కరీంనగర్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎవరైనా మరిచిపోతారా, మోడీని అభిమానిస్తారనే కేసీఆర్ అంగీకరించలేదు: అమిత్ షా

|
Google Oneindia TeluguNews

Recommended Video

కేసీఆర్‌తో ఒప్పందంపై తేల్చేసిన అమిత్ షా

కరీంనగర్: ప్రధాని నరేంద్ర మోడీకి భయపడే కేసీఆర్ ముందస్తుకు వెళ్లారని బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా కరీంనగర్ బహిరంగ సభలో విమర్శలు గుప్పించారు. దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తానని చెప్పిన హామీని కేసీఆర్ నిలబెట్టుకోలేదన్నారు. డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేయలేదని చెప్పారు. కేసీఆర్ 2014లో దళితుడిని సీఎంగా చేస్తానని చెప్పారని అన్నారు. ముందస్తు ఎన్నికలతో కేసీఆర్ ప్రజలపై అదనపు భారం వేశారని చెప్పారు.

<strong>అందుకే రామిరెడ్డి, బూతులు మాట్లాడే...: కేసీఆర్‌పై విజయశాంతి తీవ్రవ్యాఖ్యలు</strong>అందుకే రామిరెడ్డి, బూతులు మాట్లాడే...: కేసీఆర్‌పై విజయశాంతి తీవ్రవ్యాఖ్యలు

అన్ని రంగాల్లో కేసీఆర్ ప్రభుత్వం విఫలమైందని చెప్పారు. లక్ష ఉద్యోగాలు నియమిస్తామన్న హామీని నెరవేర్చలేదన్నారు. రాష్ట్రంలో రెండు లక్షల ఖాళీలు ఉన్నాయని, కానీ వాటిని పూర్తి చేయడం లేదని చెప్పారు. నాలుగున్నరేళ్లలో ఒక్క లెక్చరర్ పోస్టును భర్తీ చేయలేదని చెప్పారు. రజాకార్లు చేసిన అన్యాయాన్ని ఎవరైనా మరిచిపోతారా అని ప్రశ్నించారు. ఏప్రిల్‌లో జరగాల్సిన ఎన్నికలు డిసెంబర్‌లో జరగడానికి మోడీకి భయపడటమే కారణం అన్నారు.

సెప్టెంబర్ 17ని అధికారికంగా నిర్వహిస్తాం

సెప్టెంబర్ 17ని అధికారికంగా నిర్వహిస్తాం

బీజేపీకి ఒక్కసారి అవకాశమిస్తే 2019లో సెప్టెంబర్ 17ని అధికారికంగా నిర్వహిస్తామని అమిత్ షా చెప్పారు. రజాకార్ల అన్యాయాన్ని ఎవరూ మరిచిపోరన్నారు. నాలుగున్నరేళ్లలో ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయలేదని అన్నారు. 1200 మంది అమరవీరులలో 800 మందికి ఎలాంటి సహాయ సహకారాలు అందలేదని చెప్పారు. మజ్లిస్‌కు భయపడి విమోచన దినోత్సవాన్ని జరపడం లేదన్నారు. మైనార్టీలకు బీసీ రిజర్వేషన్లతో బీసీలు, ఎస్టీ, ఎస్సీలకు అన్యాయం జరుగుతుందన్నారు.

కేంద్రం నిధులు పక్కదారి

కేంద్రం నిధులు పక్కదారి

మిషన్ కాకతీయలో 1500 కోట్ల రూపాయలు ఖర్చు చేసినా చెరువులను బాగు చేయలేకపోయారని అమిత్ షా చెప్పారు. దేశంలో కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఉందో భూతద్దంలో చూడాల్సిన పరిస్థితి ఉందని ఎద్దేవా చేశారు. రైతుల ఆత్మహత్యల్లో తెలంగాణ మొదటి స్థానంలో ఉందని చెప్పారు. ఇళ్ల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను పక్కదారి పట్టించారని ఆరోపించారు.

పీవీ నర్సింహా రావుకు అన్యాయం

పీవీ నర్సింహా రావుకు అన్యాయం

పీవీ నర్సింహా రావు అంత్యక్రియలు కూడా ఢిల్లీలో జరగకుండా అడ్డుకున్నారని, అలాంటి కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పాలని అమిత్ షా అన్నారు. పీవీకి జరిగిన అన్యాయంపై తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీని నిలదీయాలన్నారు. దేశంలో జరుగుతున్న అభివృద్ధి తెలంగాణలో కూడా కావాలంటే బీజేపీకి ఓటు వేయాలని చెప్పారు. జాతీయ ఆరోగ్య పథకం ఆయుష్మాన్ భారత్‌ను కేసీఆర్ తిరస్కరించారని, అది తెలంగాణలో అమలైతే మోడీ పట్ల, బీజేపీ పట్ల ప్రజలు సానుభూతితో ఉంటారని తిరస్కరించారని, మీకు వ్యక్తిని తిరస్కరించాలన్నారు.

రాహుల్ గాంధీ ప్రచారం చేసిన రాష్ట్రాల్లో కాంగ్రెస్ గెలవదు

రాహుల్ గాంధీ ప్రచారం చేసిన రాష్ట్రాల్లో కాంగ్రెస్ గెలవదు

యూపీఏ హయాంలో కేసీఆర్ కేంద్రమంత్రిగా ఉన్నారని, అలాంటి సమయంలో వచ్చిన నిధుల కంటే ఇప్పుడు నరేంద్ర మోడీ ప్రభుత్వంలో వచ్చిన నిధులు ఎక్కువ అన్నారు. మీరు బ్రేకింగ్ ఇండియా వైపు ఉంటారా, మేకింగ్ ఇండియా వైపు ఉంటారా చెప్పాలన్నారు. రాహుల్ గాంధీ ప్రచారం చేసినా ఏ రాష్ట్రంలోను కాంగ్రెస్ గెలవలేదన్నారు.

English summary
Bharatiya Janata Party national president Amit Shah public meeting in Karimnagar on Wednesday. He lashed out at Telangana CM KCR and Congress party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X