వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇక్కడ గెలిస్తేనే: కేసీఆర్ ముందస్తుకు ఎందుకు వెళ్లారో చెప్పిన అమిత్ షా!

|
Google Oneindia TeluguNews

Recommended Video

కేసీఆర్ పై నిప్పులు చెరిగిన అమిత్ షా !

హైదరాబాద్: భారతీయ జనతా పార్టీకి 11 మంది కోట్ల సభ్యులు ఉన్నారని, ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ అని ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా బుధవారం అన్నారు. అమిత్ షా బుధవారం హైదరాబాదులో అడుగు పెట్టారు. పలువురు నేతలతో భేటీ అనంతరం నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో జరిగిన సమరభేరీలో మాట్లాడారు. ఎన్నికల్లో పార్టీ శ్రేణులు కదనోత్సాహంతో ముందుకు సాగాలన్నారు.

39మంది కాంగ్రెస్ అభ్యర్థులు ఖరారు, ఎవరెవరు ఎక్కడి నుంచి అంటే? రంగంలో మాజీ ఎంపీలు39మంది కాంగ్రెస్ అభ్యర్థులు ఖరారు, ఎవరెవరు ఎక్కడి నుంచి అంటే? రంగంలో మాజీ ఎంపీలు

ఏపీ, తెలంగాణలలో గెలిస్తేనే సంపూర్ణ విజయం

ఏపీ, తెలంగాణలలో గెలిస్తేనే సంపూర్ణ విజయం

బీజేపీకి 15 రాష్ట్రాలలో ముఖ్యమంత్రులు ఉన్నారని అమిత్ షా చెప్పారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళ, ఒడిశా రాష్ట్రాలలో గెలిస్తేనే పార్టీకి సంపూర్ణ విజయం దక్కినట్లు అని చెప్పారు. అసదుద్దీన్ ఓవైసీ, అక్బరుద్దీన్ ఓవైసీల కోసమే తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ విమోచన దినోత్సవాన్ని నిర్వహించడం లేదని ఆరోపించారు.బీజేపీ దేశం కోసం పని చేస్తోందని, కేసీఆర్ కుటుంబం కోసం పని చేస్తోందని చెప్పారు.

కొడుకును సీఎం చేసేందుకే

కొడుకును సీఎం చేసేందుకే

మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్లు ఇస్తే బీసీ, దళితులకు అన్యాయం జరుగుతుందని అమిత్ షా అన్నారు. కేసీఆర్ తన కుటుంబ సభ్యులను ముఖ్యమంత్రిని చేసేందుకే అసెంబ్లీని రద్దు చేశారని ఆరోపించారు. తన కొడుకు కల్వకుంట్ల తారక రామారావు, తన కూతురు కల్వకుంట్ల కవితలలో ఎవరినో ఒకరిని ముఖ్యమంత్రిని చేసేందుకు ముందస్తు ఎన్నికలను తీసుకు వచ్చారని చెప్పారు.

119 నియోజకవర్గాల్లో ఒంటరి పోరు

తాము 119 నియోజకవర్గాల్లో ఒంటరిగా పోటీ చేస్తామని బీజేపీ తెలంగాణ అధ్యక్షులు అమిత్ షా చెప్పారు. మార్పు బీజేపీతోనే సాధ్యమని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీ భయంతోనే కేసీఆర్ ముందస్తును తెచ్చారని చెప్పారు. లోకసభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరిగితే బీజేపీ సత్తా చాటుతుందని కేసీఆర్ భయపడ్డారన్నారు.

అగ్రసేన్ మహారాజుకు నివాళి

కాగా, అంతకుముందు అమిత్ షా బంజారాహిల్స్‌లోని తెలంగాణ రాష్ట్ర సమితి భవన్‌కు, జగన్నాథ ఆలయానికి సమీపంలో ఉన్న శ్రీ అగ్రసేన్ మహారాజు విగ్రహానికి పూలమాల వేసి, నివాళులు అర్పించారు. అగ్రసేన్ మహారాజు జయంతి సందర్భంగా నివాళి అర్పించారు.

English summary
BJP national president Amit Sha revealed why Telangana care taker Chief Minister KCR going for Early Elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X