వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎంబీఏ గ్రాడ్యుయేట్: చేసేది ఇంత చిల్లర పనులా?, అడ్డంగా బుక్కయ్యాడు..

చోరీలకు పాల్పడుతున్న కిరణ్ రెడ్డి అనే ఓ ఎంబీఏ గ్రాడ్యుయేట్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.

|
Google Oneindia TeluguNews

Recommended Video

MBA Graduate Arrested For Stealing Laptops And Mobile Phones From Hostel | Oneindia Telugu

హైదరాబాద్: ఎంబీఏ చదువుకున్న ఓ యువకుడు డబ్బు కోసం పక్కదారి పట్టాడు. ఉద్యోగం చేసి సంపాదించుకోవాల్సింది పోయి చోరీల ద్వారా వచ్చిన డబ్బుతో జల్సాలకు అలవాటు పడ్డాడు.

ఫిర్యాదులతో నిందితుడి కోసం గాలించిన పోలీసులు ఎట్టకేలకు అతగాడిని పట్టుకున్నారు. తీరా దొరికాక.. 'సార్.. నేనెలా దొరికాను' అంటూ అమాయకంగా ప్రశ్నించాడు. ఆశ్చర్యపోయిన పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి మరిన్ని వివరాలు రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.

An MBA Graduate who Chose stealing laptops, mobiles as Profession

పోలీసుల కథనం ప్రకారం.. కరీంనగర్‌ జిల్లా చిల్వకోడూరు సమీపంలోని గోవింద్‌పల్లి ప్రాంతానికి చెందిన బాదం కిరణ్‌ రెడ్డి(26) ఎంబీఏ పూర్తి చేశాడు. నగరంలోని యూసుఫ్ గూడ యాదగిరి నగర్ లో ఉంటున్న అతని బావ వద్ద ఉంటున్నాడు.

ఆ నివాసానికి పక్కనే ఓ బాలుర వెల్ఫేర్ హాస్టల్ ఉంది. ఈజీ మనీ ఆలోచనలో కిరణ్ రెడ్డి.. ఆ హాస్టల్లో దొంగతనాలు చేయడం మొదలుపెట్టాడు. ల్యాప్‌టాప్‌లు, మొబైల్ ఫోన్స్ ఎత్తుకెళ్లి సొమ్ము చేసుకునేవాడు. ఎత్తుకెళ్లిన ఫోన్లను ఆ వెంటనే స్విచాఫ్ చేసేవాడు. హాస్టల్‌ వద్ద సీసీ కెమెరాలు ఉన్నట్లు గురించి పథకం ప్రకారం వాటిని పక్కకు జరిపాడు.

దొంగతనాలు చేసే సమయంలో తన కదలికలు అందులో రికార్డవకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు. ఇటీవల తను చోరీ చేసిన మొబైల్ ఫోన్స్ లో ఒకదానిని కిరణ్ రెడ్డి స్విచ్ఛాన్ చేశాడు. దీంతో అతని సిగ్నల్స్ ఆధారంగా అతను ఉంటున్న ప్రదేశాన్ని పోలీసులు గుర్తించగలిగారు.

నేరుగా అతను ఉంటున్న గదికి వెళ్లి చోరీల చిట్టా బయటపెట్టారు. అతని నుంచి రూ. 1.8లక్షల విలువైన చరవాణులు, ల్యాప్‌టాప్‌లు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. చోరీ చేసిన వాటిల్లో ఒక ఫోన్‌ను సరిగ్గా స్విచ్ఛాఫ్‌ చేయకపోవడం వల్లే దొరికపోయావని నిందితుడు నాలుక కరుచుకున్నాడు.

English summary
Kiran Reddy, A MBA Graduate has been arrested by the Hyderabad police for stealing laptops and mobile phones from a hostel
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X