హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హైదరాబాద్‌లో పేలుళ్ల కుట్ర: ప్రధాన సూత్రధారి ఇంగ్లీష్ టీచర్‌!(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: నగరంలో భారీ స్థాయిలో పేలుళ్లకు పాల్పడేందుకు కుట్ర పన్నిన ఏడుగురు ఐఎస్(ఇస్లామిక్ స్టేట్) సానుభూతిపరులను జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మొదట ఐదుగురు ఐఎస్ సానుభూతిపరులను అరెస్ట్ చేసిన ఎన్ఐఏ, ఆ తర్వాత మరో ఇద్దరు సానుభూతిపరులను అరెస్ట్ చేసింది.

కాగా, తాజాగా అరెస్ట్ చేసిన ఇద్దరు సానుభూతిపరులను మంగళవారం కోర్టులో ప్రవేశపెట్టింది ఎన్ఐఏ. ప్రస్తుతం వారు ఎన్ఐఏ కస్టడీలోనే ఉన్నారు. ఐఎస్ ఉగ్ర కార్యకలాపాలను భారతదేశంలో చాటుకునేందుకు హైదరాబాద్ నగరంలో ఈ ముష్కరులు పేలుళ్లకు పాల్పడేందుకు కుట్ర పన్నారు.

అయితే, ఎన్ఐఏ, హైదరాబాద్ పోలీసులు సంయుక్తంగా విస్తృత గాలింపు చేపట్టి అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి పేలుడు పదార్థాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. తాజాగా అరెస్టైన వారిలో అతుల్లా రెహమాన్, మైమతుల్లా హుస్సేని ఉన్నారు. వీరిలో ఒకరు దాడుల సూత్రధారిగా పేర్కొంటుండగా, మరొకరు తమకు కావాల్సిన నిధులు సమీకరిస్తున్నట్లు తెలుస్తోంది.

హైద్రాబాద్‌లో భారీ పేలుళ్లకు ఐసిస్ కుట్ర: మరో ఇద్దరు అరెస్ట్హైద్రాబాద్‌లో భారీ పేలుళ్లకు ఐసిస్ కుట్ర: మరో ఇద్దరు అరెస్ట్

కాగా, అతుల్లా రెహమాన్ అలియాస్ గౌస్(32) నగరంలోని ఓ పాఠశాలలో ఇంగ్లీష్ టీచర్‌గా పని చేస్తున్నాడు. అరబిక్ భాషలో కూడా ప్రావీణ్యం ఇతడు.. విద్యార్థులకు ఈ భాషను కూడా బోధిస్తున్నాడు. ఇబ్రహీం యజ్దాని ఇంట్లో ఆయన విద్యార్థులకు అరబిక్ భాషను బోధిస్తున్నాడు.

పేలుళ్లకు కుట్ర పన్ని యాజ్ధాని కూడా ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నాడు. తనలాంటి కొందరు యువకులను తయారు చేసిన అతడు దాడులకు ప్రణాళిక వేసుకున్నాడు. ఈ దాడుల ప్రణాళికకు గౌస్ కీలకంగా వ్యవహరించాడు. ఐఎస్ఐఎస్ నేత అబూబాకర్ అల్ బాగ్దాదికి మద్దతుగా వీరు నగరంలో పేలుళ్లకు పాల్పడేందుకు సిద్ధమయ్యారు.

మంగళవారం అరెస్టైన మరో సానుభూతి పరుడు మైమతుల్లా హుస్సేని అలియాస్ యాసిర్ అలియాస్ అబూ దార్దా(42) నగరంలో పేలుళ్లకు కావాల్సిన నిధులను సమకూర్చేవాడని ఎన్ఐఏ పేర్కొంది. ఖైరతాబాద్‌లోని ఓ వస్త్ర దుకాణంలో పని చేసే ఇతడు కూడా హైదరాబాద్ పేలుళ్ల కుట్రలో కీలక వ్యవహరించాడని ఎన్ఐఏ తెలిపింది.

కోర్టుకు ఐఎస్ సానుభూతిపరులు

కోర్టుకు ఐఎస్ సానుభూతిపరులు

హైదరాబాద్ నగరంలో భారీ స్థాయిలో పేలుళ్లకు పాల్పడేందుకు కుట్ర పన్నిన ఏడుగురు ఐఎస్(ఇస్లామిక్ స్టేట్) సానుభూతిపరులను జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

కోర్టుకు ఐఎస్ సానుభూతిపరులు

కోర్టుకు ఐఎస్ సానుభూతిపరులు

మొదట ఐదుగురు ఐఎస్ సానుభూతిపరులను అరెస్ట్ చేసిన ఎన్ఐఏ, ఆ తర్వాత మరో ఇద్దరు సానుభూతిపరులను అరెస్ట్ చేసింది.

కోర్టుకు ఐఎస్ సానుభూతిపరులు

కోర్టుకు ఐఎస్ సానుభూతిపరులు

కాగా, తాజాగా అరెస్ట్ చేసిన ఇద్దరు సానుభూతిపరులను మంగళవారం కోర్టులో ప్రవేశపెట్టింది ఎన్ఐఏ. ప్రస్తుతం వారు ఎన్ఐఏ కస్టడీలోనే ఉన్నారు.

కోర్టుకు ఐఎస్ సానుభూతిపరులు

కోర్టుకు ఐఎస్ సానుభూతిపరులు

ఐఎస్ ఉగ్ర కార్యకలాపాలను భారతదేశంలో చాటుకునేందుకు హైదరాబాద్ నగరంలో ఈ ముష్కరులు పేలుళ్లకు పాల్పడేందుకు కుట్ర పన్నారు.

కోర్టుకు ఐఎస్ సానుభూతిపరులు

కోర్టుకు ఐఎస్ సానుభూతిపరులు

అయితే, ఎన్ఐఏ, హైదరాబాద్ పోలీసులు సంయుక్తంగా విస్తృత గాలింపు చేపట్టి అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి పేలుడు పదార్థాలను కూడా స్వాధీనం చేసుకున్నారు.

కోర్టుకు ఐఎస్ సానుభూతిపరులు

కోర్టుకు ఐఎస్ సానుభూతిపరులు

తాజాగా అరెస్టైన వారిలో అతుల్లా రెహమాన్, మైమతుల్లా హుస్సేనీ ఉన్నారు. వీరిలో ఒకరు దాడుల సూత్రధారిగా పేర్కొంటుండగా, మరొకరు తమకు కావాల్సిన నిధులు సమీకరిస్తున్నట్లు తెలుస్తోంది.

English summary
At a meeting held in Hyderabad 7 men pledged their allegiance to the formation of Caliphate and the so-called Caliph Abu Bakr al-Bhagdadi. The seven men who are now in the custody of the National Investigating Agency got together and decided that they would strike in Hyderabad in the name of the ISIS.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X