వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ తో కేసీఆర్ కయ్యం.. కేటీఆర్ దోస్తీ - మందికి మస్కా - ఏందీ డ్రామాలంటూ రేవంత్ రెడ్డి ఫైర్

|
Google Oneindia TeluguNews

పిలిచి పీటేసి మరీ అన్నం పెడితే.. కెలికి కయ్యాలు పెట్టుకుంటున్నాడంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను ఉద్దేశించి తెలంగాణ సీఎం సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు రచ్చ రేపుతున్నాయి. జల వివాదాలకు సంబంధించి త్వరలో జరగబోయే అపెక్స్ కౌన్సిల్ భేటీలో ఏపీ నోరు మూయించేందుకు సిద్ధంగా ఉన్నామన్న కేసీఆర్ కు జగన్ సైతం కౌంటర్లు సిద్ధం చేస్తున్నారు. అయితే కేసీర్ ప్రయత్నంలో ఇంచు కూడా నిజాయితీ లేదని, జగన్ తో కలిసి డ్రామాలాడుతున్నారని ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీ విమర్శిస్తున్నాయి. ఈ క్రమంలోనే కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి కేసీఆర్ ఫ్యామిలీకి సూటి ప్రశ్నలు సంధించారు.

 కరోనా బిగ్ న్యూస్: వ్యాక్సిన్ వచ్చేసింది - రష్యా రికార్డు - పుతిన్ కూతురికి మొదటి డోసు.. కరోనా బిగ్ న్యూస్: వ్యాక్సిన్ వచ్చేసింది - రష్యా రికార్డు - పుతిన్ కూతురికి మొదటి డోసు..

రాబోయే కాలంలో తెలంగాణను ఎడారిగా మార్చేసేలా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతోన్న అక్రమ ప్రాజెక్టులకు కేసీఆర్ ఫ్యామిలీ పరోక్ష సహకారం అందిస్తున్నదని, పైకి మాత్రం మరోలా మాట్లాడుతున్నారని, ఏపీ సీఎం వైఎస్ జగన్ తో సంబంధాల విషయంలో సీఎం కేసీఆర్ ఒకలా, మంత్రి కేటీఆర్ మరోలా ప్రకటనలు చేస్తుండటమే ఇదుకు నిదర్శనమని రేవంత్ అన్నారు.

andhra - telangana water disputes: congress mp revanth reddy slams cm kcr and min ktr

రెండ్రోజుల కిందట ట్విటర్ వేదికగా ప్రజలతో సంభాషించిన తెలంగాణ మంత్రి కేటీఆర్ తనకు ఏపీ సీఎం జగన్ తో మంచి రిలేషన్స్ ఉన్నాయని చెప్పుకొచ్చారు. అయితే, దోస్తానా ఉన్నాగానీ, నీటి వాటాల విషయంలో రాజీపడబోమని చెప్పారు. సోమవారం ప్రగతి భవన్ లో సాగునీటి ప్రాజెక్టులపై రివ్యూ చేసిన సీఎం కేసీఆర్.. ఏపీ సీఎంను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్ దాదాపు ద్రోహం చేశారన్నస్థాయిలో తిట్టిపోశారు. ఈ ఇద్దరి వ్యాఖ్యలపై రేవంత్ సెటైర్లు వేశారు. ''ఏందీ డ్రామాలు! అయ్య కయ్యం అంటాడు... కొడుకు దోస్తులమంటాడు... మందికి మస్కాకొట్టడంలో ఆరితేరారు'' అని ఎంపీ ఫైరయ్యారు.

రాజధానిపై ట్విస్ట్: అమరావతి ముహుర్తానికే విశాఖలో శంకుస్థాపన - మోదీ కోసం జగన్ గజయత్నం - అంతలోనే..రాజధానిపై ట్విస్ట్: అమరావతి ముహుర్తానికే విశాఖలో శంకుస్థాపన - మోదీ కోసం జగన్ గజయత్నం - అంతలోనే..

andhra - telangana water disputes: congress mp revanth reddy slams cm kcr and min ktr

ఏపీ అక్రమ ప్రాజెక్టులపై తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి విడిగా ఓ లేఖను సీఎం కేసీఆర్ కు రాశారు. ఏపీ అక్రమాలకు టీఆర్ఎస్ సర్కారు వత్తాసు పలుకుతున్నట్లుగా ఉందని ఆరోపించారు. నారాయణపేట్-కొడంగల్‌ ఎత్తిపోతల పథకాన్ని ఎందుకు తొక్కి పెట్టారని రేవంత్‌ ప్రశ్నించారు.

andhra - telangana water disputes: congress mp revanth reddy slams cm kcr and min ktr

లక్షా ఏడు వేల ఎకరాలకు సాగునీరు రాకుండా చేసిన పాపం సీఎందేనని, పాలమూరు-రంగారెడ్డి పథకం సామర్థ్యం ఒక టీఎంసీ తగ్గించారని లేఖలో పేర్కొన్నారు. ఏపీ చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకంపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ లో పస లేదని, తెలంగాణ ప్రాజెక్టుల్లో వైసీపీ కీలక నేతలకు కాంట్రాక్టులు అప్పగించారని రేవంత్ ఆరోపించారు

English summary
telangana congress mp revanth reddy criticizes cm kcr and minister krt over andhra - telangana water disputes. revanth alleges that both kcr and ktr making duel comments on relations with andhra pradesh cm jagan
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X