• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కూల్చివేతలపై కేసీఆర్ కు బిగ్ షాక్ ... ఈ సారి ప్రతిపక్ష పార్టీల నుండి కాదు నిజాం వారసుల నుండి

|
  కేసీఆర్ కు షాక్ ఇచ్చిన నిజాం వారసులు || Big Break For KCR To Construct Assembly And Secretariat

  తెలంగాణా సీఎం కేసీఆర్ కు షాక్ తగిలింది. అయితే ఈ షాక్ ప్రతిపక్షపార్టీల నుండి కాదు . కొత్త సచివాలయం, కొత్త అసెంబ్లీ భవనాన్ని నిర్మించటం కోసం ఎర్రమంజిల్ భవనాన్ని కూల్చి వెయ్యాలని ఆలోచించిన కేసీఆర్ కు షాక్ ఇచ్చారు నిజాం వారసులు .

  ఎర్రమంజిల్ ప్యాలెస్‌ను కూల్చివేయొద్దని పిటీషన్ దాఖలు చేసిన నిజాం వారసులు

  ఎర్రమంజిల్ ప్యాలెస్‌ను కూల్చివేయొద్దని పిటీషన్ దాఖలు చేసిన నిజాం వారసులు

  కొత్త అసెంబ్లీ, సచివాలయాన్ని నిర్మించటం కోసం ఎర్రమంజిల్ ప్యాలెస్‌ను పడగొట్టడం గురించి ఆలోచించినప్పటి నుండి తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అడ్డంకులను ఎదుర్కొంటున్నారు . టిఆర్ఎస్ ప్రభుత్వ ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా ఏడు పిటిషన్లు ఇప్పటివరకు హైకోర్టులో దాఖలు అయ్యాయి .తాజాగా నిజాం వారసులు కూడా పిటీషన్ వేశారు .ఎర్రమంజిల్‌లోని పురాతన భవనం కూల్చివేతపై నిజాం వారసులు కోర్టుకెక్కారు. 12 ఎకరాలకు సంబంధించి తమకు పరిహారం రావాల్సి ఉందని అది ఇచ్చే వరకు కూల్చివేతలు చేపట్టవద్దని ఆదేశాలు ఇవ్వాలని వారు న్యాయస్థానాన్ని కోరారు. దీంతో హైకోర్టు తదుపరి విచారణ నేటికి వాయిదా వేసింది. తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు ఎర్రమంజిల్‌లో ఎలాంటి కూల్చివేతలు చేపట్టరాదని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

  ఎర్రమంజిల్‌లోని 12 ఎకరాలకు భూ వివాదం... పరిహారం కేసు కోర్టులో ఉందని పేర్కొన్న నిజాం వారసులు

  ఎర్రమంజిల్‌లోని 12 ఎకరాలకు భూ వివాదం... పరిహారం కేసు కోర్టులో ఉందని పేర్కొన్న నిజాం వారసులు

  వాస్తవానికి 1951లో అప్పటి ప్రభుత్వం ఎర్రమంజిల్‌లోని 12 ఎకరాల భూవివాదానికి సంబంధించిన పరిహారం చెల్లించలేదు. దీంతో నిజాం వారసులు ఉమ్మడి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. అప్పటి నుంచి ఈ కేసు పెండింగ్‌లో ఉంది. గతంలో అనేకసార్లు కోర్టును ఆశ్రయించినా... కేసును మాత్రం వాయిదా పడుతూ వచ్చింది. ప్రస్తుతం ఎర్రమంజిల్‌లో నూతన అసెంబ్లీ భవనం నిర్మించాలని కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయించడంతో నిజాం వారసులు మరోసారి హైకోర్టునాశ్రయించారు. వాస్తవానికి, ఎర్రమంజిల్ ప్యాలెస్ ఉన్న 17 ఎకరాల్లో 12 ఎకరాలపై కోర్టు కేసు ఇంకా పెండింగ్‌లో ఉంది. ఆ 12 ఎకరాలకు తమకు పరిహారం ఇవ్వాలని , అది తేలేవరకు కూల్చివేతను అంగీకరించమని నిజాం వారసులు స్మారక చిహ్నాన్ని కూల్చివేయాలన్న కెసిఆర్ ఆలోచనను విభేదిస్తున్నారు . వారు దానితో హైదరాబాద్ హైకోర్టును ఆశ్రయించారు.అసెంబ్లీ, సెక్రటేరియట్‌లకు అవసరమైన భూముల సమస్య ఇప్పుడు కేసీఆర్ నిర్ణయంతో చాలా దూరం వెళ్ళింది .

  ఎర్రమంజిల్‌లో ఎలాంటి కూల్చివేతలు చేపట్టరాదని కోర్టు ఆదేశం .. నేడు మరోమారు విచారణ

  ఎర్రమంజిల్‌లో ఎలాంటి కూల్చివేతలు చేపట్టరాదని కోర్టు ఆదేశం .. నేడు మరోమారు విచారణ

  ఇక ఎర్రమంజిల్ భవనం విషయంలో ప్రభుత్వం అది పురాతన భవనం కాదని... అది హెరిటేజ్‌ భవనాల జాబితాలో కూడా లేదని పేర్కొంది. దీని కూల్చివేతనిర్ణయం ప్రభుత్వ పాలసీ మ్యాటర్ అని అందులో జోక్యం చేసుకోవద్దని కోరింది . వాదనలు విన్న హైకోర్టు తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు ఎర్రమంజిల్‌లో ఎలాంటి కూల్చివేతలు చేపట్టరాదని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణ నేటికి వాయిదా వేసింది. మరి చూడాలి ఎర్రమంజిల్ కూల్చివేత అంశానికి సంబంధించిన కేసులో ఈ రోజు కోర్టు ఏం చెప్తుందో..

  తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Telangana Chief Minister K Chandrasekhar Rao kept facing hurdles ever since he contemplated on demolishing the Erramanzil Palace for the sake of constructing new Assembly and Secretariat. As many as seven petitions has been moved against this decision of the TRS Government.The latest petition happens to be from none other than the heirs of Nizam. Actually, A Court case is still pending on the 12 acres out of 17 acres where Erramanzil Palace exists. Nizam heirs who claims ownership of those 12 acres aren't okay with KCR's idea of demolition of the monument. They now moved the Hyderabad High Court to save it from destruction.Looks like, KCR is taking the issue of required land for Assembly and Secretariat too far. Day-by-day, More number of people have been joining chorus to the valid argument, 'What's the purpose of demolishing the structures which could last for another three decades'.At some point, The Chief Minister will have to offer a convincing answer to the logical question. Or else, It could create a bad impression about the style of functioning of the government.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more