వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సైకో శ్రీనివాస్ రెడ్డి గాడి లవ్ స్టోరీ..!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: ఉన్మాది శ్రీనివాస్ ను విచారిస్తున్న పోలీసులకు ఊహించని ట్విస్టులు ఎదురవుతున్నాయి. ముగ్గురు బాలికలపై అత్యాచారం చేసి ఆపై హత్య చేసిన సైకో శ్రీనివాస్‌రెడ్డి దారుణాలపై ఆరా తీస్తున్న పోలీసులకు అతడిలోని మరో కోణం గురించి తెలిసి ఆశ్చర్యపోతున్నారు. అమ్మాయిలతో పరిచయాలు పెంచుకుని ఆపై అత్యాచారానికి పాల్పడి గొంతు నులిమి చంపేసే ఈ కిరాతకుడిలో ప్రేమ కోణం కూడా ఉన్నట్టు తెలిసింది.

దాదాపు ఏడాదిన్నర కాలంగా వేములవాడకు చెందిన ఓ యువతితో ప్రేమలో ఉన్నట్టు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. అమ్మాయి కనిపిస్తే దారుణానికి ఒడిగట్టే శ్రీనివాస్‌రెడ్డి ఈ యువతి విషయంలో మాత్రం అటువంటి నిర్ణయం తీసుకోకపోవడం పోలీసులను సైతం ఆశ్చర్యపరుస్తోంది.

another angle in psycho srinivas.! he is in love..!!

దాదాపు ఏడాదిన్నరగా పరిచయం ఉన్న ఓ యువతి విషయంలో మాత్రం ఎంతో సంయమనం పాటించాడు. దారుణ హత్యోదంతాల కేసుల దర్యాప్తు క్రమంలో రాచకొండ పోలీసులు ఆ అమ్మాయితో శ్రీనివాస్‌రెడ్డి నెరిపిన వ్యవహారం గురించి ఆరా తీశారు. అతని ఫేస్‌బుక్‌ ఖాతాలో ఆ అమ్మాయితో కలిసి తీసుకున్న చిత్రాలు కనిపించాయి. ఆమెతో ఉన్న సంబంధం గురించి శ్రీనివాస్‌రెడ్డిని విచారించారు. ఆమెను సిరిసిల్ల జిల్లా వేములవాడకు చెందిన యువతిగా గుర్తించారు.

వేములవాడ దేవస్థానానికి వెళ్లిన క్రమంలో ఆ యువతితో తనకు పరిచయం ఏర్పడినట్లు శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించాడు. తాను ఆమెను ప్రేమిస్తున్నానని.. పెళ్లి చేసుకునే ఆలోచనతో ఉన్నట్లు పోలీసుల దర్యాప్తులో చెప్పాడు. ఆమెతో బుద్ధిగానే వ్యవహరించానని శ్రీనివాస్‌రెడ్డి చెప్పాడని దర్యాప్తు బృందంలోని ఓ పోలీస్‌ అధికారి తెలిపారు.

English summary
Unexpected twists are coming to the police who are investigating psyco Srinivas. The police who are raped and tortured by three girls and then kill Psycho Srinivas Reddy are aware of the other aspect of his assertion.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X