హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఇంజనీరింగ్ చేసి.. గర్ల్‌ఫ్రెండ్‌‌తో దర్జాగా బతకాలని.. హైదరాబాద్‌లో ఓ రొమాంటిక్ క్రైమ్ కథ

|
Google Oneindia TeluguNews

వాళ్లిద్దరూ చిన్ననాటి స్నేహితులు.. స్కూల్ పూర్తయ్యేనాటికి ప్రేమికులు.. ఆమె ఇంటర్ లో ఫెయిలై చదువు ఆపేయగా.. అతను మాత్రం కష్టపడి ఇంజనీరింగ్ పూర్తిచేశాడు.. హైదరాబాద్ లో ఉంటూ హ్యాపీగా కలిసితిరిగేవాళ్లు.. రానురాను జల్సాలకు అలవాటుపడ్డారు.. డబ్బుల అవసరం పెరిగింది.. దీంతో క్రైమ బాట పట్టారు.. పోలీసులకు చిక్కకుండా చాలా దొంగతనాలు చేశారు.. కానీ ప్రతి క్రైమ్ కథలో జరిగినట్లే అనూహ్యంగా పట్టుపడ్డారు.. రాచకొండ పోలీసులు మీడియాకు వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి..

ఇద్దరూ ఇద్దరే

ఇద్దరూ ఇద్దరే


ఖమ్మం జిల్లాకు చెందిన భానువికాస్, వరంగల్ జిల్లాకు చెందిన సకినాల మానస లవర్స్. ఇంజనీరింగ్ పూర్తిచేసిన అతను ప్రస్తుతం జొమాటో డెలివరీ బాయ్ గా చేస్తున్నాడు. మానస మాత్రం అప్పుడప్పుడూ ఓల్డ్ ఏజ్ హోమ్స్ లో హెల్పర్ గా పనిచేసేది. దర్జాలకు కావాల్సిన డబ్బుల కోసం బైక్ పై తిరుగుతూ.. సిటీ శివారులో కొత్తగా అభివృద్ధి చెందుతోన్న కాలనీల్లో.. నిర్మానుష్యంగా ఉండే ఇళ్లను గుర్తించి దొంగతనాలకు పాల్పడేవాళ్లు.

పెప్పర్ స్ప్రే స్పెషలిస్టులు..

పెప్పర్ స్ప్రే స్పెషలిస్టులు..


మంచినీళ్లు కావాలనో, ఇల్లు అద్దెకు కావాలనో లోపలికి ప్రవేశించే ఈ జంట.. ఒంటరి మహిళలపై అమాంతం పెప్పర్ స్ప్రేతో దాడి చేసి ఆభరణాలు కాజేసి పారిపోయేవాళ్లు. చోరీ సొత్తును అమ్మగా వచ్చిన డబ్బులతో సిటీలో షాపింగ్స్ గట్రా చేసేవాళ్లు. కొన్నాళ్లుగా పోలీసుల కళ్లుగప్పి తప్పించుకున్నా.. చిన్న పొరపాటుతో దొరికిపోయిందీ జంట.

మలుపుతిప్పిన సంఘటన..

మలుపుతిప్పిన సంఘటన..

భాను వికాస్, మానసలు 40 రోజుల కిందట.. చెంగిచర్లలోని కనకదుర్గా కాలనీలో అసురెడ్డి బాలమణి అనే మహిళ ఇంట్లో చోరీకి పాల్పడ్డారు.బాధితుల ఫిర్యాదుమేరకు రంగంలోకి దిగిన పోలీసులు.. చుట్టుపక్కల ఏరియాల్లోని సీసీ టీవీ కెమెరాలను పరిశీలించగా.. టీఎస్‌03 ఈటీ 1326 నంబర్ గల హోండా యాక్టివాపై అనుమానిత జంటను గుర్తించారు. కానీ ఆ బైక్ పోలీసులకు దొరకలేదు.

అడ్డంగా దొరికారిలా..

అడ్డంగా దొరికారిలా..

చెంగిచెర్లలో చోరీ తర్వాత పోలీసుల నిఘా ఉంటుందని ముందే ఊహించిన ప్రేమజంట.. బైక్ ను జాగ్రత్తగా ఇంట్లోనే దాచిపెట్టారు. దాదాపు 40 రోజుల తర్వాత.. నిఘా తగ్గిపోయిందన్న ఉద్దేశంతో మళ్లీ బైక్ పై తిరగడం మొదలుపెట్టారు. రెండ్రోజుల కిందట.. బోడుప్పల్ కమాన్ సిగ్నల్ దగ్గరున్న సీసీటీవీ కెమెరాలో వీళ్ల కదలికలు రికార్డయ్యాయి. వెంటనే అప్రమత్తమైన పోలీసులు, సీసీఎస్ టీమ్స్ తో కలిసి దొంగల్ని కనిపెట్టి అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. వారి దగ్గర్నుంచి బైక్ తోపాటు చోరీ చేసిన సొత్తును కూడా స్వాధీనం చేసుకున్నారు.

English summary
An engineering graduate and his girlfriend who were allegedly involved in robbing people were nabbed by the Rachakonda police. Based on clues from CCTVs, the accused, Pappula Bhanu Vikas and Sakinala Manasa, were arrested and stolen property recovered from their possession, the police said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X