వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణలో సీఏఏ రగడ .. కేసీఆర్ , ఓవైసీ టార్గెట్ గా అమిత్ షా సభ

|
Google Oneindia TeluguNews

Recommended Video

Evening News Express : 3 Minutes 10 Headlines | Coronavirus | YCP MLA Roja Slams Chandrababu

త్వరలో బీజేపీలో కీలక నేత అమిత్ షా తెలంగాణలో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో పాల్గొననున్నారు. సీఎం కేసీఆర్, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీలను టార్గెట్ చేసి బీజేపీ ఈ సభ నిర్వహిస్తున్నట్టు తెలుస్తుంది. కేంద్ర సర్కార్ లో బీజేపీలో కీలక నేతగా భావిస్తున్న కేంద్ర హోం మంత్రి అమిత్‌షా మార్చి నెల 15వతేదీన హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో బహిరంగ సభలో మాట్లాడనున్నారు.

తెలంగాణాలో అమిత్ షా పర్యటన సందర్భంగా ఆయన ఏం వ్యాఖ్యలు చేస్తారు అన్నదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. తెలంగాణా రాష్ట్రంలో సీఏఏ పై అవగాహన కల్పించటం కోసం బీజేపీ భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించింది. ఓవైపు కేంద్రం ప్రభుత్వం తీసుకొచ్చిన సీఏఏకు వ్యతిరేకంగా దేశ్యాప్తంగా ఆందోళన కొనసాగుతుండగా.. హైదరాబాద్‌లోనూ నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. ఇక ఏకంగా టీఆర్ఎస్ పార్టీ క్యాబినెట్ లో సీఏఏ కు వ్యతిరేకంగా తీర్మానం చేసింది .

Amit Shah public meeting in Telangana targets cm kcr and owaisi

ఇక ఇదే సమయంలో.. భారతీయ జనతా పార్టీ.. సీఏఏకు అనుకూలంగా సభలు నిర్వహిస్తోంది. ఇక ఎప్పుడు రాష్ట్రానికి అమిత్ షా వచ్చి వెళ్ళినా హాట్ హాట్ గా చర్చ జరుగుతుంది. ఎప్పుడు రాష్ట్రానికి వచ్చినా.. ఏదో హాట్ కామెంట్ చేసే వెళ్లే అమిత్‌షా ఈ సారి ఏం మాట్లాడతారనేది రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది. సీఎం కేసీఆర్ ను, అలాగే ఓవైసీ ని పక్కాగా టార్గెట్ చేసి మాట్లాడతారనే చర్చ జరుగుతుంది. మరోవైపు సీఏఏకు వ్యతిరేకంగా తెలంగాణ కేబినెట్ తీర్మానం కూడా చేయడంతో టీఆర్ఎస్ సర్కార్‌ను టార్గెట్ చేస్తూనే ఆయన సభలో ప్రసంగిస్తారని భావిస్తున్నారు. ఏది ఏమైనా అమిత్ షా పర్యటనపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది .

English summary
Soon BJP's key leader Amit Shah will be visiting telenagana targeting CM KCR, and MIM leader asaduddin owaisi . The BJP leader, union minister Amith shah will be sharing his views on the CAA, NRC issue and also targets cm kcr . amith shah tour to telangana is a hot topic for the political circles because when ever he comes to telangana he makes sensational comments on CM KCR .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X