వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆస్తిలో చిల్లిగవ్వ అక్కర్లేదు.. అమ్మా నువ్వు జాగ్రత్త.. ఎవరినీ నమ్మకు : కన్నీటిపర్యంతమైన అమృత ప్రణయ్

|
Google Oneindia TeluguNews

మారుతీరావు మరణవార్తే తనకు శుభవార్త అని తాను ఎక్కడా కామెంట్ చేయలేని అమృత ప్రణయ్ స్పష్టం చేశారు. బాబాయ్ శ్రవణ్ తనపై లేని ఆరోపణలు చేస్తున్నారన్నారని అన్నారు. తాను అలాంటి వ్యాఖ్యలు చేసి ఉంటే ప్రూఫ్ చూపించాలన్నారు. ఆస్తి కోసం డ్రామాలు అన్న శ్రవణ్ ఆరోపణలను కొట్టిపారేశారు. తనకు గానీ,తన బాబుకు గానీ,అత్తమామలకు గానీ మారుతీరావు ఆస్తిలో చిల్లిగవ్వ కూడా అవసరం లేదన్నారు.

అవసరమైతే అడుక్కు తినైనా బతుకుతా గానీ ఆస్తి అడగను అన్నారు. ఎవరి మైండ్ సెట్ ఎలా ఉంటే అలాంటి ఆలోచనలే వస్తాయని.. కాబట్టే శ్రవణ్ ఆస్తి విషయంలో తనపై లేని ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు. తాను చేయని వ్యాఖ్యలే చేశానని చెబుతున్నవాడు.. ఇతర విషయాల్లో అబద్దం చెప్పట్లేదన్న గ్యారెంటీ ఏంటని ప్రశ్నించారు.

ఆత్మహత్య బాధనిపించింది.. శ్రవణ్‌పై అనుమానాలు.. అమ్మకు అతనితో ప్రాణహాని: అమృత ప్రణయ్

Recommended Video

Amrutha Pranay Press Meet After Her Father Maruthi Rao's Last Rites | Oneindia Telugu
ప్రేమ ఒకరికి హానీ చేయకూడదు..

ప్రేమ ఒకరికి హానీ చేయకూడదు..

మారుతీరావు ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదు కాబట్టే మొదట నమ్మలేకపోయానని అమృత చెప్పారు. అయితే సూసైడ్ నోట్‌లో చేతి రాత తన తండ్రిదేనని.. కాబట్టి ఆత్మహత్యే అనుకుంటున్నామని తెలిపారు. ఆత్మహత్యపై ఎటువంటి అనుమానాలు లేవన్నారు. చట్టపరంగా శిక్ష పడాలనుకున్నానని.. తన భర్తను చంపినందుకు అదే సరైన శిక్ష అవుతుందని భావించినట్టు చెప్పారు. ఆత్మహత్య చేసుకోవడం బాధపెట్టిందన్నారు. అమృత మీద ప్రేమతోనే ఆత్మహత్య చేసుకున్నారని కొంతమంది చెబుతున్నారని.. తన కళ్లముందే తన భర్తను చంపేసి మళ్లీ రమ్మంటే ఎలా వెళ్తారని ప్రశ్నించారు. ప్రేమ అనేది ఒకరి ప్రాణాలు తీసేలా లేదా తమ ప్రాణం తామే తీసుకునేలా ఉండకూడదన్నారు. ఒకరికి హానీ చేసేలా ప్రేమ ఉండకూడదన్నారు.

ఆస్తే కావాలనుకుంటే అప్పుడే వెళ్లిపోయేదాన్ని..

ఆస్తే కావాలనుకుంటే అప్పుడే వెళ్లిపోయేదాన్ని..

ఆస్తే కావాలనుకుంటే అసలు ప్రణయ్‌తో వచ్చేదాన్నే కాదన్నారు. పెళ్లి తర్వాత ఆస్తి మొత్తం ట్రస్టుకు రాసిస్తానని వాట్సాప్‌లో మెసేజ్ షేర్ చేశారని.. ఆస్తే కావాలనుకుంటే అప్పుడైనా వెళ్లేదాన్ని అన్నారు.

ఆస్తిపై ఆసక్తే ఉంటే ప్రణయ్ హత్య తర్వాతైనా మళ్లీ కుటుంబం వద్దకు వెళ్లిపోయేదాన్ని అని చెప్పారు. కాబట్టి ఆస్తిపై తనకు ఏనాడు ఆసక్తి లేదని.. తాను,తన బాబు,అత్తమామలకు చిల్లిగవ్వ కూడా అవసరం లేదని స్పష్టం చేశారు.

ప్రణయ్ హత్య తర్వాత వాళ్లు నన్ను ఓదార్చలేదు.. కానీ నేను వెళ్లాను..

ప్రణయ్ హత్య తర్వాత వాళ్లు నన్ను ఓదార్చలేదు.. కానీ నేను వెళ్లాను..

