నిజామాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మాజీ ఎంపీ కేసీఆర్ తనయ కవితకు మరో బిగ్ షాక్ .. స్వగ్రామంలో బీజేపీ విజయం

|
Google Oneindia TeluguNews

మూలిగే నక్క మీద తాటికాయ పడ్డ చందంగా తయారైంది కేసీఆర్ కుమార్తె మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత పరిస్థితి. గులాబీ బాస్ కేసీఆర్ కు మొన్నటికి మొన్న లోక్ సభ ఎన్నికల్లో షాక్ ఇచ్చిన నిజామాబాద్ ఓటర్లు కేసీఆర్ తనయ కల్వకుంట్ల కవితను ఓటమి పాలు చేశారు. అనూహ్యంగా బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ విజయం సాధించారు. ఇక తాజాగా నేడు జరుగుతున్న ఎంపీటీసీ , జెడ్పీటీసీ కౌంటింగ్ లో కవితకు మరోమారు షాక్ ఇచ్చారు.

కవితకు పోతంగల్ లో షాక్ .. ఎంపీటీసీ గా బీజేపే అభ్యర్థి విజయం

కవితకు పోతంగల్ లో షాక్ .. ఎంపీటీసీ గా బీజేపే అభ్యర్థి విజయం

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఫలితాల్లో టీఆర్ఎస్ విజయకేతనం ఎగుర వేస్తోంది. అయితే మాజీ ఎంపీ, సీఎం కేసీఆర్ కుమార్తె స్వగ్రామంలో మాత్రం ఫలితాలు రివర్స్ లో వచ్చాయి. మరోమారు కవితకు చేదు అనుభవం ఎదురైంది. నవీపేట మండలం పోతంగల్‌లో టీఆర్‌ఎస్‌ నుండి బరిలోకి దిగిన ఎంపీటీసీ అభ్యర్థి ఓటమి పాలయ్యారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థిపై బీజేపీ నుండి పోటీ చేసిన కత్రోజి రాజు ఘన విజయం సాధించారు. ఎంపీటీసీ అభ్యర్థి ఓటమి పాలయ్యారు. 96 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఇప్పటికే నిజామాబాద్ లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి పాలైన కవితకు స్వగ్రామంలో టీఆర్ఎస్ ఓటమి పాలవడం మరింత ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్రమంతా గెలుస్తూ తానూ ప్రాతినిధ్యం వహించే చోట, తన సొంత వూర్లో ఓటమి పాలు కావటం చాలా అవమానకర విషయం.

రాష్ట్ర వ్యాప్తంగా ముందంజలో ఉన్న టీఆర్ ఎస్ .. ఈ రోజు తేలనున్న అభ్యర్థుల భవిష్యత్

రాష్ట్ర వ్యాప్తంగా ముందంజలో ఉన్న టీఆర్ ఎస్ .. ఈ రోజు తేలనున్న అభ్యర్థుల భవిష్యత్

తెలంగాణలో పరిషత్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. అన్ని జిల్లాల్లోనూ టీఆర్ఎస్ దూసుకుపోతోంది. చాలా చోట్ల టీఆర్ఎస్ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. ముందుగా ఎంపీటీసీ ఫలితాలు వెల్లడి అవుతున్నాయి. సాయంత్రానికి జడ్పీటీసీ ఫలితాలు వెల్లడికానున్నాయి. తెలంగాణలో తీవ్ర ఉత్కంఠతో ఎదురు చూస్తున్న పరిషత్ ఫలితాల కౌంటింగ్ కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా 123 కౌంటింగ్ కేంద్రాల్లో లెక్కింపు జరుగుతోంది. మంగళవారం సాయంత్రం 5 గంటల వరకు లెక్కింపు కొనసాగనుంది.

రాష్ట్రమంతా గులాబీ హవా అయినా కవితకు షాకిచ్చిన స్థానిక సంస్థల పోరు

రాష్ట్రమంతా గులాబీ హవా అయినా కవితకు షాకిచ్చిన స్థానిక సంస్థల పోరు

మొత్తం 536 స్ట్రాంగ్ రూమ్‌లలో భద్రపరచిన బ్యాలెట్ బాక్స్‌లను నిర్దేశించిన లెక్కింపు కేంద్రాలకు తీసుకువచ్చి ఓట్లను లెక్కిస్తున్నారు. రాష్ట్రంలో మూడు విడతల్లో మొత్తం 5,817 ఎంపీటీసీ స్థానాలు, 538 జడ్జీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ చేయగా.. అందులో 4 జడ్పీటీసీలు, 158 ఎంపీటీసీలు ఏకగ్రీవం కావడంతో.. 534 జడ్సీటీసీలు, 5,659 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ నిర్వహించారు.ఫలితాల అనంతరం ఈ నెల 7వ తేదీన మండల పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులకు,8వ తేదీన జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్, వైఎస్ ఛైర్ పర్సన్ పదవులకు ఎన్నికలు జరపనున్నారు. ఇప్పటి వరకు విడుదలైన ఫలితాల్లో అధికార తెలంగాణ రాష్ట్ర సమితి మెజారిటీ స్ధానాల్లో ఆధిక్యంలో ఉంది. ఫలితాల్లో గులాబీ పార్టీ దూసుకుపోతుంది. కానీ కవితకే స్థానిక సంస్థల పోరు సైతం షాక్ ఇచ్చింది.

<strong></strong>తిరుమలలో వీవీఐపీ దర్శనాలపై షాకింగ్ కామెంట్ చేసిన వెంకయ్య నాయుడు... ఏమన్నారంటేతిరుమలలో వీవీఐపీ దర్శనాలపై షాకింగ్ కామెంట్ చేసిన వెంకయ్య నాయుడు... ఏమన్నారంటే

English summary
Telangana Rashtra Samiti is heading for capturing maximum number of seats in MPTC and ZPTC elections in the state. But, TRS faced another defeat in former Nizamabad MP, CM KCR's daughter Kalvakuntla Kavitha's village. TRS candidate of Potangal of Navipet Mandal lost in the hands of BJP candidate Kathroji Raju. Recently, Kavitha defeated in Lok Sabha elections from Nizamabad constituency and BJP candidate won. Now, the results creating ripples among the TRS party circles.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X