వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పరిషత్ పోరులో కేసీఆర్ కు చేదు అనుభవం .. కేసీఆర్ దత్తత గ్రామంలో టీఆర్ఎస్ ఓటమి

|
Google Oneindia TeluguNews

తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్ఎస్ హవా కొనసాగుతోంది. అన్ని జిల్లాల్లో టీఆర్ఎస్ ప్రభంజనం కొనసాగుతుంది. గులాబీ జెండా రెపరెపలాడుతుంది. కారు టాప్ గేర్ లో దూసుకుపోతుంది. కానీ అనూహ్యంగా సీఎం కేసీఆర్ దత్తత తీసుకున్న గ్రామంలో మాత్రం టీఆర్ఎస్ అభ్యర్థి ఓటమిపాలయ్యారు.

చేప మందు పంపిణీ ఆపివేయాలని హైకోర్టులో పిటీషన్ .. గతంలోనూ వివాదాలుచేప మందు పంపిణీ ఆపివేయాలని హైకోర్టులో పిటీషన్ .. గతంలోనూ వివాదాలు

కేసీఆర్ దత్తత గ్రామం చినముల్కనూర్ లో టీఆర్ఎస్ ఎంపీటీసీ అభ్యర్థి ఓటమి .. కేసీఆర్ కు షాక్

కేసీఆర్ దత్తత గ్రామం చినముల్కనూర్ లో టీఆర్ఎస్ ఎంపీటీసీ అభ్యర్థి ఓటమి .. కేసీఆర్ కు షాక్

కరీంనగర్ జిల్లా చినముల్కనూర్ ఎంపీటీసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థికి పరాజయం తప్పలేదు. ఇక్కడ ఇండిపెండెంట్ గా పోటీచేసిన రాజేశం ఎంపీటీసీగా విజయం సాధించారు. అధికార పార్టీ నుండి ఎన్నికల బరిలోకి దిగిన అభ్యర్థి ఓటమిపాలయ్యారు. అందులోనూ సాక్షాత్తు తెలంగాణా సీఎం కేసీఆర్ దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తున్న గ్రామంలో టీఆర్ ఎస్ ఓటమిపాలు కావటం కేసీఆర్ కు షాక్ అని చెప్పాలి. ఇప్పటికే మాజీ ఎంపీ, సీఎం కేసీఆర్ కుమార్తె స్వగ్రామంలో మాత్రం ఫలితాలు రివర్స్ లో వచ్చాయి. మరోమారు కవితకు సైతం చేదు అనుభవం ఎదురైంది.

 కేసీఆర్ కుమార్తె కవితకు షాకిచ్చిన పోతంగల్ ప్రజలు

కేసీఆర్ కుమార్తె కవితకు షాకిచ్చిన పోతంగల్ ప్రజలు

నవీపేట మండలం పోతంగల్‌లో టీఆర్‌ఎస్‌ నుండి బరిలోకి దిగిన ఎంపీటీసీ అభ్యర్థి ఓటమి పాలయ్యారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థిపై బీజేపీ నుండి పోటీ చేసిన కత్రోజి రాజు ఘన విజయం సాధించారు. ఎంపీటీసీ అభ్యర్థి ఓటమి పాలయ్యారు. 96 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఇప్పటికే నిజామాబాద్ లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి పాలైన కవితకు స్వగ్రామంలో టీఆర్ఎస్ ఓటమి పాలవడం మరింత ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్రమంతా గెలుస్తూ తానూ ప్రాతినిధ్యం వహించే చోట, తన సొంత వూర్లో ఓటమి పాలు కావటం చాలా అవమానకర విషయం. ఇప్పుడు గులాబీ బాస్ కు అవమానం తప్పలేదు. దత్తత గ్రామంలో ఓటమి పాలై గులాబీ బాస్ ఖంగు తిన్నారు.

రాష్ట్రం అంతా గులాబీ జోరు .. కానీ తండ్రీ బిడ్డలకు ఝలక్ ఇచ్చిన స్థానిక పోరు

రాష్ట్రం అంతా గులాబీ జోరు .. కానీ తండ్రీ బిడ్డలకు ఝలక్ ఇచ్చిన స్థానిక పోరు

తెలంగాణలో ఇప్పటివరకు వెల్లడైన ఫలితాల ప్రకారం టీఆర్ఎస్ 3,042 ఎంపీటీసీ స్థానాలు, 44 జడ్పీటీసీ స్థానాలను కైవసం చేసుకుంది. కాంగ్రెస్ 1,101 ఎంపీటీసీ స్థానాలు, 3 జడ్పీటీసీ స్థానాలను గెలుచుకుంది. ఇక , తెలుగుదేశం పార్టీకి 20 ఎంపీటీసీ స్థానాలు ,బీజేపీ 184 ఎంపీటీసీ స్థానాలను చేజిక్కించుకోగా, ఇతరులు 487 ఎంపీటీసీ స్థానాల్లో జయకేతనం ఎగురవేశారు. తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల్లో టీఆర్ఎస్ పార్టీ ఏకపక్షంగా గెలుపొందుతుందని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి ఎదురేలేదని తెలిపారు. రాష్ట్రంలో అన్ని జడ్పీ పీఠాలను కైవసం చేసుకుంటామని జోస్యం చెప్పారు. జడ్పీ చైర్మన్ ప్రక్రియ సమన్వయానికి సంబంధించి అన్ని జిల్లాలకు ఇన్ ఛార్జ్ లను ప్రకటించారు కేటీఆర్. జిల్లాల వారీగా సీనియర్ నేతలకు సమన్వయ బాధ్యతల్ని అప్పగించినట్లు తెలిపారు.తెలంగాణా రాష్ట్రంలో కారు జోరు కొనసాగుతున్నా గులాబీ బాస్ ఆశించిన ఫలితాలు రావటం లేదు. తండ్రీ బిడ్డలకు స్థానిక పోరు ఝలక్ ఇచ్చిందనే చెప్పాలి.

English summary
Telangana Rashtra Samiti is heading for capturing maximum number of seats in MPTC and ZPTC elections in the state. But, TRS faced another defeat in Chinna mulkanoor village KCR's adopted village . TRS candidate of chinna mulkanoor lost in the hands of independent candidate Rajesham . Kavitha also defeated in her own village potangal .Now, the results creating ripples among the TRS party circles.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X