ప్రణయ్ హత్య తర్వాత కనీసం నన్ను ఓదార్చేందుకు అటువైపు నుంచి ఎవరూ రాలేదని అమృత గుర్తుచేశారు. కానీ తనకు మానవత్వం ఉందని.. అందుకే తండ్రి మాటకు గౌరవమిచ్చి అంత్యక్రియలకు వెళ్లానని చెప్పారు. కూతురిపై ప్రేమతోనే మారుతీరావు చనిపోయాడని చెబుతున్న శ్రవణ్.. మరి సూసైడ్‌ నోట్‌లో ఆయన రాసిన చివరి మాటకు ఎందుకు గౌరవం ఇవ్వట్లేదని ప్రశ్నించారు. కడసారి చూపు చూడకుండా ఎందుకు అడ్డుకున్నారని ప్రశ్నించారు. మారుతీరావు,శ్రవణ్ ఇద్దరికీ కుల అహంకారం ఉందని.. అందుకే ప్రణయ్‌ని హత్య చేశారని ఆరోపించారు. అయినప్పటికీ తాను తండ్రికి గౌరవమిచ్చి అంత్యక్రియలకు వెళ్లానని చెప్పారు.

శ్రవణ్ అప్పుడెందుకు మారుతీరావుతో గొడవపడ్డాడు..

శ్రవణ్ అప్పుడెందుకు మారుతీరావుతో గొడవపడ్డాడు..

శ్రవణ్ ఏడాదికాలంగా మారుతీరావుతో మాట్లాడట్లేదని చెబుతున్నాడని.. మరి ప్రణయ్‌తో పెళ్లికి ముందే నాన్నతో ఎందుకు గొడవపడ్డారని ప్రశ్నించారు. ప్రణయ్‌తో పెళ్లి తర్వాత పరువు పోయిందని మాట్లాకపోతే.. మరి పెళ్లికి ముందు ఎందుకు సోదరుడితో గొడవపడ్డాడు.. ఎందుకు మాట్లాడలేదు అని అమృత ప్రశ్నించారు. తాను అనకపోయినా.. తండ్రి మరణవార్తను శుభవార్త అన్నానని శ్రవణ్ చెబుతున్నాడని.. తాను చేయని వ్యాఖ్యలే చేశానని చెబుతున్నవాడు.. ఇతర విషయాల్లో అబద్దం చెప్పట్లేదన్న గ్యారెంటీ ఏంటని ప్రశ్నించారు.

కొద్ది నెలల క్రితం మారుతీరావుపై శ్రవణ్ దాడి చేశాడన్నది మిర్యాలగూడలో అందరికీ తెలిసిన నిజమని చెప్పారు. శ్రవణ్‌కు భయపడి ఆయన వేరేవాళ్ల ఇళ్లల్లో తలదాచుకున్నాడని అన్నారు. కానీ బయటకు చెప్పేందుకు అందరూ భయపడుతారని అన్నారు.

తల్లికి సందేశం..

తల్లికి సందేశం..

ప్రణయ్ జస్టిస్ జరగాలని తాను.. మారుతీరావు కోసం తన తల్లి ఇన్నాళ్లు చట్టబద్దంగా పోరాడామని.. కేసుల్లో ఉన్నందువల్లే ఇప్పటివరకు మాట్లాడుకోలేదని అమృత చెప్పారు. భర్త చనిపోతే ఎంత బాధ ఉంటుందో తనకు తెలుసన్నారు. కాబట్టే తల్లిని ఓదార్చేందుకు అంత్యక్రియలకు వెళ్లానని చెప్పారు. తన తల్లే అమృతను అడ్డుకోమని చెప్పిందని వాళ్లు చెబుతున్నారని.. కానీ ఆమె అలా చెప్పిందో లేదో తనకు తెలియదన్నారు. ప్రణయ్ హత్య తర్వాత అతని కుటుంబం చేరదీయడంతో తాను ఒంటరిదాన్ని కాలేదని అన్నారు. కానీ ఇప్పుడు తన తల్లి ఒంటరిదైపోయిందని అన్నారు. తన తల్లి బాధ్యతలు తీసుకునేందుకు తాను సిద్దంగా ఉన్నానని చెప్పారు.

'అమ్మా స్ట్రాంగ్‌గా ఉండు.. భయపడకు.. నీ లైఫ్ నాశనం అవాలని నేను అనుకోలేదు. ఎవ్వరినీ నమ్మవద్దు.. చుట్టుపక్కలవాళ్లను అస్సలు నమ్మవద్దు. నిన్ను ట్రాప్ చేసేవాళ్లు ఉంటారు. నువ్వు నన్ను కలవాలి అనుకుంటే నిన్ను కలుస్తాను. నిన్ను ఓదార్చాలనే వచ్చాను.. నువ్వు వద్దన్నావని చెబుతున్నారు.. దానిపై క్లారిటీ లేదు. నా దగ్గరకు వస్తే కచ్చితంగా నిన్ను చూసుకుంటాను. తొందరపాటు నిర్ణయాలతో ఇంకొక లైఫ్ పోవాలని లేదు. ఏ సహాయం కావాలన్నా నన్ను సంప్రదించు.' అంటూ అమృత కన్నీటిపర్యంతమయ్యారు.

English summary
who is nowhere to be remarked, said the death of Maruthira Rao was good news for him. Babai Shravan said there were no allegations against him. If he has made such comments he should prove the proof. Shravan dismissed the allegations that Dramas was for the property.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X