• search
 • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

అమిత్ షా నేతృత్వంలో వామపక్ష తీవ్రవాద కీలక చర్చ: కేసీఆర్ సహా నలుగురు సీఎంలతో ప్రత్యేక భేటీ

|

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలో వామపక్ష తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాల సమావేశం ఆదివారం జరిగింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో ఈ సమావేశం జరిగింది. ఈ సదస్సుకు వామపక్ష తీవ్ర ప్రభావితమైన పది రాష్ట్రాల ప్రతినిధులు హాజరయ్యాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు ఛత్తీస్‌గఢ్, ఒడిశా, మధ్యప్రదేశ్, బీహార్, ఉత్తర్ ప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, పశ్చిమబెంగాల్‌కు చెందినవారు హాజరయ్యారు. ఈ సమావేశానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, ఏపీ హోం మంత్రి మేకతోటి సుచరిత హాజరయ్యారు.

వామపక్ష తీవ్రవాదంపై చర్చ

వామపక్ష తీవ్రవాదంపై చర్చ

కాగా, ఈ సమావేశానికి సీఎం మమతా బెనర్జీ దూరంగా ఉన్నారు. వామపక్ష తీవ్రవాదం ప్రస్తుత పరిస్థితి, చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాల గురించి సమావేశంలో పాల్గొన్న వారు వివరించారు. హోంశాఖ సమావేశంలో తొలి అర్థభాగం భద్రతాపరమైన అంశాలపై చర్చ, రెండో అర్థభాగంలో ప్రభావిత ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలపై చర్చ జరిగింది. మావోయిస్టులకు వ్యతిరేకంగా చేపట్టాల్సిన ఆపరేషన్లు, భద్రతాపరమైన లోపాలను సరిదిద్దడం, మావోయిస్టు అనుబంధ సంస్థలపై చర్యలు, మావోయిస్టుల నిధుల సమీకరణకు అడ్డుకట్ట, రాష్ట్రాల పోలీసులతో పాటు ఈడీ, ఎన్ఐఏ సంస్థల దర్యాప్తు, ప్రాసిక్యూషన్, ఇంటెలిజెన్స్ వ్యవస్థతో పాటు స్పెషల్ ఫోర్సెస్ విషయంలో రాష్ట్రాల మధ్య పరస్పర సహాయం, సమన్వయం అంశాలపై చర్చించినట్లు సమాచారం.

25 జిల్లాల్లో నక్సల్స్ అధిక ప్రభావం

25 జిల్లాల్లో నక్సల్స్ అధిక ప్రభావం

మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో రోడ్ల అభివృద్ధి కోసం కేంద్ర హోంశాఖతో పాటు రవాణా, రహదారుల శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖ, టెలీకాం సేవల కవరేజి కోసం టెలీకాం మంత్రిత్వశాఖ, ఏజెన్సీ ప్రాంతాల్లో ఆదివాసీ-గిరిజనుల కోసం ‘ఏకలవ్య' స్కూళ్లు, రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణంపై గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రజేంటేషన్ జరిగినట్లు తెలిసింది. వామపక్ష తీవ్రవాద ప్రభావిత జిల్లాల సంఖ్యను మూడేళ్ల క్రితం 100 నుంచి 70కి తగ్గించిన సంగతి తెలిసిందే. కేవలం 25 జిల్లాల్లో మాత్రమే మావోయిస్టుల ప్రభావం అధికంగా ఉన్నట్లు వెల్లడించింది. 2014 నుంచి వామపక్ష తీవ్రవాద హింసాత్మక ఘటనలు 47% తగ్గాయని వెల్లడిస్తోంది.

కేసీఆర్ సహా నలుగురు ముఖ్యమంత్రులతో అమిత్ షా ప్రత్యేక భేటీ

కేసీఆర్ సహా నలుగురు ముఖ్యమంత్రులతో అమిత్ షా ప్రత్యేక భేటీ

మరోవైపు, వామపక్ష తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాల సమావేశం అనంతరం కొందరు ముఖ్యమంత్రులతో హోంమంత్రి అమిత్ షా ప్రత్యేకంగా భేటీ అయ్యారు. తెలంగాణ సీఎం కేసీఆర్, మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే, మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్, బీహార్ సీఎం నితీశ్ కుమార్‌తో అమిత్ షా లంచ్ మీటింగ్‌లో పాల్గొన్నారు. నలుగురు ముఖ్యమంత్రులతో కలిసి భోజనం చేసిన అమిత్ షా నక్సల్స్ సమస్యపై వారితో ప్రత్యేకంగా మాట్లాడారు. నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో భద్రతా పరిస్థితి, అభివృద్ధి ప్రాజెక్టుల అమలును నాలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో చర్చించారు. వాస్తవానికి ఈ సమావేశానికి పశ్చిమ బెంగాల్, ఛత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్, కేరళ ముఖ్యమంత్రులను కూడా ఆహ్వానించారు. అయితే, ఈ నాలుగు రాష్ట్రాలకు రాష్ట్ర మంత్రి లేదా ఉన్నత అధికారులు ప్రాతినిధ్యం వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రాల అవసరాలు, తీవ్రవాదులను ఎదుర్కొనేందుకు మోహరించిన బలగాలు, నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో జరుగుతున్న రోడ్లు, వంతెనలు, పాఠశాల, ఆరోగ్య కేంద్రాల నిర్మాణం వంటి అభివృద్ధి పనులను షా పరిశీలించారు.

  Interview with Praja Sangala leader Sagar On 27 Bandh | Oneindia Telugu
  మావోయిస్టుల హింస తగ్గిందని తేల్చిన డేటా

  మావోయిస్టుల హింస తగ్గిందని తేల్చిన డేటా

  ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ మావోయిస్టుల సమస్యను తన రాష్ట్రంలో మూడు జిల్లాలకు పరిమితం చేశామనీ, దానిని మరింత తగ్గించడానికి ఏమి చేయాలో సమావేశంలో చర్చించామని చెప్పారు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం, దేశంలో మావోయిస్టుల హింస గణనీయంగా తగ్గింది. ఇప్పుడు దాదాపు 45 జిల్లాలలో నక్సల్స్ ఉనికి ఉంది. ఏదేమైనా, దేశంలోని మొత్తం 90 జిల్లాలు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలుగా పరిగణిస్తున్నారు. అదేవిధంగా మంత్రిత్వ శాఖ భద్రతా సంబంధిత వ్యయం (ఎస్ఆర్ఈ) పథకం కింద ఉన్నాయి. నక్సల్స్ సమస్యను, లెఫ్ట్ వింగ్ ఎక్స్‌ట్రీమిజం (ఎల్ డబ్ల్యూఈ) అని కూడా పిలుస్తున్నారు. 2019 లో 61 జిల్లాలు.. 2020 లో కేవలం 45 జిల్లాలలో మాత్రమే నక్సల్స్ ప్రభావిత జిల్లాలుగా నివేదించారు. 2015 నుంచి 2020 వరకు ఎల్‌డబ్ల్యూఈ ప్రభావిత ప్రాంతాల్లో దాదాపు 380 మంది భద్రతా సిబ్బంది, 1,000 మంది పౌరులు మరియు 900 మంది నక్సల్స్ మరణించారు. ఇదే సమయంలో మొత్తం 4,200 మంది నక్సల్స్ కూడా లొంగిపోయారని డేటా వెల్లడించింది.

  English summary
  Amit Shah Holds Review Meet With CMs Of Naxal-Hit States: tea party meet with four CMs.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X