• search
 • Live TV
ఖమ్మం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

ముగ్గురు ఎమ్మెల్యేల పద్ధతి మారాలి -ఉమ్మడి ఖమ్మం నేతలతో గులాబీ బాస్ కేటీఆర్ -జమిలికి సిద్ధంగా..

|

కాబోయే ముఖ్యమంత్రిగా సొంత పార్టీ నేతల నుంచి ఉపమానాలు అందుకుంటోన్న టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ పార్టీ పటిష్టతపై దృష్టిసారించారు. బీజేపీ నుంచి ప్రమాదకర సంకేతాలు వెలువడుతోన్న నేపథ్యంలో గులాబీ సైన్యాన్ని మరింత బలోపేతం చేసే దిశగా, అదే సమయంలో పార్టీలో అంతర్గత కలహాల నివారణకు నడుంకట్టారు. ఈక్రమంలో..

  Errabelli Dayakar rao Inaugurates Mission Bhagiratha Water Bottles | Oneindia Telugu

  ఏపీ సీఎంగా అంజాద్‌బాషా -డీజీపీ సవాంగ్ తొలగింపు -టీడీపీ సంచలన డిమాండ్లు -నిమ్మగడ్డకు మొర

  ఉమ్మడి ఖమ్మం నేతలతో భేటీ..

  ఉమ్మడి ఖమ్మం నేతలతో భేటీ..

  టీఆర్ఎస్ ఆలస్యంగా పట్టుసాధించిన ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పార్టీ స్థితిగతులు, త్వరలో జరుగనున్న ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు, ఖమ్మం-నల్గొండ-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక తదితర అంశాలపై ఉమ్మడి ఖమ్మం జిల్లా నేతలతో గులాబీ బాస్ కేటీఆర్ సమాలోచనలు జరిపారు. హైదరాబాద్ లోని ప్రగతిభవన్‌ వేదికగా జరిగిన ఈ సమావేశంలో టీఆర్ఎస్ లోక్ సభాపక్ష నేత నామా నాగేశ్వరరావు, మంత్రి పువ్వాడ అజయ్, పార్టీ నేతలు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సహా ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు పాల్గొన్నారు. కాగా..

  ముగ్గురు ఎమ్మెల్యేలకు వార్నింగ్

  ముగ్గురు ఎమ్మెల్యేలకు వార్నింగ్

  అలసత్వానికి తావు ఇవ్వకుండా ఐక్యతతో పనిచేయాలని, విభేదాలు వీడి పార్టీ గెలుపు కోసం నేతలందరూ కలిసికట్టుగా పనిచేయాలని ఉమ్మడి ఖమ్మం జిల్లా టీఆర్ఎస్ నేతలకు మంత్రి కేటీఆర్ ఆదేశించారు. అయితే.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ముగ్గురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల పనితీరు సరిగా లేదని.. వారు పద్ధతి మార్చుకోవాలని, లేకుంటే పరిణామాలు ఎదుర్కొవాల్సి ఉంటుందని కేటీఆర్ హెచ్చరించారు. అంతేకాదు..

  జమిలికి సిద్ధంగా ఉందాం..

  జమిలికి సిద్ధంగా ఉందాం..

  పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో టీఆర్ఎస్ గెలిచితీరాలని, ఆ దిశగా పార్టీ నేతలు పనిచేయాలని కేటీఆర్ అన్నారు. ఏ ఎన్నికనూ ఆషామాషీగా తీసుకోవద్దని, పార్టీలోని పాత, కొత్త నేతలు కలిసి బాధ్యతలు పంచుకోవాలని కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. రాష్టవ్యాప్తంగా 2014, 2018 ఎన్నికల్లో టీఆర్ఎస్ అద్భుత ఫలితాలు సాధించినప్పటికీ.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పూర్తి నిరాశాజనకమైన పరిస్థితులు కనిపించలేదని, కనీసం రాబోయే ఎన్నికల్లోనైనా ఉమ్మడి జిల్లాలోని పది అసెంబ్లీ స్థానాలూ గెలవాలని.. దీనికోసం ఇప్పటినుంచే సన్నద్ధం కావాలని నేతలకు సూచించారు. దేశంలో జమిలి ఎన్నికలు నిర్వహిస్తారని జోరుగా ప్రచారం జరుగుతోందని.. ఎన్నికలు ఎప్పుడు జరిగినా సిద్ధంగా ఉండాలని కేటీఆర్ అన్నారు.

  మజ్లిస్ పార్టీకి విరాళాల వెల్లువ -ఓవైసీకి దేశమంతటా క్రేజ్ -టీఆర్ఎస్ డేటా రాలేదు -ఈసీ రిపోర్ట్

  English summary
  trs working president and telangana minister KTR directed the leaders of the joint Khammam district amid corporation and mlc elections. KTR warned the three MLAs in the joint Khammam district that they were not performing well. KTR held a meeting with the joint Khammam district leaders at Pragati Bhavan on the Khammam Corporation graduate MLC elections.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X