వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాలయ్య మరో సంచలనం : తెలంగాణా ప్రభుత్వాన్ని,చిరంజీవిని టార్గెట్ చేస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు

|
Google Oneindia TeluguNews

హిందూపురం ఎమ్మెల్యే,సినీ నటుడు నందమూరి బాలకృష్ణ తాజాగా మరోమారు సినీ పరిశ్రమ వర్గాలపై, తెలంగాణ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అత్యధికంగా పన్నులు కట్టే రంగాలలో సినీరంగం ఒకటి అని అభిప్రాయపడిన బాలకృష్ణ , అందుకే ఇప్పుడున్న పరిస్థితుల్లో సినిమా షూటింగ్ లపై ప్రభుత్వం ఆసక్తి చూపిస్తుందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు చిరంజీవిని, తెలంగాణా సర్కార్ ను టార్గెట్ చేసిన బాలయ్య మరోమారు వివాదం రేపారు.

మీటింగ్ కు బాలకృష్ణను పిలవకపోవటం వెనుక సీఎం కేసీఆర్ ఉన్నారా ? అసలేం జరుగుతుంది ?మీటింగ్ కు బాలకృష్ణను పిలవకపోవటం వెనుక సీఎం కేసీఆర్ ఉన్నారా ? అసలేం జరుగుతుంది ?

 సినిమా ఇండస్ట్రీకి తెలంగాణ ప్రభుత్వం చేసింది ఏంటి?

సినిమా ఇండస్ట్రీకి తెలంగాణ ప్రభుత్వం చేసింది ఏంటి?

కరోనా తీవ్రంగా ప్రబలుతున్న తరుణంలో షూటింగులు చేయడం చాలా ప్రమాదకరమని తెలిసిన తెలంగాణ ప్రభుత్వం సినిమా షూటింగ్ లపై ఆసక్తి చూపించటం వెనుక ఆదాయ వనరులు కారణమని బాలకృష్ణ వ్యాఖ్యానించారు. ఇక అంతే కాదు తెలంగాణ ప్రభుత్వం వైఖరి పైన కూడా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒకపక్క సీఎం కేసీఆర్ కు తనకు ఎలాంటి విభేదాలు లేవని చెబుతూనే మరోపక్క సినిమా ఇండస్ట్రీకి తెలంగాణ ప్రభుత్వం చేసింది ఏంటి అంటూ ప్రశ్నించారు.

 సర్కార్ రెండు ఎకరాల స్థలం కూడా ఇవ్వలేదు

సర్కార్ రెండు ఎకరాల స్థలం కూడా ఇవ్వలేదు

సినిమా ఇండస్ట్రీకి తెలంగాణ ప్రభుత్వం ఫేవర్ గా ఉన్నట్లుగా చాలామంది ఫీలవుతుంటారు కానీ ఇప్పటి వరకూ కనీసం రెండు ఎకరాలు కూడా తెలంగాణ ప్రభుత్వం సినిమా ఇండస్ట్రీ కోసం కేటాయించలేదని సినీ నటుడు నందమూరి బాలకృష్ణ తెలంగాణ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి వ్యాఖ్యానించారు. ఒకవేళ నిజంగా తెలంగాణా సర్కార్ కు సినీ పరిశ్రమ మీద అంత ప్రేమ ఉంటే ఇప్పటి వరకు ఎందుకు భూమి కేటాయించలేదో అంటూ ఆయన అందరూ ఆలోచించేలా వ్యాఖ్యలు చేశారు .

డల్లాస్ లో చిరంజీవి తదితరులు సేకరించిన ఆ విరాళాలు ఏమయ్యాయి?

డల్లాస్ లో చిరంజీవి తదితరులు సేకరించిన ఆ విరాళాలు ఏమయ్యాయి?

ఇక అంతే కాదు చిరంజీవిపై కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు నందమూరి బాలకృష్ణ. చిరంజీవి సహా మరికొందరు ఆ మధ్యన డల్లాస్‌కి వెళ్లి సినీ ఇండస్ట్రీ కోసం రూ.5 కోట్లు విరాళాలు సేకరించినట్లు చెప్పారు. కానీ ఎంత డబ్బులు వచ్చిందన్నది తమకు ఇంతవరకు తెలియదని అలాంటి వాటిలో తలదూర్చడం తనకు ఇష్టం ఉండదు అని బాలకృష్ణ వ్యాఖ్యానించారు. కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో సినిమా షూటింగ్లు ఎక్కడివి అక్కడే నిలిచిపోవడంతో సినీ పరిశ్రమలో పని చేస్తున్న కార్మికులు ఇబ్బందులు పడుతున్న పరిస్థితిపై ఆయన మాట్లాడారు .

మరోమారు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బాలయ్య .. చిరంజీవి స్పందిస్తారా ?

మరోమారు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బాలయ్య .. చిరంజీవి స్పందిస్తారా ?

ఇక సినీ కార్మికుల ఇబ్బందుల దృష్ట్యా వారి కోసమే తిరిగి సినిమా షూటింగ్ లను కొనసాగించాల్సిన అవసరం ఉందని భావించిన సినీ పరిశ్రమ వర్గాలు, తెలంగాణ ప్రభుత్వం తో సమావేశమై షూటింగ్ లకు అనుమతి ఇవ్వాలని చర్చలు జరిపిన నేపథ్యంలో బాలకృష్ణను పిలవకపోవడంపై ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇక ఆ తర్వాత నుంచి కొనసాగుతున్న దూరంలో బాలకృష్ణ తెలంగాణ సర్కార్ ను, అలాగే చిరంజీవిని టార్గెట్ చేసి వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ వ్యవహారంపై ఇప్పటివరకు చిరంజీవి స్పందించలేదు. ఇక తాజాగా డల్లాస్ చిరంజీవి టూర్ వ్యాఖ్యలపై మెగాస్టార్ ఏవిధంగా స్పందిస్తారో అన్న ఆసక్తి నెలకొంది.

English summary
Hindupuram MLA and film actor Nandamuri Balakrishna recently made a sensational comment on the film industry circles mainly chiranjeevi and the Telangana government. Balakrishna, who believes that cinema is one of the most taxing sectors, said that the government is interested in film shooting in the present circumstances.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X