వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హైదరాబాద్‌లో మరో డ్రగ్ బాంబు:పవర్‌ఫుల్ సరుకుతో పట్టుబడ్డ ముఠా..

ఇటీవల పట్టుబడిన డ్రగ్ మాఫియా కంటే ఇప్పుడు పట్టుబడిన వారి వద్ద మరింత పవర్ ఫుల్ డ్రగ్స్ పట్టుబడినట్లు తెలుస్తోంది.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: హైదరాబాద్‌లో మరో డ్రగ్స్ ముఠా గుట్టు రట్టయింది. ప్రముఖులతో పాటు పలువురు కాలేజీ విద్యార్థులకు డ్రగ్స్ సరఫరా చేస్తున్న మరో గ్యాంగ్ ను పోలీసులు పట్టుకున్నారు. ఇటీవల పట్టుబడిన డ్రగ్ మాఫియా కంటే ఇప్పుడు పట్టుబడిన వారి వద్ద మరింత పవర్ ఫుల్ డ్రగ్స్ పట్టుబడినట్లు తెలుస్తోంది.

<strong>డ్రగ్ మాఫియా, దిగ్భ్రాంతికర విషయాలు: న్యూడ్ ఫోటోలతోను, ఇదీ స్కెచ్..</strong>డ్రగ్ మాఫియా, దిగ్భ్రాంతికర విషయాలు: న్యూడ్ ఫోటోలతోను, ఇదీ స్కెచ్..

పంజాగుట్టలోని ఓ ప్రముఖ హోటల్ వద్ద వీరు డ్రగ్స్ విక్రయిస్తున్న క్రమంలో ఎక్సైజ్ పోలీసులకు చిక్కినట్లు సమాచారం. ఆ హోటల్‌కు పక్కనే ఉన్న ఓ అపార్ట్ మెంటులో ఈ ముఠా సభ్యుడు ఒకరు నివాసముంటున్నట్లు గుర్తించారు. హోటల్లో ఉద్యోగిగా పనిచేస్తూనే ఈ డ్రగ్స్ సరఫరా బాగోతం నడుపుతున్నట్లు చెబుతున్నారు.

 another drug racket busted in punjagutta, hyd

హోటల్స్, మాల్స్, స్కూల్స్.. ఇలా చాలా చోట్ల విచ్చలవిడిగా వారు డ్రగ్స్ సప్లై చేస్తున్నట్లు సమాచారం. పక్కా సమాచారంతో వీరిపై దాడి చేసిన పోలీసులు.. భారీ ఎత్తున డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. ఎక్సైజ్ కార్యాలయంలో ప్రస్తుతం వీరిని విచారిస్తున్న పోలీసులు.. ఎవరెవరితో వీరికి సంబంధాలు ఉన్నాయన్న విషయంపై ఆరా తీస్తున్నారు. పట్టుబడిన ఇద్దరిని ఢిల్లీకి చెందినవారిగా గుర్తించినట్లు సమాచారం.

మరోవైపు నిందితుడు ఉంటున్న అపార్ట్‌మెంటు వాసులు దీని పట్ల భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ అపార్ట్ మెంటులోనే ఉంటున్నప్పటికీ.. తమకీ విషయం తెలియదని చెబుతున్నారు. ఎవరి పనుల్లో వారు ఉంటారని, ఇలాంటి విషయాలను గమనించే అవకాశం లేదని అంటున్నారు. దీనిపై ఆదివారం ఉదయం అపార్ట్ మెంటు వాసులతో మీటింగ్ పెట్టి ఒక నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

English summary
The Telangana excise department busted another drug racket at Punjagutta area.Two drug peddlers were arrested
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X