• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

విద్యార్థి సంఘం ఎన్నికల కోసం ఆదివాసి విద్యార్థిపై వివక్ష.. నిరసనగా నేటి నుంచి నిరవధిక దీక్ష

By Swetha Basvababu
|

హైదరాబాద్‌: దాదాపు రెండేళ్ల క్రితం జాతీయ స్థాయిలో పతాక శీర్షికలకు ఎక్కినా హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్‌సీయూ) యాజమాన్యం తన పొరపాట్లను సరిదిద్దుకున్నట్లు కనిపించడం లేదు. 2016 జనవరి 17న హెచ్‌సీయూ చరిత్రలో ఓ బ్లాక్‌ డే. విశ్వవిద్యాలయాల్లో వివక్ష తీవ్రతను పీహెచ్‌డీ విద్యార్థి రోహిత్‌ వేముల మరణం ఎలుగెత్తి చాటిన రోజది. రోహిత్‌ ఆత్మహత్యకు దాదాపు రెండేళ్లు నిండబోతున్నాయి. ఇప్పుడు మరోసారి వివక్షకు నిరసనగా హెచ్‌సీయూలో వెలివాడ వెలిసింది. కుట్ర పూరిత వైఖరిని, అణచివేతను ధిక్కరిస్తూ అగ్గి రాజుకున్నది.

  Telangana Art Teachers Protest Against Unemployment | Oneindia Telugu

  అప్పుడు దళిత విద్యార్థిని బలిగొన్న వివక్ష ఇప్పుడు ఆదివాసి విద్యార్థులపై కక్ష సాధింపునకు దారి తీసింది. 75 శాతం హాజరు లేదన్న కారణంగా విద్యార్థి సంఘ ఎన్నికల్లో 264 ఓట్ల మెజారిటీతో ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన ఆదివాసీ విద్యార్థి లునావత్‌ నరేశ్‌ గెలుపుని ప్రకటించకపోవడం యూనివర్సిటీలో ఆందోళనలకు దారితీసింది. హాజరుపట్టికలో హాజర్లను ఆబ్సెంట్‌గా తారుమారు చేసి నరేశ్‌ గెలుపుని ఓడించాలన్న ఆత్రుతలో వర్సిటీ తప్పులపై తప్పులు చేస్తూ పోయింది. హెచ్ సీయూ వైస్‌చాన్స్‌లర్ అప్పారావు ఏబీవీపీతో కుమ్మౖక్కై ఉపాధ్యక్షుడిగా గెలుపొందిన నరేశ్‌ని అడ్డుకోవడానికి గ్రీవెన్స్‌ సెల్‌ని పావుగా వాడుకున్నారని ఆరోపిస్తూ ట్రైబల్‌ స్టూడెంట్స్‌ ఫెడరేషన్‌ ఆందోళనకు దిగింది.

  రెండు రోజులుగా నిరాహార దీక్ష..

  నిజానికి విద్యార్థి సంఘ ఎన్నికల్లో పోటీ చేయడానికి సరిపడా అంటే 75 శాతం హాజరుతోనే లునావత్‌ నరేష్‌ పోటీకి అర్హత సాధించారు. కానీ ఎటువంటి ఆధారాలు లేకుండా ఏబీవీపీ అధ్యక్షుడు ఇచ్చిన ఫిర్యాదుని పరిగణనలోకి తీసుకుని, తారుమారు చేసిన హాజరుపట్టికను చూపి నరేష్‌ ఎన్నిక చెల్లదని, మళ్లీ ఎన్నికలు నిర్వహిస్తామని యాజమాన్యం ప్రకటించడంతో విద్యార్థులు తిరగబడ్డారు. ఎన్నికలు జరిగిన తర్వాత అటెండెన్స్‌ రిజిస్టర్‌లో ప్రెజెంట్‌ని ఆబ్సెంట్‌గా మార్చారని, 75 శాతం హాజరున్నదంటూ డిపార్ట్‌మెంట్‌ స్వయంగా ముద్రవేసి ఇచ్చిన సర్టిఫికెట్‌ని బుట్టదాఖలు చేసి గ్రీవెన్స్‌ సెల్, వీసీ అప్పారావు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆందోళనకు దిగారు. హాజరుపట్టిక తారుమారు చేశారనడానికి స్పష్టమైన ఆధారాలతో ట్రైబల్‌ స్టూడెంట్స్‌ ఫెడరేషన్‌ ఎన్ని ఆందోళనలు చేసినా ఫలితం లేకపోవడంతో రెండు రోజులుగా వెలివాడలో నిరాహార దీక్షకు ఉపక్రమించింది. వర్సిటీ నుంచి స్పందన లేకపోవడంతో ఆల్‌ స్టూడెంట్‌ యూనియన్స్‌తో సమావేశమై గురువారం నుంచి నిరవధిక నిరాహార దీక్షకు ట్రైబల్‌ స్టూడెంట్స్‌ ఫెడరేషన్‌ సిద్ధమవుతోంది.

