వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అక్బరుద్దిన్ ఓవైసీ‌పై మరోకేసు...కరీంనగర్ వ్యాఖ్యలపై నాంపల్లి కోర్టు ఆదేశం

|
Google Oneindia TeluguNews

ఎమ్‌ఐఎమ్ ఎమ్మెల్యే అక్బరుద్దిన్ ఓవైసీ కరీంనగర్‌లో చేసిన వ్యాఖ్యలపై కేసు నమోదు చేయాలని నాంపల్లి కోర్టు హైదరాబాద్ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే కరీంనగర్‌లో కేసు నమోదు కాగా.. హైదరాబాద్‌లో కూడ అక్భరుద్దిన్ ఓవైసీ చేసిన వ్యాఖ్యలపై కేసును నమోదు చేయాలని హైదరాబాద్‌కు చెందిన న్యాయవాది కరుణ సాగర్ నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం అక్బరుద్దిన్ పై కేసు నమోదు చేయాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.

గత పార్లమెంట్ ఎన్నికల సంధర్భంగా కరీంనగర్ లో నిర్వహించిన సభలో పాల్గోన్న ఎమ్ఐఎమ్ ఎమ్మెల్యే అక్బరుద్దిన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పదిహేను నిమిషాలు పోలీసులు తమను స్వేచ్చగా వదిలిపెడితే హిందువుల అంతు తేలుస్తామని హెచ్చరించారు. దీంతో ఆ వ్యాఖ్యలు రాజకీయా దుమారం తోపాటు, మతాల మధ్య రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారంటూ పలువురు విమర్శించారు. ఈనేపథ్యంలోనే ఆయనపై కేసును నమోదు చేయాలని డిమాండ్ చేశారు.

another case on MLA Akbaruddin Owaisi on Karimnagar comments

దీంతో పోలీసులపై ఒత్తిడి పెరగడంతో రంగంలోకి దిగిన కరీంనగర్ సీపీ కమలహాసన్ రెడ్డి, అక్బురుద్దిన్ చేసిన వ్యాఖ్యలపై ప్రత్యేకంగా కమిటీని నిమమించి, పరీశిలించారు. అనంతరం ఆయన చేసిన వ్యాఖ్యలు రెచ్చగొట్టే విధంగా లేవంటూ కేసు నమోదు చేయకుండా వదిలి వేశారు. అయితే స్థానిక నేతలు స్థానిక కరీంనగర్ కోర్టుకు వెళ్లడంతో కేసు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఇక ఆయన చేసిన వ్యాఖ్యలు మతానికి చెందినవి కావడంతో హైదరాబాద్‌లో కేసు నమోదు చేయాలని న్యాయవాది కోర్టుకు విన్నవించడంతో నాంపల్లి కోర్టు కేసు నమోదుకు అదేశాలు జారీ చేసింది.

English summary
The Nampally Court has directed Hyderabad police to file a case in Hyderabad on the comments made by MLA Akbaruddin Owaisi in Karimnagar.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X