హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సైజ్‌‌పై నటి శిల్పాశెట్టి ఆవేదన: గ్రీన్‌ టీ మంచిది కాదు (ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: బాలీవుడ్ హీరోయిన్ శిల్పాశెట్టి బుధవారం నగరంలో సందడి చేశారు. ఓ మధ్య తరగతి కుటుంబంలో పుట్టి, నటిగా మారి ఆ తర్వాత వ్యాపారవేత్తగా రాణిస్తున్న శిల్పాశెట్టి యోగా మీద ఓ డీవీడీని ఆవిష్కరించారు. 'ద గ్రేట్‌ ఇండియన్‌ డైట్‌' అంటూ ఓ పుస్తకం రాశారు.

నగరంలోని పార్క్‌ హయత్‌ హోటల్‌లో 'ఏ హోలిస్టిక్‌ అప్రోచ్‌ టు లైఫ్‌ అండ్‌ ఏ సైంటిఫిక్‌ వే ఆఫ్‌ బీయింగ్‌ ఫిట్‌' అనే అంశంపై యంగ్‌ ఫిక్కీలేడీస్‌ ఆర్గనైజేషన్‌ (వైఎఫ్‌ఎల్‌ఓ) ఏర్పాటుచేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు. నగర సోషలైట్‌ పింకీరెడ్డితో పాటు వైఎఫ్‌ఎల్‌ఓ చైర్‌పర్సన్‌ సామియా ఆలంఖాన్‌, ఇతరసభ్యులు సంధించిన పలు ప్రశ్నలకు శిల్పాశెట్టి సమాధానమిచ్చారు.

మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చా:
నేను సినిమాల్లోకి రావాలని.. వస్తానని ఎప్పుడూ అనుకోలేదు. చెంబూర్‌ (ముంబై)లో ఓ మధ్యతరగతి కుటుంబానికి చెందిన నేను మా నాన్నచేసే చిరు వ్యాపారాన్ని కొనసాగించాలనుకున్నాను. అందుకోసమే కామర్స్‌ కోర్సులో చేరాను. కానీ అనుకోకుండా సినిమా అవకాశం వచ్చింది. నిజానికి ఈ రంగం గురించి నాకు తెలిసింది కూడా ఏమీ లేదు.

'బాజీగర్‌' మొదటి చిత్రం:
నా మొదటి చిత్రం బాజీగర్‌. షారూఖ్‌ఖాన్‌, కాజోల్‌తో పాటు నేను కూడా ఉన్నాను. ఆ సినిమాకు అవకాశం రావడం నాకిప్పటికీ ఆశ్చర్యమే. యాష్‌చోప్రా ఆఫీస్‌లో ఉండే దిలీప్‌ నాయక్‌ వల్లనే ఆ ఆఫీస్‌కి నేను వెళ్లగలిగాను. ఆయన నన్ను చూసి సినిమాలో నటిస్తావా అని యాష్‌చోప్రా ఆఫీస్‌కు తీసుకెళ్లారు. ఆ సినిమాలోని పాత్రకు ఎంతోమందిని ఆడిషన్‌ చేసి రిజెక్ట్‌ చేశారు. ఆడిషన్‌లో సెలెక్ట్‌ కావటం ఆ సినిమాలో చేయడం జరిగింది. మొదట మా నాన్న ఒప్పుకోలేదు, కానీ ఆ సినిమా ఫెయిల్‌ అయితే మళ్లీ చదువుకుంటానన్నాను. అందుకే సినిమాల్లో చేసినా కాలేజీ మానకూడదు అనే కండీషన్‌ మీద నన్ను షూటింగ్‌కి పంపారు.

అందువల్లే నాకు గుర్తింపు:

అందువల్లే నాకు గుర్తింపు:

కాజోల్‌కు మేకప్‌ వేసుకోవడమంటే చిరాకు. ఆమె సింపుల్‌గా, సహజంగా ఉండాలని కోరుకుంటుంది. కానీ 17.5 ఏళ్ల ఓ అమ్మాయికి ఎలాంటి ఆలోచనలుంటాయో అవే ఆలోచనలు నా దగ్గర ఉండేవి. అందుకే మేకప్‌ ఆర్టిస్ట్‌ వస్తే ఫుల్‌ మేకప్‌ చేయమనేదానిని. కాజోల్‌ మేకప్‌ చేసుకోకపోవడం వల్లనే నాకు ఆ సినిమాలో గుర్తింపు వచ్చింది (నవ్వు). బాజిగర్ సినిమాతో నాకు గుర్తింపు వచ్చింది.

 కాలేజీకి వెళ్లే అవకాశం రాలేదు:

కాలేజీకి వెళ్లే అవకాశం రాలేదు:

‘బాజీగర్‌' హిట్‌ కావటంతో మళ్లీ కాలేజీకి వెళ్లే అవకాశం రాలేదు. ఆ హిట్‌.. నా కాలేజీ జీవితానికి ఫుల్‌స్టాప్‌ పెట్టింది.

కాలేజీ టైమ్‌లోనే ఫిట్‌నెస్‌ ఫ్రీక్‌ను..

