వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాధికకు కన్నీటి వీడ్కోలు: కొడుకును చూసి పలువురి కంటతడి.., దర్యాప్తు ముమ్మరం

|
Google Oneindia TeluguNews

Recommended Video

రాధికకు కన్నీటి వీడ్కోలు: కొడుకును చూసి పలువురి కంటతడి..!

హైదరాబాద్: తీవ్రమైన మానసిక ఒత్తిడిలో ఆత్మహత్య చేసుకున్న వీ6 న్యూస్ యాంకర్ రాధిక అంత్యక్రియలు సోమవారం సాయంత్రం జరిగాయి. మృతదేహానికి గాంధీ ఆసుపత్రిలో పోస్టుమార్టమ్ నిర్వహించిన అనంతరం మూసాపేటలోని గూడ్స్‌షెడ్‌ రోడ్డులో ఉన్న సువీలా అపార్ట్‌మెంట్‌కి తీసుకొచ్చారు. అనంతరం ఈఎస్‌ఐ శ్మశానవాటిక వరకు అంతిమయాత్ర నిర్వహించి.. అక్కడే అంత్యక్రియలు పూర్తిచేశారు. ఆమె అంతిమయాత్రలో జర్నలిస్టులు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

వి6 న్యూస్ రీడర్ రాధిక ఆత్మహత్య: అపార్ట్‌మెంటు పైనుంచి దూకి బలవన్మరణం.. వి6 న్యూస్ రీడర్ రాధిక ఆత్మహత్య: అపార్ట్‌మెంటు పైనుంచి దూకి బలవన్మరణం..

అల్లం నారాయణ సంతాపం..:

అల్లం నారాయణ సంతాపం..:

అంత్యక్రియలకు హాజరైన తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ.. రాధిక మరణంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జీవితంలో ప్రతి ఒక్కరికీ సమస్యలుంటాయని, అంతమాత్రాన ఆత్మహత్య చేసుకోవడం సరికాదని ఆయన అన్నారు.

నటి, యాంకర్ ఝాన్సీ మాట్లాడుతూ.. రాధిక కుమారుడు బుద్ది మాంద్యంతో బాధపడుతున్నాడని, తల్లి లేని ఆ పిల్లవాడిని చూసుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు మనందరి పైనా ఉందని గుర్తుచేశారు.

కంటతడి పెట్టించింది..:

కంటతడి పెట్టించింది..:


యాంకర్ సత్తితో పాటు, టీయూడబ్ల్యూ రాష్ట్ర నేతలు పి.రవికుమార్‌, క్రాంతికుమార్‌, ఎ.మారుతీసాగర్‌, ఆర్‌.కె.దయాసాగర్‌ తదితరులు అంత్యక్రియల్లో పాల్గొని నివాళులర్పించారు.

ఓవైపు తల్లి అంత్యక్రియలు జరుగుతున్నా.. బుద్దిమాంద్యం ఉన్న ఆమె కొడుక్కి అదేమి అర్థం కాక అటూ ఇటూ అమాయకంగా తిరుగుతుండటం పలువురిని కంటతడి పెట్టించింది.

దర్యాప్తు ముమ్మరం:

దర్యాప్తు ముమ్మరం:

యాంకర్ రాధిక ఆత్మహత్య కేసులో కూకట్‌పల్లి పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. కుటుంబ సభ్యులెవరూ ఆత్మహత్యపై ఫిర్యాదు చేయకపోవడంతో.. సూసైడ్‌ నోట్‌ ఆధారంగానే పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

వ్యక్తిగత కారణాలే ఆత్మహత్యకు పురిగొల్పాయా?.. లేక మరేమైనా కారణాలున్నాయా? అన్న అంశంపై దృష్టి సారించారు. ఇందుకోసం రాధిక కాల్ డేటాను పరిశీలించనున్నారు. నెల రోజులుగా ఆమె ఎవరెవరితో మాట్లాడిందనే కాల్ డేటాను సేకరించనున్నారు. రాధిక ఇంటి చుట్టుపక్కల వాళ్లను, తోటి ఉద్యోగులను కూడా వివరాలు అడిగి తెలుసుకోనున్నారు.

తొలుత గుర్తించలేదు..:

తొలుత గుర్తించలేదు..:

14ఏళ్ల కొడుకు బుద్ది మాంద్యంతో బాధపడుతుండటం.. భర్తతో విడాకులు పొందడం ఆమెను తీవ్ర మానసిక ఒత్తిడిలోకి నెట్టివేసి ఉంటాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొద్దిరోజులుగా ఆమె ముభావంగా ఉంటోందని తోటి ఉద్యోగులు సైతం చెప్పినట్టు తెలుస్తోంది.

ఆదివారం రాత్రి ఆఫీసు నుంచి తిరిగి వచ్చిన కొద్దిసేపటికే.. 10.40గం. సమయంలో సువీలా అపార్ట్ మెంట్ ఐదో అంతస్తు నుంచి దూకి ఆమె ఆత్మహత్య చేసుకుంది. ముఖం ఛిద్రం కావడంతో.. వాచ్‌మెన్ ఆమెను గుర్తించలేకపోయాడు. ఆ తర్వాత రాధిక సోదరి కిందకు వచ్చి ఆమెను గుర్తించింది.

English summary
The last rites of the deceased was performed in Hyderabad on Monday. Family members, friends and colleagues from the media fraternity paid their last respects to the news anchor at ESI cemetery where her body was cremated.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X