వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వీఆర్వో ఉద్యోగాలపై కేసీఆర్ క్లారిటీ - స్కేల్ ఉద్యోగులుగా వీఆర్ఏలు - మూడు శాఖలకు వాళ్లు బదిలీ

|
Google Oneindia TeluguNews

విలేజ్ రెవెన్యూ ఆఫీసర్(వీఆర్వో) వ్యవస్థ రద్దు కావడంతో ఇన్నాళ్లూ ఆ విధులు నిర్వహించిన దాదాపు ఐదు వేల మంది ఉద్యోగుల భవితవ్యంపై ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టత ఇచ్చారు. అంతేకాదు, విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్(వీఆర్ఏ)లకు సంబంధించి కూడా గొప్ప శుభవార్త తెలిపారు. బుధవారం అసెంబ్లీలో కొత్త రెవెన్యూ చట్టం, వీఆర్వో వ్యవస్థ రద్దు బిల్లుల్ని ప్రవేశపెట్టిన సీఎం.. ఈ సందర్భంగా కీలక అంశాలను వెల్లడించారు.

Recommended Video

Telangana New Revenue Act 2020 : తెలంగాణా రెవెన్యూ వ్యవస్థ ప్రక్షాళన, రెవెన్యూ కోర్టులు రద్దు !

కొత్త రెవెన్యూ చట్టంలో సంచలనాలు-తహసీల్దార్లే రిజిస్ట్రార్లు-సమస్తం 'ధరణి'లోనే :అసెంబ్లీలో కేసీఆర్కొత్త రెవెన్యూ చట్టంలో సంచలనాలు-తహసీల్దార్లే రిజిస్ట్రార్లు-సమస్తం 'ధరణి'లోనే :అసెంబ్లీలో కేసీఆర్

వీఆర్వో వ్యవస్థ రద్దు బిల్లుపై కేసీఆర్‌ మాట్లాడుతూ.. రెవెన్యూ సంస్కరణల వల్ల ఆ ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బందులు ఉండబోవని భరోసా ఇచ్చారు. ఇప్పటిదాకా వీఆర్వోలుగా పనిచేసిన 5485 మందిని వాళ్ల సామర్థ్యాన్ని బట్టి మూడు శాఖలకు బదిలీ చేస్తామని, ఆయా వ్యక్తుల నైపుణ్యాల ఆధారంగా ఇరిగేషన్, పంచాయితీ రాజ్, మున్సిపల్ శాఖల్లోకి తీసుకుంటామని సీఎం తెలిపారు. అలాగే, 50 ఏళ్లు దాటిన వీఆర్వోలకు స్వచ్ఛంద పదవీ విరమణ(వీఆర్ఎస్) అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు.

 amid New Revenue Act, CM KCR Good News to Telangana

ఇక వీఆర్ఏల‌కు సంబంధించి తీపి క‌బురు అందిస్తున్నాన‌ని కేసీఆర్ అన్నారు. వీఆర్ఏల‌ను ఇకపై స్కేలు ఉద్యోగులుగా గుర్తిస్తామ‌న్నారు. వీఆర్వోలతోపాటు వీఆర్ఏలను కూడా వారి అర్హ‌త‌ల‌ను బ‌ట్టి ఇరిగేష‌న్‌, పంచాయ‌తీరాజ్‌, మున్సిప‌ల్ శాఖ‌ల్లో భ‌ర్తీ చేస్తామ‌న్నారు. ప్రజలు, ప్రజాప్రతినిధులతో చర్చించిన తర్వాతే వీఆర్వో వ్యవస్థ రద్దుకు నిర్ణయం తీసుకున్నామని, ఈ సంస్క‌ర‌ణల వ‌ల్ల ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని, ప్ర‌జ‌ల‌కున్న అడ్డంకులు తొలగిపోతాయని, గ‌త మూడేళ్లుగా రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తూ, చివరికి పకడ్బందీ చట్టాలను రూపొందించామని సీఎం కేసీఆర్ తెలిపారు.

జగన్ గారూ.. ఆ వెధవ మాటలు విని అనర్హత వేటేస్తారా? పిటిషన్ వాపస్ తీసుకోండి: ఎంపీ రఘురామ సంచలనంజగన్ గారూ.. ఆ వెధవ మాటలు విని అనర్హత వేటేస్తారా? పిటిషన్ వాపస్ తీసుకోండి: ఎంపీ రఘురామ సంచలనం

English summary
as telangana assembly likely to adopt New Revenue Act, chief minister kcr clarifies on VRO and VRA Employees. as VRO system had already abolished, all the employees will be allotted to irrigation, panchayat raj, municipal departments. the bars will be identified as scale employees, says cm kcr in assembly on wednesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X