హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హైదరాబాద్ లో మరో గ్యాంగ్ వార్..! పోలీసుల ముందే వీరంగం..! ఆందోళనలో స్థానికులు..!!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : ప్రశాంతంగా ఉండే హైదరాబాద్ నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. రౌడియిజం, గూండాయిజం తోపాటు దౌర్జన్యాలను, గ్రూపు తగాదాలను ఉక్కుపాదంతో అణచివేసిన నగర పోలీసులకు మళ్లి సవాల్ విసురుతున్నరు వీధి రౌడీలు. శాంతి బద్రతలకు ఢోకా లేదనుకుంటున్న తరుణంలో ఆదిపత్యం కోసం ఇలాంటి ముఠాలు అక్కడక్కడ ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తున్నాయి. అదికారుల అండ చూసుకునో, రాజకీయం బలం చూసుకునో డబ్బు మదం తలకెక్కో మళ్లీ ఇలాంటి వీధి రౌడీలు పోలీసుల ఎదుట వీరంగం చేసేందుకు సాహసిస్తున్నారు.

 అర్థరాత్రి పోలీసుల సమక్షంలో రెచ్చిపోయిన టీఆర్ఎస్ నేత..! మళ్లీ మొదలైన గ్యాంగ్ వార్..!!

అర్థరాత్రి పోలీసుల సమక్షంలో రెచ్చిపోయిన టీఆర్ఎస్ నేత..! మళ్లీ మొదలైన గ్యాంగ్ వార్..!!

అదికార పార్టీ అండ చూసుకుని కొంత మంది నాయకుల అనుచరులు నడి రోడ్ల పై వీరంగం స్రుష్టిస్తున్న సందర్బాలు ఇటీవల తరుచుగా జరుగుతున్నాయి. పోలీసులు ఉదాసీనంగా వ్యవహరించడంతో ఈ గ్యాంగులు మరింత రెచ్చిపోతున్నాయి. భిన్నత్వంలో ఏకత్వం చాటే హైదరాబాద్ సగర సంత్క్రుతికి ఇలాంటి చిల్లర గ్యాంగుల వల్ల సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయనే అభిప్రాయలు కూడా వినిపిస్తున్నాయి. ఇలాగే పబ్లిక్ న్యూసెన్స్ చేసిన రౌడీలను నగర బహిష్కర చేసిన సందర్బాలు కూడా లేకపోలేదు. ఇంతకీ ఇలాంటి సంఘటనలు ఎక్కడ పునరావ్రుతం అయ్యాయి. తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

 అర్థరాత్రి అదికార పార్టీ నేత రౌడీయిజం..! నడిరోడ్డుపై గూండాయిజం..!!

అర్థరాత్రి అదికార పార్టీ నేత రౌడీయిజం..! నడిరోడ్డుపై గూండాయిజం..!!

అర్థరాత్రి టీఆర్ఎస్ నేత తన అనుచరులతో పోలీసుల సమక్షంలోనే రెచ్చిపోయాడు. జూబ్లీహిల్స్ రహమత్‌నగర్‌కు చెందిన టీఆర్ఎస్ లీడర్ అరుణ్ కుమార్‌కు.. కొందరు యువకులకు మధ్య నెలకొన్న మాటల యుద్ధం కాస్తా ప్రత్యక్ష దాడులకు కారణమైంది. నమస్తే పెట్టనందుకు తనపై టీఆర్ఎస్ లీడర్ అరుణ్ కక్ష పెంచుకున్నాడని మనోజ్ అనే యువకుడు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.

 శాంతిభాద్రతలకు విఘాతం..! పోలీసుల ముందే రెచ్చిపోయిన వైనం..!!

శాంతిభాద్రతలకు విఘాతం..! పోలీసుల ముందే రెచ్చిపోయిన వైనం..!!

ఈ నేపథ్యంలోనే అరుణ్ తన గ్యాంగ్‌తో కలిసి తనపై దాడికి పాల్పడ్డారని మనోజ్ ఫిర్యాదులో పేర్కొన్నాడు. పోలీసుల సమక్షంలోనే లీడర్‌కి సంబంధించిన వ్యక్తులు రెచ్చిపోయారు. ఈ క్రమంలో జూబ్లీహిల్స్ పోలీసులు చోద్యం చూస్తూ ఉండిపోయారు. పోలీసుల సమక్షంలోనే బాధిత యువకులను అంతం చేస్తానని అరుణ్ గాంగ్ బెదిరించడం గమనార్హం.

 అర్థరాత్రి హల్ చల్..! తారా స్థాయికి చేరిన గ్రూపు తగాదా..!!

అర్థరాత్రి హల్ చల్..! తారా స్థాయికి చేరిన గ్రూపు తగాదా..!!

జూబ్లీహిల్స్ రహమత్ నగర్ కు చెందిన టిఆర్ఎస్ లీడర్ అరుణ్ కుమార్ తో కొంత మంది యువకుల మధ్య నెలకొన్న గొడవ చినికి చినికి గాలివానలాగా మారింది. మాటల యుద్ధం కాస్త పరస్పర దాడులు చేసుకునేంత వరకూ వెళ్లింది. పోలీసుల ముందే ఇరుపక్షాలు ప్రత్యక్ష దాడులకు ఉపక్రమించారు. దీంతో స్థానికులు భయాందోళనకు గురైనట్టు తెలుస్తోంది.

English summary
Street gangs are trying to make the existence of a place where there is no need for peace. Such street riders are booing to the police, in hyderabad.A late night TRS leader fainted with his followers in police presence. The TRS leader of Jubilee Hills Rahmatnagar has led to a direct attack on Arun Kumar, a war between the words of some youths.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X