వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇక కేసీఆర్‌తో అమిత్ షా అమీతుమీ.. వచ్చే నెల తెలంగాణలోనే అడ్డా

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్‌పై బీజేపీ కయ్యానికి సిద్ధమవుతోంది. గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన బీజేపీ అదే ఊపుతో తెలంగాణలోనూ విస్తరించాలని కోరుకుంటోంది. దీనికి అనుగుణంగా రాష్ట్రంలో నాలుగైదు రోజుల పాటు మకాం వేసి, పార్టీ బలోపేతానికి కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా భావిస్తున్నట్టు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి.

Recommended Video

ఎన్నికలొస్తే కెసిఆర్‌కు షాక్, సంకీర్ణం తప్పదంటూ ఆ సర్వే !

వచ్చే నెలలోనే అమిత్‌షా తెలంగాణ పర్యటన ఉంటుందని ఆ పార్టీ నేతలు తెలిపారు. రాష్ట్రంలో బీజేపీ నేతల బలం, బలహీనతలపై జాతీయ నాయకత్వం ఇప్పటికే వివిధ వర్గాల నుంచి సమగ్ర నివేదికను తెప్పించుకున్నది. రాష్ట్రంలో బీజేపీ ఎదుగుదలకు అవసరమైన మార్గాలను కూడా అన్వేషించినట్టు సమాచారం.

 బలం గల నేతలందరికీ ఇలా అమిత్ షా గాలం

బలం గల నేతలందరికీ ఇలా అమిత్ షా గాలం

టీఆర్‌ఎస్‌ అంతర్గత వ్యవహారాలపైనా బీజేపీ జాతీయ నాయకత్వం దృష్టి సారించింది. టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ ముఖ్య నేతలపై కూడా కన్నేసినట్టుగా తెలుస్తోంది. విద్యార్థి దశ నుంచి సంఘ్‌తో సంబంధాలు ఉన్న నాయకులే ఇప్పటిదాకా బీజేపీలో కీలకపాత్ర పోషించేవారు. తెలంగాణలో ఇప్పుడా సంప్రదాయాన్ని పక్కన పెట్టాలని నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. పార్టీని విస్తరించే సామర్థ్యం, గెలిచే సత్తా ఉన్నవారిని పార్టీలో చేర్చుకోవడానికి జాతీయ నాయకత్వం ఎత్తులు వేస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్‌లోని కొందరు ముఖ్యనేతలతో ప్రాథమికంగా చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. ఈ చర్చలు ఇంకా కొలిక్కిరాలేదని సమాచారం. ఇంతలోనే గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్‌ ఎన్నికలు రావడంతో చర్చలకు అంతరాయం కలిగిందని బీజేపీ జాతీయ నాయకుడొకరు తెలిపారు. ప్రస్తుతం గుజరాత్, హిమాచల్‌ ప్రదేశ్‌ ఎన్నికలు పూర్తయి ఫలితాలు వచ్చిన నేపథ్యంలో ఈ చర్చలు మళ్లీ జరుగుతాయని తెలిపారు.

 కీలక గులాబీ నేతలతో అమిత్ షా సంప్రదింపులు

కీలక గులాబీ నేతలతో అమిత్ షా సంప్రదింపులు

టీఆర్‌ఎస్‌ ముఖ్యనేతలతోనూ అమిత్‌షా సంప్రదిస్తున్నట్టు బీజేపీ నేతలు చెబుతున్నారు. టీఆర్‌ఎస్‌లోని ఏ స్థాయి నాయకులతో ఆయన మాట్లాడుతున్నారనే విషయంపై వారు స్పష్టత ఇవ్వడంలేదు. కాగా, జాతీయ పార్టీకి నాయకత్వం వహిస్తున్న అమిత్‌షా స్థాయిలో చర్చలు జరపాలంటే ఏ పార్టీలోనైనా కీలకంగా ఉన్నవారే అయి ఉంటారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. జనవరిలోనే అమిత్‌షా పర్యటన ఉంటుందని, ఇది కీలకం కాబోతోందని రాష్ట్ర నేతలు చెబుతున్నారు. తమ అధ్యక్షుడి దృష్టి అంతా టీఆర్‌ఎస్‌ నేతల చుట్టూనే తిరుగుతున్నదని అంటున్నారు.

 ఐదు స్థానాల బాధ్యతలు రాం మాధవ్‌కు అప్పగింత

ఐదు స్థానాల బాధ్యతలు రాం మాధవ్‌కు అప్పగింత

బీజేపీ రాష్ట్ర నేతల మధ్య సయోధ్య, సమన్వయం లేకపోవడం ఇప్పటిదాకా ఆ పార్టీ బలోపేతానికి అవరోధంగా మారిందని జాతీయ నాయకత్వానికి పలు ఫిర్యాదులు అందినట్టుగా తెలుస్తోంది. దీన్ని అధిగమించడానికి జాతీయ నాయకత్వమే నేరుగా రంగంలోకి దిగాలనే యోచనకు వచ్చినట్టుగా కమలనాథులు చెబుతున్నారు. దీనికోసం రాష్ట్రంలో ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి ఒక జాతీయస్థాయి నాయకుడికి బాధ్యతలు అప్పగించి, బూత్‌స్థాయి వరకు ప్రణాళికలు రూపొందించాలని నాయకత్వం భావిస్తోంది. ఇప్పటికే సమారు 13 లోక్‌సభ నియోజకవర్గాలకు సంబంధించిన మండలస్థాయిలోని రాజకీయ పరిస్థితులపై సమగ్ర అధ్యయనం చేసి, నివేదికలు సిద్ధం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్‌కు 5 లోక్‌సభా స్థానాల బాధ్యతలను అమిత్ షా అప్పగించారని వినికిడి.

 బూత్ స్థాయిలో విస్తరణే అమిత్ షా వ్యూహం

బూత్ స్థాయిలో విస్తరణే అమిత్ షా వ్యూహం

ఇక బీహార్‌ మంత్రి మంగళ్‌పాండేకు 4, కేంద్రమంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌కు 4 నియోజకవర్గాల బాధ్యతలను స్థూలంగా అప్పగించింది. రాంమాధవ్‌ ద్వారా కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్, జహీరాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గాల సమాచారాన్ని తెప్పించుకోగా, మంగళ్‌పాండే ద్వారా మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూలు, మల్కాజిగిరి, చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గాల ప్రణాళిక సిద్ధం చేసుకుంది. కేంద్రమంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌ ద్వారా నల్లగొండ, భువనగిరి, వరంగల్, మహబూబాబాద్‌ నియోజకవర్గాల ప్రణాళికను సిద్ధం చేసుకుంది. అమిత్‌షా పర్యటన తర్వాత ప్రతీ లోక్‌సభ నియోజకవర్గానికి ఒక జాతీయనేతను ఇన్‌చార్జిగా చేసి, బూత్‌స్థాయిలో పార్టీ విస్తరణకు వ్యూహం రచిస్తున్నట్టు చెబుతున్నారు.

English summary
BJP President Amit Shah Ready to give challenge Telangana CM Kalwakuntla Chandra Shekhar Rao. As well as he has concentrated on crowdfull leaders in Telangana. BJP Sources said that Next month Amit Shah will camp in Telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X