హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

డ్రంకెన్ డ్రైవ్: పట్టుబడిన యాంకర్ ప్రదీప్, నిబంధనలతో తలనొప్పేనా?

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేందుకు మందు పార్టీలతో యువత మునిగితేలారు. హైద్రాబాద్ నగరంలో ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన డ్రంకెన్ డ్రైవ్‌ కేసుల్లో పెద్ద సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. మద్యం తాగి కారు నడుపుతూ ప్రముఖ టీవీ యాంకర్ ప్రదీప్‌ కూడ దొరికిపోయారు.బ్రీత్ ఎనలైజర్ టెస్ట్‌లో ప్రదీప్ 178 పాయింట్లు నమోదయ్యాయని పోలీసులు తెలిపారు.

పాత సంవత్సరానికి వీడ్కోలు చెబుతూ కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేందుకు యువత పెద్ద ఎత్తున స్నేహితులు, బంధువులతో పార్టీలు ఏర్పాటు చేసుకొన్నారు. అయితే ఈ వేడుకలను దృష్టిలో ఉంచుకొని పోలీసులు డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించారు.

హైద్రాబాద్ నగరంలోని పలు చోట్ల ఆదివారం అర్ధరాత్రి నుండి పోలీసులు డ్రంకెన్ డ్రైవ్ టెస్ట్‌లు నిర్వహించారు. ఈ టెస్ట్‌ల్లో పలు కేసులు నమోదయ్యాయి. సుమారు 1200 వాహనాలను సీజ్ చేశారు.

డ్రంకెన్ డ్రైవ్ లో పట్టుబడిన టీవీ యాంకర్ ప్రదీప్

డ్రంకెన్ డ్రైవ్ లో పట్టుబడిన టీవీ యాంకర్ ప్రదీప్

ప్రముఖ టీవీ యాంకర్ ప్రదీప్ డ్రంకెన్ డ్రైవ్‌లో సోమవారం తెల్లవారుజామున పట్టుబడ్డారు.బ్రీత్‌ అనలైజర్‌ టెస్టులో టీవీ యాంకర్‌ ప్రదీప్‌ కూడా ఉన్నారు.ఈ టెస్టులో యాంకర్ ప్రదీప్ 178 పాయింట్లు నమోదయ్యాయని పోలీసులు తెలిపారు. అయితే మారిన నిబంధనల ప్రకారంగా ప్రదీప్‌కు ఈ కేసులో శిక్షలు పడే అవకాశం ఉందని పోలీసులు అభిప్రాయపడుతున్నారు.

నిబంధనలు ఇవే

నిబంధనలు ఇవే

మద్యం మత్తులో వాహనాలు నడిపి ప్రమాదాలకు కారణమౌతున్న కారణంగా నిబంధనలను మార్చేశారు. కఠిన నిబంధనలను తీసుకొచ్చారు హైద్రాబాద్ పోలీసులు.సాధారణంగా మద్యం తాగి వాహనం నడుపుతూ బ్రీత్ ఎనలైజ్ టెస్టులో పట్టుబడితే 35 పాయింట్లు దాటితే జైలు శిక్షతో పాటు , వాహనం సీజ్ చేయాలని నిబంధనలు రూపొందించారు. అయితే ప్రదీప్ బ్రీత్ ఎనలైజర్ టెస్టులో 178 పాయింట్లు రావడంతో పోలీసులు ఎలా వ్యవహరిస్తారోననే ఆసక్తి సర్వత్రా నెలకొంది.

కొత్త సంవత్సరం రోజున వేలాది కేసులు

కొత్త సంవత్సరం రోజున వేలాది కేసులు


మద్యం తాగి వాహనాలు నడపకూడదని పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్నా వాహనచోదకుల్లో మాత్రం మార్పు రాలేదు.కొత్త సంవత్సర వేడుకల్లో మద్యం తాగి వందలాది పట్టుబడ్డారు. నగర వ్యాప్తంగా కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకొని పోలీసులు పెద్ద ఎత్తున డ్రంకెన్ డ్రైవ్ కేసులను నమోదు చేశారు. వేల కేసులు నమోదయ్యాయని పోలీసులు తెలిపారు. 1200 వాహనాలను ఆదివారం అర్ధరాత్రి నుండి సోమవారం తెల్లవారుజాము వరకు సీజ్ చేశారని పోలీసులు తెలిపారు.

కౌన్సిలింగ్ నిర్వహించనున్న పోలీసులు

కౌన్సిలింగ్ నిర్వహించనున్న పోలీసులు

డ్రంకెన్ డ్రైవ్ కేసుల్లో అరెస్టైన వారికి పోలీసులు కౌన్సిలింగ్ నిర్వహించనున్నారు. ఈ కేసులో అరెస్టైన వారి కుటుంబసభ్యుల సమక్షంలో కౌన్సిలింగ్ నిర్వహించనున్నారు. అయితే బ్రీత్ ఎనలైజర్ టెస్టులో ఎక్కువ పాయింట్లు నమోదైతే శిక్షలు కూడ అదే స్థాయిలో ఉండే అవకాశం లేకపోలేదు.

English summary
Anchor Pradeep caught in a drunk and drive checks at Banjara Hills road no 45 conducted by Hyderabad police.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X