే.. ఇంటర్‌ చేంజ్‌ స్టేషన్‌ మాత్రం మూడంతస్తుల్లో ఉంటుంది. మొదటి అంతస్తు పూర్తిగా టికెటింగ్‌, షాపింగ్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌! అయితే, రెండు, మూడు అంతస్తుల్లో ప్లాట్‌ఫామ్స్‌ ఉంటాయి. దీనిని 2 లక్షల చదరపు అడుగుల్లో నిర్మిస్తున్నారు. అమీర్‌పేట ఇంటర్‌ చేంజ్‌ స్టేషన్‌ పొడవు 476 అడుగులు. కాగా, వెడల్పు 148 అడుగులు. భూమి నుంచి స్టేషన్‌ పైకప్పు ఎత్తు 112 అడుగులు. ఇక్కడి నుంచి ఒక్క రోజులో 30 వేల మంది ప్రయాణికులు సాఫీగా ప్రయాణం చేసేలా ఏర్పాట్లు చేశారు. ఒకేసారి ఆరు వేలమంది స్టేషన్‌లో ఉండేలా విశాలంగా ప్రాంగణాన్ని తీర్చిదిద్దారు. ఇతర నిర్మాణాలను శరవేగంగా రూపుదిద్దుతున్నారు. మొదటి అంతస్తులో ఆటోమేటిక్‌ ఫేర్‌ కలెక్షన్‌ గేట్లు, టికెట్లు ఇచ్చే రూంలు ఉంటున్నాయి. ఈ స్టేషన్‌ ప్రత్యేకంగా ఉండేందుకు ఆకట్టుకునే గ్రానైట్‌ రాళ్లతో సుందరీకరిస్తున్నారు.

స్టేషన్ మారడానికి టైం ఇలా

స్టేషన్ మారడానికి టైం ఇలా

సాధారణంగా మెట్రో రైళ్లు ఆయా స్టేషన్లలో కేవలం 20 సెకన్లు మాత్రమే ఆగుతాయి. కానీ, అమీర్‌పేట ఇంటర్‌ చేంజ్‌ స్టేషన్‌లో మాత్రం రెండు నిమిషాలకుపైగా ఆగనున్నాయి. మియాపూర్‌ - ఎల్బీ నగర్ రూట్‌లో కూకట్ పల్లి నుంచి నాగోల్‌కు వెళ్లాల్సిన వ్యక్తి ఒకే మెట్రో రైల్లో వెళ్లలేడు. మాదాపూర్ - నాగోల్ రూట్‌లో హైటెక్ సిటీ నుంచి వచ్చే వ్యక్తి ఎల్బీ నగర్ వెళ్లాలన్నా అమీర్‌పేటలో దిగాలి. అలా దిగిన ప్రయాణికుడు నాగోల్‌ వెళ్లాలంటే మరో అంతస్తుకు వెళ్లాల్సిందే. మెట్రో స్మార్ట్‌ కార్డు ఉన్న ప్రయాణికుడే నేరుగా రెండు, మూడు అంతస్తులకు వెళ్లగలుగుతాడు. కానీ, మామూలు టికెట్‌ తీసుకున్న వ్యక్తిని మళ్లీ టికెట్‌ తీసుకుంటేనే మరో అంతస్తులోకి అనుమతిస్తారు. అందుకే ఇక్కడ రెండు నిమిషాలు ఆపుతారు.

ఒక కారిడార్ నుంచి మరో కారిడార్‌కు ఎస్కలేటర్లు.. లిఫ్టులు..

ఒక కారిడార్ నుంచి మరో కారిడార్‌కు ఎస్కలేటర్లు.. లిఫ్టులు..

మెట్రో రైలులో ప్రయాణించే ప్రయాణికులు స్టేషన్‌ నుంచి బయటకు రాగానే ఎటువంటి ఇబ్బందులు లేకుండా అధికారులు అనేక సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యంగా పాదచారులకు ప్రత్యేక మార్గాలు ఉంటాయి. అలాగే, సర్వీస్‌ లేన్స్‌, బస్సు, ఆటోల కోసం ప్రత్యేక మార్గాలు ఉంటాయి. స్టేషన్లలోకి వచ్చేందుకు, స్టేషన్లలో దిగిన తర్వాత సంజీవరెడ్డినగర్‌, పంజాగుట్ట, యూసు్‌ఫగూడ, మైత్రీవనం, గ్రీన్‌లాండ్స్‌ తదితర ప్రాంతాలకు వెళ్లే వారి కోసం ఆయా ప్రాంతాల్లో పార్కింగ్‌, స్కైవేలను ఏర్పాటు చేస్తారు. ఇక్కడ 12 ఎస్కలేటర్లు, 16 లిఫ్టులు, 12 మెట్ల మార్గాలు ఉంటాయి. ఒక కారిడార్‌లో దిగిన ప్రయాణికులు మరో కారిడార్‌లోకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేరుకునేందుకు స్కైవేలు, మెట్ల మార్గాలను ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యంగా ప్లాట్‌ఫామ్‌ దిగిన ప్రయాణికుడికి బయటికి వెళ్లే మార్గం, రైళ్ల రాకపోకలకు సంబంధించిన వివరాలు ఎల్‌ఈడీ డిస్‌ప్లే విధానంలో ప్రదర్శిస్తారు.

English summary
Hyderabad: With the launch date of Hyderabad Metro Rail Limited (HMRL) services on Miyapur-Nagole stretch fast approaching, HMRL is working long hours to complete Ameerpet interchange station construction by near future. The interchange station at Ameerpet is a crucial landmark on the metro map as this is where commuters will have to shift trains from one corridor to the other. It will be connecting the eastern and western parts of Hyderabad with corridor III, placed at a lower level and corridor I passing over it at a higher level.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X