  Another Discrimination in HCH: Students to go indefinate Hunger strike from Today

  గిరిజనుడినైనందునే వివక్ష

  మొత్తం ప్యానల్‌లో తానొక్కడినే గిరిజనుడినని ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన లునావత్ నరేశ్ చెప్పారు. అందుకే ఈ వివక్ష కొనసాగుతున్నదన్నారు. అటెండెన్స్‌ రిజిస్టర్‌లో తాను ప్రెజెంట్‌ అయిన చోట ఆబ్సెంట్‌ అని దిద్ది, కొన్ని చోట్ల డేట్స్‌ లేకుండా అటెండెన్స్‌ వేశారు. యాజమాన్యం తన పట్ల కక్షపూరితంగా వ్యవహరించినట్టు స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి. ముందు 75 శాతం హాజరు ఉన్నట్టుగా డిపార్ట్‌మెంట్‌ సర్టిఫికెట్‌ ఇచ్చి ఆ తర్వాత 64 శాతం ఉందని ఒకసారి, 71 శాతం ఉందని మరోసారి రిపోర్ట్‌ ఇవ్వడాన్నిబట్టే నిజాన్ని అబద్ధంగా మార్చేందుకు ఎలాంటి ప్రయత్నం జరిగిందో అర్థం చేసుకోవచ్చునన్నారు. యాజమాన్యానికి అనుకూలంగా ఉంటే ఎన్నేళ్లైనా డీన్‌గా ఉండొచ్చునని, నిజానికి ప్రతి నాలుగేళ్లకీ డీన్స్‌ మారతారన్నారు. మెడికల్‌ సైన్స్‌ డిపార్ట్‌మెంట్‌ ప్రారంభించినప్పటి నుంచి సుదీర్ఘకాలంగా గీతా వేముగంటి డీన్‌గా కొనసాగుతున్నారు. రోహిత్‌తోపాటు ఐదుగురు విద్యార్థుల బహిష్కరణకు సూత్రధారి గీతా వేముగంటి. ఇప్పుడు తన విషయంలోనూ ఆమె తప్పుడు ఇచ్చారని ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన లునావత్‌ నరేశ్ ఆరోపించారు.

  హాజరు పట్టిలో కుట్రపూరితంగా గోల్‌మాల్‌

  ఇదంతా ఏబీవీపీని కాపాడాలనే కుట్రలో భాగమేనని ట్రైబల్‌ స్టూడెంట్స్‌ ఫెడరేషన్‌ అధ్యక్షుడు సుందర్‌ రాథోడ్ ఆరోపించారు, వీసీ అప్పారావు, గ్రీవెన్స్‌ సెల్‌ కుమ్మక్కై ఆడుతున్న నాటకం ఇదని స్పష్టం చేశారు. రీఎలక్షన్స్‌కి నోటిఫికేషన్‌ ఇచ్చిన దగ్గర నుంచి తాము అనేక ఆందోళనలు చేసినా యాజమాన్యంలో స్పందన లేదు. వాళ్ల తప్పుల్ని కప్పిపుచ్చుకునేందుకు హాజరు శాతాన్ని నిర్థారించేందుకు కమిటీ వేస్తున్నామన్నారు. ఏబీవీపీతో కుమ్మక్కై అటెండెన్స్‌లో గోల్‌మాల్‌ చేసి సమస్యను తాత్సారం చేస్తున్నందునే నిరవధిక నిరాహార దీక్షను చేపడుతున్నామని తెలిపారు. ఉపాధ్యక్షుడిగా లునావత్‌ నరేష్‌ ఏబీవీపీ అభ్యర్థి అపూర్వ్‌పై గెలిచాడు. అతని ఎన్నిక చెల్లదని ఫిర్యాదు చేసింది ఏబీవీపీ. ఏ ఆధారంలేకుండా చేసిన ఈ ఆరోపణలను నిజం చేసేందుకు వీసీతో కలసి గ్రీవెన్స్‌ సెల్‌ కుట్ర పన్నింది. జూలై 16న క్లాసులు మొదలైతే.. ఆగస్టు 8 నుంచి అటెండెన్స్‌ రిజిస్టర్‌ ప్రారంభించారు. అంతకుముందు హాజరైనా పరిగణనలోనికి తీసుకోలేదని సామాజిక న్యాయ ఐక్యపోరాట కమిటీ నాయకుడు ప్రశాంత్ తెలిపారు.

  తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Hyderabad Central University comes again into media because it has exposes with discrimination. ST Student Lunawath Naresh elected as vice president in HCU Student union elections. But ABVP didn't agree with this development and complained to University authorities. There allegations that Vice Chancellor Apparao and varsity greivence cell created troubles to Lunawath Naresh. HCU declared he didn't have 75 % attendance. Hence Varsity has to conduct elections again. Except ABVP other Students unions going to indefinite hunger strike from today.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more