వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మౌనం వీడిన గద్దర్ .. తెలంగాణలో మరో ఉద్యమం అన్న ప్రజా యుద్ధనౌక

|
Google Oneindia TeluguNews

తెలంగాణా ప్రజా యుద్ధ నౌక , ప్రజా గాయకుడు గద్దర్ తెలంగాణలో ప్రస్తుత పరిణామాలపై స్పందించారు. చాన్నాళ్లుగా మౌనం పాటిస్తున్న ఆయన తాజా పరిస్థితులపై గళం విప్పారు. తెలంగాణ జాన‌ప‌దం మీద ప్ర‌జాగాయ‌కుడు గ‌ద్ద‌ర్ ముద్ర చాలా వ‌ర‌కు ఉంటుంది. తెలంగాణా స‌మాజం మీద కూడా గ‌ద్ద‌ర్ గ‌ళం నుండి జాలువారే జానపదాల ప్రభావం తీవ్రంగానే ఉంటుంది. ఆయన గాత్రానికి, గానానికి ప్ర‌జానీకం మైమ‌రిచిపోతుంటారు.

గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాజకీయాలవైపు ఆసక్తి చూపిన గద్దర్ గత ఎన్నికల్లో తనదైన ముద్ర వెయ్యాలని భావించారు. కానీ సాధ్యం కాలేదు . ఇక అప్పటి నుండి మౌనంగా ఉన్న గద్దర్ మానం వీడి తెలంగాణాలో మరో ఉద్యమం మొదలవుతోందని సంచలన వ్యాఖ్య చేశారు .

తెలంగాణ పోలీసులకు ఏమైంది ? మరో సీఐ వైరాగ్యం... అలర్టైన పోలీస్ బాస్!తెలంగాణ పోలీసులకు ఏమైంది ? మరో సీఐ వైరాగ్యం... అలర్టైన పోలీస్ బాస్!

 Another movement in Telangana says Gaddar..Gaddar breaks the silence

సీఎం కేసీఆర్ నిరంకుశ పాలనను ప్రజలు వ్యతిరేకిస్తున్నారని గద్దర్ అభిప్రాయపడ్డారు . నీళ్లు అన్నారు, నియామకాలు అన్నారు ..అవి ఇప్పుడు ఎక్కడున్నాయి? అంటూ ఆయన టీఆర్ ఎస్ పాలనపై మండిపడ్డారు . 16 ఎంపీ సీట్లతో ఏంచేస్తారో చెప్పాలి అంటూ గద్దర్ కేసీఆర్ ను నిలదీశారు. తాజా పరిణామాలు చూస్తుంటే రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని గద్దర్ అభిప్రాయపడ్డారు.

English summary
Gaddar conceded that people are opposed to the KCR government. Water said, the appointments said .. Where are they now? He blamed the TRS regime. Gaddar was asked KCR what would happen with 16 MP seats. Gaddar conceded that the need to protect the constitution in the present situations.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X