వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణ ఎన్నికల సంయుక్త ప్రధానాధికారిగా ఆమ్రపాలి

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: రాష్ట్ర ఎన్నికల సంయుక్త ప్రధానాధికారిగా ఐఏఎస్ అధికారి ఆమ్రపాలి కాటాని చీఫ్ ఎలక్షన్ కమిషన్ నియమించింది. రాష్ట్రంలో ఎన్నికలు జరగనుండటంతో.. మరో ఐఏఎస్ అధికారిని నియమిస్తూ.. కేంద్ర ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది. ఎన్నికల నిర్వహణ ప్రక్రియలో ఐటీ సంబంధిత అంశాలను ఆమ్రపాలి పర్యవేక్షించనున్నారు.

ప్రస్తుతం ఆమ్రపాలి.. జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. అంతకుముందు, వరంగల్ కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు.రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణకు తక్కువ సమయం ఉండడంతో ఉన్నతాధికారుల నియామకం అవసరమైంది.

ఇంట్లోనే దెయ్యం, ఆ భయంతోనే సాహసం చేయలేదు: కలెక్టర్ ఆమ్రపాలి ఇంట్లోనే దెయ్యం, ఆ భయంతోనే సాహసం చేయలేదు: కలెక్టర్ ఆమ్రపాలి

Amrapali Kata appointed Jt CEO for TS

ఓటర్ల నమోదు, ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లను పర్యవేక్షణలో.. ఇప్పటికే ఉన్న అధికారులపై పని ఒత్తిడి పెరిగింది. దీంతో.. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్ కు మరో ఇద్దరు అధికారులను సహాయకులుగా నియమించింది కేంద్ర ఎన్నికల సంఘం.

ఇప్పటికే జ్యోతి బుద్ధ ప్రకాష్ ను ఎన్నికల అదనపు అధికారిగా నియమించింది. తాజాగా ఐఏఎస్ ఆఫీసర్ ఆమ్రపాలిని జాయింట్ సీఈఓగా నియమిస్తూ నిర్ణయం తీసుకుంది కేంద్ర ఎన్నికల సంఘం.

English summary
GHMC Additional Commissioner Amrapali Kata has been appointed as Joint Chief Electoral Officer, Telangana. The Election Commission of India has issued orders to this effect on Thursday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X