వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టి-కాంగ్రెస్‌కు ఝలక్! టీఆర్ఎస్‌లోకి జంప్ చేయనున్న ఎమ్మెల్యే? హరీష్ రావు మంత్రాంగం ఫలిస్తుందా?

టీటీడీపీ నేత రేవంత్ రెడ్డితోపాటు మరికొంతమంది తెలుగుదేశం నేతలను చేర్చుకుని.. పర్వాలేదు, తెలంగాణలో పుంజుకుంటున్నాం అనే ఉత్సాహంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి షాకిచ్చే విషయమే ఇది.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: టీటీడీపీ నేత రేవంత్ రెడ్డితోపాటు మరికొంతమంది తెలుగుదేశం నేతలను చేర్చుకుని.. పర్వాలేదు, తెలంగాణలో పుంజుకుంటున్నాం అనే ఉత్సాహంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి షాకిచ్చే విషయమే ఇది.

ఎందుకంటే, తెలంగాణలో ఆ పార్టీ నుంచి ఓ ఎమ్మెల్యే త్వరలో టీఆర్ఎస్ లోకి జంప్ చేయబోతున్నట్లు చెప్పుకుంటున్నారు. ఇప్పటికే పలువురు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఆ పార్టీని వీడి అధికార తెలంగాణలో చేరిన సంగతి తెలిసిందే.

ఈసారి జంప్ చేయబోయేది అలంపూర్ ఎమ్మెల్యే సంపత్ కుమార్ అని చెప్పుకుంటున్నారు. సంపత్ ను టీఆర్ఎస్‌లో చేర్చుకునేందుకు మంత్రి హరీష్ రావు మంత్రాంగం నడిపిస్తున్నట్లు తెలుస్తోంది.

Another Congress MLA is going to join in TRS?

ఇప్పటికే సొంత పార్టీ విషయంలో సంపత్ కుమార్ పలుమార్లు తన అసహనాన్ని వ్యక్తం చేశారు. ఇదంతా ఆయన కాంగ్రెస్ ను వీడడానికి సూచనే అని తెలంగాణ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది!

తాజాగా, అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సోమవారం కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్ కుమార్ ను మంత్రి హరీష్ పక్కకు తీసుకెళ్లి దాదాపు ఇరవై నిమిషాలు చర్చలు జరిపారని, ఇదంతా సంపత్ కుమార్ ను టీఆర్ఎస్ లోకి చేర్చుకోవడానికే అని సమాచారం.

సంపత్ కుమార్ కొంతకాలంగా హరీష్ రావుకు టచ్ లో ఉన్నారని, ఇప్పుడు జరుగుతున్నవి అంతిమ చర్చలు మాత్రమేనని, వివిధ భరోసాలు ఇచ్చి ఆయన్ని టీఆర్ఎస్ లోకి లాగే ప్రయత్నాలు ఊపందుకున్నాయని తెలుస్తోంది.

English summary
There are rumors that Congress Leader, Alampur MLA Sampath Kumar is looking to join in TRS very shortly. Minister Harish Rao is discussing with Sampath Kumar it seems. If it is happened, it will be a shock to T-Congress as the Congress leaders are in a happy mood after joining of Revanth Reddy and other leaders from TTDP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X