వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పురుగులమందు తాగి మరో ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్య .. మహబూబాబాద్ డిపో వద్ద ఉద్రిక్తత

|
Google Oneindia TeluguNews

మహబూబాబాద్ లో మరో ఆర్టీసీ కార్మికుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మరిపెడ మండలం ఎల్లంపేట గ్రామానికి చెందిన ఆవుల నరేష్ అనే ఆర్టీసీ డ్రైవర్ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గత 15 సంవత్సరాలుగా ఆర్టీసీలో డ్రైవర్ గా విధులు నిర్వర్తిస్తున్న నరేష్ ఆర్టీసీ సమస్య పరిష్కారం కాదేమో అన్న మనస్థాపంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కోర్టు ఆర్టీసీ కార్మికుల సమ్మె విషయంలో తీర్పు ఇవ్వకపోవడం, ప్రభుత్వ ఆర్టీసీ కార్మికుల సమస్యలను పట్టించుకోనట్లు ప్రవర్తించడం తో మనస్తాపం చెందిన నరేష్ మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు వదిలాడు.

ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు కీలక నిర్ణయం: కోర్టు పరిధి దాటి ఆదేశాలు ఇవ్వలేము: ఎస్మా పైనా...ఇలా..!ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు కీలక నిర్ణయం: కోర్టు పరిధి దాటి ఆదేశాలు ఇవ్వలేము: ఎస్మా పైనా...ఇలా..!

 హైకోర్టులో తీర్పు రాకపోవటం , ప్రభుత్వం తీరు మారకపోవతంతో కార్మికుల్లో ఆందోళన

హైకోర్టులో తీర్పు రాకపోవటం , ప్రభుత్వం తీరు మారకపోవతంతో కార్మికుల్లో ఆందోళన

ఆర్టీసి సమ్మె నేపద్యంలో ఇప్పటికే పదుల సంఖ్యలో ఆర్టీసీ కార్మికులు ప్రాణాలు వదులుతున్నారు. అయినప్పటికీ ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుగా ప్రవర్తిస్తుంది. ఆర్టీసీ కార్మికుల విషయంలో తీసుకున్న నిర్ణయాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ మార్చుకోమని తేల్చి చెబుతోంది. ఇక హైకోర్టులో ఆర్టీసీ కార్మికులు తమకు న్యాయం జరుగుతుందని ఆశగా ఎదురు చూస్తున్న, కోర్టులో మాత్రం వాయిదాల పర్వం కొనసాగుతోంది. కోర్టు ఆర్టీసీ కార్మికుల విషయంలో ప్రభుత్వ వైఖరిపై చట్టానికి లోబడి మాత్రమే పని చేయగలమని తేల్చి చెబుతోంది.

పురుగులమందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన నరేష్

పురుగులమందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన నరేష్

ఈ నేపథ్యంలో మూడు నెలలుగా జీతాలు లేక, ఉద్యోగం ఉందో లేదో తెలియక ఆర్టీసీ కార్మికులు తీవ్ర ఆవేదనతో ఉన్నారు. ఇక ఆర్టీసీ కార్మిక కుటుంబాలు దయనీయమైన పరిస్థితుల్లో ఉన్నట్టు తెలుస్తుంది. ఈ పరిస్థితుల్లోనే ఆర్టీసీ డ్రైవర్ నరేష్ ఆత్మహత్యకు పాల్పడినట్లుగా తెలుస్తుంది. డ్రైవర్ నరేష్ మరణంతో ఇక మహబూబాబాద్ఏరియా ఆసుపత్రికి చేరుకున్న ఆర్టీసీ కార్మికులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. డ్రైవర్ నరేష్ మృతదేహంతో ర్యాలీ చేపట్టిన ఆర్టీసీ కార్మికులు, కార్మిక జేఏసీ నాయకులు ఆర్టీసీ డిపో ముట్టడికి యత్నించారు.

 మృతదేహంతో మహబూబాబాద్ ఆర్టీసీ డిపో ముట్టడి యత్నం .. పరిస్థితి ఉద్రిక్తం

మృతదేహంతో మహబూబాబాద్ ఆర్టీసీ డిపో ముట్టడి యత్నం .. పరిస్థితి ఉద్రిక్తం


నరేష్ మృతికి కారణం సీఎం కేసీఆర్ అంటూ నిరసన వ్యక్తం చేసిన నిరసనకారులు మహబూబాబాద్ ఆర్టీసీ డిపో ముట్టడించారు. దీంతో డిపో వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఆందోళనకారులు పెద్దఎత్తున డిపో వద్ద సీఎం కేసీఆర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ లోపలికి వెళ్ళే ప్రయత్నం చేశారు. పోలీసులు వారిని చెదరగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు ఆందోళనలలో భాగంగా పోలీసులు లాఠీలకు పని చెప్పారు. ఇక ఇప్పుడు సైతం మహబూబాబాద్లో ఆందోళనకారులను చెదరగొట్టటానికి పెద్ద సంఖ్యలో పోలీసులు లాఠీలకు పని చెప్తున్నారు.ఆందోళనకారులు మాత్రం లోనికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు.

 ఆర్టీసీ కార్మికుల ఆందోళన .. అరణ్య రోదన

ఆర్టీసీ కార్మికుల ఆందోళన .. అరణ్య రోదన

ఆర్టీసీ కార్మికులు 40 రోజులుగా ఆందోళన చేస్తున్న, చాలా మంది కార్మికులు మనస్తాపంతో ఆత్మహత్య చేసుకుంటున్నా సీఎం కేసీఆర్ మాత్రం స్పందించడం లేదు. ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం కనీసం చర్చలు జరుపుతామని ప్రస్తావన కూడా ప్రస్తుతం లేదు. ఇక హైకోర్టు సైతం ముగ్గురు సుప్రీం మాజీ న్యాయమూర్తులతో కమిటీ వేసి చర్చల కోసం ప్రయత్నిస్తామని చెబుతున్న నేపథ్యంలో, అది ఎంతవరకు సఫలం అవుతుందో అర్థం కాని ఆర్టీసీ కార్మికులు ఆవేదనలో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. నిన్నటి వరకు హైకోర్టు తమ సమస్య పరిష్కారానికి నిర్ణయం తీసుకొని కచ్చితమైన జడ్జిమెంట్ ఇస్తుందని భావించిన ఆర్టీసీ కార్మికులు ఇప్పుడు తాజా పరిణామాల నేపథ్యంలో డైలమాలో పడ్డారు.

English summary
RTC workers families seem to be in dire straits. It is in these circumstances that RTC driver Naresh is found to have committed suicide. he has taken the festicide and he died in mahaboobabad area hospital . RTC workers and labor JAC leaders staged a rally with the dead body of driver Naresh . They tried to take tha body into the rtc depot . but the police stopped the rally and there was a tension atmosphere .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X