వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉత్తమ్ కుమార్ రెడ్డి ముందుంది మరో ఎన్నికల సవాల్

|
Google Oneindia TeluguNews

తెలంగాణా రాష్ట్రంలో మొత్తం లోక్‌సభ స్థానాలను క్లీన్ స్వీప్ చేయబోతున్నామని, సంబరాలకు పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు తెలంగాణా ప్రజలు షాక్ ఇచ్చారు. లోక్ సభ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ కి మూడుస్థానాలు, బీజేపీకి నాలుగు స్థానాలు కట్టబెట్టారు. అనూహ్యంగా కాంగ్రెస్ నుండి బరిలోకి దిగిన ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంపీగా విజయం సాధించటం ఉత్తమ్ కు పెద్ద సవాల్ గా మారింది.

యోగా చేసినంత ఈజీ కాదు... రాజ్యాంగాన్ని మార్చడం... ఎంపీ అసదుద్దిన్ ఓవైసీయోగా చేసినంత ఈజీ కాదు... రాజ్యాంగాన్ని మార్చడం... ఎంపీ అసదుద్దిన్ ఓవైసీ

టీఆర్ ఎస్ కు ఊహించని షాక్ .. నల్గొండ లో ఎంపీగా ఉత్తమ్ విజయం

టీఆర్ ఎస్ కు ఊహించని షాక్ .. నల్గొండ లో ఎంపీగా ఉత్తమ్ విజయం

తెలంగాణాలో లోక్ సభ ఎన్నికల సమయంలో కూడా కాంగ్రెస్ పార్టీని చావుదెబ్బ కొట్టి పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించి పార్టీలో గందరగోళం సృష్టించారు కేసీఆర్ . అయినా సరే ఎన్నికల బరిలోకి దిగిన కాంగ్రెస్ నాయకులు ఈసారి ఎలాగైనా లోక్ సభ ఎన్నికల్లో పట్టు సాధించాలని చాలా కష్టపడ్డారు. నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గంపైనా కాంగ్రెస్ జెండా ఎగురవేశారు . నల్గొండ నుండి ఎన్నికల బరిలో నిలిచినా ఉత్తమ్ కుమార్ రెడ్డి గెలుపొందారు. సమీప ప్రత్యర్థి, టీఆర్ఎస్ అభ్యర్థి వేంరెడ్డి నర్సింహారెడ్డిపై 23 వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. దీంతో ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి అసలు టాస్క్ మొదలైంది.

నల్గొండలో ఉత్తమ్ భార్య పద్మావతి పోటీ చేసే అవకాశం .. ఉపఎన్నికల బాధ్యత ఉత్తమ్ దే

నల్గొండలో ఉత్తమ్ భార్య పద్మావతి పోటీ చేసే అవకాశం .. ఉపఎన్నికల బాధ్యత ఉత్తమ్ దే

ఉత్తమ్ కుమార్ నల్లగొండ నుండి ఎంపీగా గెలవడంతో, తాను ఎమ్మెల్యేగా ఎన్నికలైన హుజుర్ నగర్ నియోజక వర్గ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. కాగా ఇప్పుడు అక్కడ కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించుకోవడం అంత సాధారణం కాదు. కానీ కేవలం రాహుల్ గాంధీ చెప్పడం వలన ఉత్తమ్ కుమార్ ఎంపీగా పోటీ చేయాల్సి వచ్చింది. ప్రజలు కాంగ్రెస్ కి ఓటేసి మరీ ఉత్తమ్ ని గెలిపించారు. ఇప్పుడు అక్కడ ఉప ఎన్నికలు రావడం ఖాయమే. అయితే ఆ స్థానంలో ఉత్తమ్ కుమార్ భార్య కి టికెట్ వచ్చే అవకాశం ఉందని అందరు భావిస్తున్నారు .

నల్గొండ స్థానంలో ఉప ఎన్నిక ఉత్తమ్ కు సవాలే ...

నల్గొండ స్థానంలో ఉప ఎన్నిక ఉత్తమ్ కు సవాలే ...

ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఉత్తమ్ భార్య కోదాడ నుండి పోటీ చేసి అతి తక్కువ తేడాతో ఓడిపోయారు. అయితే ఉత్తమ్ ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తే హుజూర్ నగర్ లో ఇపుడు తనకి మరొక సారి ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం వచ్చింది. కానీ అక్కడ బలమైన టీఆర్ఎస్ నాయకుడు కనుక పోటీకి దిగితే ప్రత్యర్ధులు ఎవరు కూడా గెలవలేరని తెలుస్తుంది. అయితే అక్కడ సైదిరెడ్డి అనే ప్రత్యర్థి చేతిలో కేవలం మూడువేల ఓట్ల తేడాతో మాత్రమే ఉత్తమ్ కుమార్ గెలుపొందారు. కాగా ఇప్పుడు అక్కడ సైదిరెడ్డి మళ్ళీ నిల్చుంటే తన గెలుపు ఖాయమని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక దీంతో ఉత్తమ్ తన భార్య ని గెలిపించుకోవడం అనేది ఉత్తమ్ కి ఒక సవాల్ లాగా మారిందని అందరు భావిస్తున్నారు.

English summary
As Uttam Kumar was elected as an MP from Nalgonda, he was forced to resign as MLA elected from Huzur Nagar constituency . Now it is not that easy for Congress candidate to win. Now there is a by-election. But it is expected that Uttam Kumar 's wife will have a ticket to replace him .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X