కాలేజీ టైమ్‌లోనే ఫిట్‌నెస్‌ ఫ్రీక్‌ను..

కాలేజీ టైమ్‌లోనే ఫిట్‌నెస్‌కు అధిక ప్రాధాన్యం ఇచ్చే దానిని. అప్పట్లో నేను వాలీబాల్‌ ప్లేయర్‌ను. 5 సార్లు స్టేట్‌ టీమ్‌కు రిప్రజెంట్‌ చేశాను. కరాటే తదితర స్పోర్ట్స్‌ కూడా ఆడేదానిని. శారీరం ఫిట్‌గా ఉండాలంటే స్పోర్ట్స్‌ ఆడటం అవసరం.
‘బిగ్‌ బ్రదర్‌' షోలో పాల్గొనండపై:

‘బిగ్‌ బ్రదర్‌' షోలో పాల్గొనండపై:


‘బిగ్‌బ్రదర్‌' షోలో పాల్గొనక ముందు నాకు ఆ షో గురించి తెలిసింది లేదు. నేను ఖాళీగా ఉన్న సమయంలో ఆ ఆఫర్‌ వచ్చింది. ఒక వీక్‌ చేసినా 2.5 కోట్లు ఇస్తామన్నారు. ఏదో ఒక ఛారిటీకి అది ఇవ్వొచ్చన్నారు. పరమేశ్వరీ గోద్రేజ్‌ ట్రస్ట్‌ను నేను ఎంచుకున్నా. వారం అనుకుంటే 4 వారాలు హౌస్‌లో ఉన్నాను.

 బిగ్ బ్రదర్ షోతో పాపులారిటీ

బిగ్ బ్రదర్ షోతో పాపులారిటీ

బిగ్ బ్రదర్ షోతో బాగా పాపులారిటీ వచ్చింది. హౌస్‌ లోపల ముగ్గురికి నా మీద అసూయ వచ్చి ఆ కామెంట్లు చేశారు. ఆ హౌస్‌ నుంచి బయటకొచ్చిన తరువాత చాలామంది భావోద్వేగంతో కంట తడిపెట్టడం నన్ను కదిలించింది. అప్పట్లో నా పాపులారిటీ అమాంతంపెరిగింది. బిగ్‌బ్రదర్‌ తరువాత పెళ్లి చేసుకోవా లనుకున్నా... రాజ్‌కుంద్రాతో పరిచయం.. పెళ్లి జరిగింది.

15 నెలల్లో మారిపోయా

15 నెలల్లో మారిపోయా

నాకు తెలిసి 25 ఏళ్లపాటు నా బరువు 56 నుంచి 60 కేజీల మధ్యనే ఉంది. అంతకు మించి నా బరువు పెరగలేదు. నా సైజ్‌ 8 మించిందీ లేదు. అలాంటిది పెళ్లయి ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత నా బరువు అదనంగా 32 కేజీలు పెరగడంతో పాటు నా సైజ్‌ 16కి వెళ్లింది.
గ్రీన్‌ టీ మంచిది కాదు

గ్రీన్‌ టీ మంచిది కాదు


గ్రీన్‌టీ లేదా మరోటీ వల్ల ఆరోగ్యం బాగుపడుతుందంటే నేను నమ్మను. కొంత మేరకు నిజం ఉండవచ్చు కానీ అది పరిమితంగా తీసుకున్నప్పుడే. రోజుకు మూడుసార్ల కన్నా ఎక్కువగా టీ తాగకూడదన్నది నా సిద్ధాంతం.

చెప్పే ముందు ఆచరించాలి

చెప్పే ముందు ఆచరించాలి


చెప్పే ముందు ప్రతి ఒక్కరూ వాటిని ఆచరిస్తే ఎంతో బాగుంటుంది. కానీ చాలా మంది వాటిని ఆచరించరు. పిల్లలకు ఓ విషయం గురించి చెబుతున్నామంటే వారికి ఆదర్శంగా నిలువాల్సిన ఆవశ్యకత ఉంది.

లైఫ్‌స్టైల్‌ను ఎలా మార్చుకోవాలంటే..

లైఫ్‌స్టైల్‌ను ఎలా మార్చుకోవాలంటే..


ఐదు అంశాలను గుర్తుంచుకోవాలి.. అవి 1. నీళ్లను నమలాలి. ఆహారాన్నితాగాలి. 2. భోజనం చేసేటప్పుడు మధ్యలో మంచినీళ్లు తాగకూడదు. 3. సాయంత్రం 4 గంటల తర్వాత ఆహారం తీసుకోవద్దు. ఆయుర్వేదంలో సూర్యాస్తమయం తరువాత ఫుడ్‌ తీసుకోవద్దని కూడా ఉంది. 4. ఓవర్‌ మెడికేషన్‌ తీసుకోవద్దు. 5. మీకోసం మీరు ఓ యాక్టివిటీ ఉంచుకోండి. యోగా, ఫిట్‌నెస్‌ ఎక్సర్‌సైజు ఏదైనా కావొచ్చు.

English summary
An interactive session with Shilpa Shetty on A Holistic Approach To Life and A Scientific Way of Being Fit held.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X