వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మరో ఇంటర్ విద్యార్థిని సూసైడ్ : ఊపిరొదిలిన 20కిపైగా మంది ..

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : ఇంటర్ రిజల్ట్స్ మంటలు విద్యాకుసుమలా ఊపిరితీస్తున్నాయి. బోర్డు నిర్లక్ష్యం విద్యార్థుల మరణానికి దారితీస్తోంది. ఫలితాలు రీ వాల్యుయేషన్ చేస్తామని ప్రభుత్వం హామీనిచ్చినా .. అవమానభారంతో పసిమొగ్గలు పిట్టల్లా రాలుతున్నారు. ఇప్పటికే దాదాపు 23 మంది విద్యార్థులు తనువు చాలించగా .. తాజాగా నారాయణపేట్ జిల్లాకు చెందిన ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకొని కన్నవారికి కడుపుకోత మిగిల్చింది.

జువాలజీలో ఫెయిల్ అవడంతో ..
ధన్వాడ మండలం కొండ్రోన్‌పల్లికి చెందిన శిరీష (17) మహబూబ్ నగర్ లోని ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ ఫస్టియర్ పూర్తిచేసింది. ఇటీవల విడుదలైన ఫలితాల్లో జువాలజీ సబ్జెక్టుల్లో ఫెయిల్ అయింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన విద్యార్థిని .. తన ఇంట్లో కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. పై పోర్షన్‌లో గదిలో నిప్పంటించుకొంది .. అయితే మంటలకు తాళలేక పైనుంచి కిందకి దూకింది. ఇంతలో అక్కడికి వెళ్లేలోపు దూకేయడంతో .. అక్కడికక్కడే విద్యార్థిని తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది.

Another inter student suicide

పొలం పనికి వెళ్లగా ..
విద్యార్థిని కిరోసిన్ అంటించుకున్న సమయంలో ఆమె తల్లిదండ్రులు పొలం పనుల్లో ఉన్నారు. వారు వచ్చేలోపే కూతురు విగతజీవిగా మారడంతో గుండెలవిసేలా రోదించారు. వారి రోదనలతో అక్కడున్న వారిని కూడా కంటతడి పెట్టించింది. ఈ ఘటనపై ధన్వాడ పోలీసులు కేసు నమోదు చేశారు.

English summary
Sirisha (17) from Dandwada Mandalam Kondronpalli studied in Inter College at Mahaboobnagar private college. In recent releases results have failed in Zoology subject. The student who was deeply hurt was kerosine in his house.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X